Breaking News

ఎకో ఊటీ.. నీలగిరి సౌందర్యం

Published on Mon, 09/23/2024 - 10:19

ఊటీకి టూరెళ్దామా? అంటే ఎగిరి గంతేసిన బాల్యం వృద్ధాప్యంలోకి అడుగుపెట్టింది. మధ్యతరం ఊటీలో ఏముంది అవే టీ తోటలు, అదే దొడబెట్ట, అదే టాయ్‌ ట్రైన్, బొటానికల్‌ గార్డెన్, పాటలు చిత్రీకరించిన కూనూరు... అని పెదవి విరిచేశాయి. డెబ్బై, ఎనభైల దక్షిణాది సినిమాల్లో చూసిందే కదా ఊటీ అని తేల్చేయడమూ కరెక్టే. అయితే ఊటీ అంటే సినిమాల్లో చూసిన ఊటీ మాత్రమే కాదు. ఇంకా చూడాల్సిన ఊటీ చాలానే ఉంది. ముఖ్యంగా ఎకో టూరిజమ్‌లో ఊటీకి పాతిక కిలోమీటర్ల దూరాన నీలగిరుల్లో విస్తరించిన అవలాంచే సరస్సు వైపు అడుగులు వేద్దాం.

మెల్లగా సాగే ప్రయాణం... ఊటీ ఎకో టూరిజమ్‌ అవలాంచె చెక్‌పోస్ట్‌ నుంచి మొదలవుతుంది. ఇరవై కిలోమీటర్ల ప్రయాణం మధ్యలో మూడు వ్యూ పాయింట్లు ఉంటాయి. షోలా ఫారెస్ట్‌ వ్యూ పాయింట్‌. మరికొంత దూరంలో భవానీ ఆలయం, లక్కడి. ఈ మూడు పాయింట్లను కలుపుతూ రౌండ్‌ ట్రిప్‌ ఇది. ప్రయాణం వేగంగా గమ్యానికి చేరాలన్నట్లు ఉండదు. ప్రదేశాన్ని ఆసాంతం కళ్లారా చూడడానికి రెండు గంటల సేపు సాగుతుంది. తిరిగి అవలాంచె చెక్‌పోస్టు దగ్గర దింపుతారు.

పశ్చిమం నుంచి తూర్పుకు ప్రయాణం... అవలాంచె సరస్సు చేరడానికి సన్నటి రోడ్డు మీద సాగే ప్రయాణం. ప్రకృతి సౌందర్యంతో΄ాటు కొండ శిఖరాలను చూడవచ్చు. భవానీ ఆలయం నుంచి అరకిలోమీటరు దూరం నడిస్తే అందమైన జల΄ాతం, అప్పర్‌ భవానీ డ్యామ్‌ బ్యాక్‌ వాటర్స్‌ కనువిందు చేస్తాయి. భవానీ నది కేరళలోని పశ్చిమ కనుమలలో పుట్టి తూర్పు దిశగా ప్రవహిస్తూ తమిళనాడుకి వచ్చి కావేరినదిలో కలుస్తుంది. 

గిరి జనపథం... ఊటీ ఎకో టూరిజమ్‌ జోన్‌లోకి ప్రైవేట్‌ వాహనాలను అనుమతించరు. పర్యాటకుల వాహనాలు అవలాంచె చెక్‌పోస్ట్‌ దగ్గర ఆగిపోవాలి. అక్కడి నుంచి టూరిజమ్‌ డిపార్ట్‌మెంట్‌ వాహనంలోకి మారాలి. విడిగా ట్రిప్‌ కావాలనుకుంటే ఎనిమిది మందికి ఒక జీపు ఏర్పాటు చేస్తారు. ఈ టూర్‌లో నీలగిరుల్లో టోడా గిరిజన తెగ నివసించే ప్రదేశాలను కూడా చూడవచ్చు. వారి ఇళ్ల నిర్మాణం, దుస్తుల మీద వారు చేసే ఎంబ్రాయిడరీ ప్రత్యేకమైనవి. ఒక చేతిరుమాలైనా కొనుక్కుంటే ఆ కళకు ్రపోత్సాహంగానూ, టూర్‌కి గుర్తుగానూ ఉంటుంది.
∙  

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)