Breaking News

జంట అరటిపండ్లు తినకూడదా?.. దేవుడికి కూడా సమర్పించకూడదా?

Published on Mon, 07/10/2023 - 13:06

అరటిపళ్ళు కొనడానికి వెళ్ళినప్పుడు అరటిపళ్ళ వ్యాపారి అరటి గెలలోంచి అరటి హస్తాలు కోస్తున్నప్పుడు మన కళ్ళు ఆ హస్తం మీదే నిలుస్తాయి. ఆ హస్తంలో ఒకదానితో మరొకటి అతుక్కుపోయి వున్న జంట అరటిపళ్ళుగానీ ఉన్నాయా అని చూస్తాం. ఒకవేళ వుంటే ఆ కవల పండు వద్దని చెప్పి తీయించేస్తాం. కారణం.. జంట అరటిపళ్ళు పిల్లలు తినకూడదు. పైగా తింటే కవల పిల్లలు పుడతారనే అనే ఒక నమ్మకం ప్రజల్లో నాటుకుపోయింది. అసలు నిజానికి తినొచ్చా..తింటే ఏమవుతుంది? దేవుడికి సమర్పించొచ్చా లేదా తదితరాలు గురించి తెలుసుకుందామా!

కవల అరటి పళ్ళను దేవుడికి పెట్టకూడదు. ఇలాంటి నమ్మకాలు మనకి వుంటాయి. అందుకే కవల అరటిపళ్ళను తీసుకోవడానికి ఇష్టపడం. అయితే చాలాసార్లు మనం కొన్న అరటిపళ్ళలో మనకి తెలియకుండానే కవల అరటిపళ్ళు వచ్చేస్తూ వుంటాయి. వాటిని పిల్లలకి పెట్టకుండా, దేవుడికి పెట్టకుండా పెద్దవాళ్ళే తింటూ వుంటారు. ఇంతకీ, కవల అరటిపళ్ళను పిల్లలకు పెట్టోచ్చా, ముఖ్యంగా పెళ్లి కాని వారు తినోచ్చా అంటే..కవలలు పుడతారని భారతీయుల విశ్వాసమే గానీ శాస్త్రీయంగా మాత్రం ఎక్కడా నిరూపితం కాలేదు.  

ఇలా ఫిలిప్పీన్స్‌ వాసులు కూడా మనలానే నమ్ముతారట. వారు కూడా జంట అరటిపళ్లు తినరట. ముఖ్యంగా గర్భిణి స్త్రీలు మొదటి మూడు నెలల్లోపు తింటే కవలలు పుడతారని మన వాళ్లు గట్టిగా నమ్ముతారు. అలాగే కొందరూ.. కవల పిల్లలు కావాలనే ఉద్దేశంతో జంట అరటిపళ్లు తింటారని చెబుతున్నారు. కానీ ఇందులో వాస్తవం లేదని నిపుణులు చెబుతున్నారు. అలా జరగలేదని నొక్కి చెబుతున్నారు. అదుకు ఆస్కారం లేదంటూ సైన్స్‌ కొట్టిపారేస్తుంది. అదొక మూఢ నమ్మకమే తప్ప మరేం కాదని తేల్చి చెబుతోంది. 

దేవతలకు పెట్టొచ్చా అంటే..
దీనికి పండితులు ఏం చెప్పారంటే.. ”అరటి చెట్టు అంటే మరెవరో కాదు. సాక్షాత్తూ దేవనర్తకి రంభ అవతారమే. శ్రీమహావిష్ణువు దగ్గర రంభ అందగత్తెనని అహంకార పూరితంగా వ్యవహరించడం వల్ల ఆమెను భూలోకంలో అరటిచెట్టుగా జన్మించమని మహావిష్ణువు శపించాడు. అయితే ఆమె తన తప్పు తెలుసుకుని ప్రాధేయ పడటంతో దేవుడికి నైవేద్యంగా వుండే అర్హతను విష్ణువు రంభకి వరంగా ఇచ్చారు.

అందువల్ల అంత పవిత్రమైన పండులో మనం దోషాలను ఎంచాల్సిన అవసరం లేదంటున్నారు. కవల అరటిపళ్ళను నిరభ్యంతరంగా దేవతలకు అర్పించవచ్చు. అయితే తాంబూలంలో మాత్రం జంట అరటి పళ్ళను పెట్టకూడదట. ఎందుకంటే కవల అరటి పండులో రెండు పళ్ళు ఉన్నప్పటికీ అది ఒక్క పండుకిందే లెక్కలోకి వస్తుంది. మరి తాంబూలంలో ఒక్కపండు పెట్టకూడదు కదా..! అలాగని రెండు కవల అరటిపళ్లు తాంబూలంలో పెట్టడం బాగోదు. 

పైగా తీసుకోవడానికి అవతలి వాళ్లు సంకోచించే అవకాశం ఉంది, మరోవైపు తాంబులాన్ని వద్దనకూడదు అనేది శాస్త్రం. దీంతో అవతలి వ్యక్తి  ఈ రెండు సమస్యలతో సందిగ్ధంలో పడి కలత చెందే అవకాశం ఉంది. ఇంటికి వచ్చిన అతిధిని గౌరవించడం మన సంప్రదాయమేగాక ఆనందంగానే వారిని  సాగనంపుతాం. అందువల్ల  తాంబూలంలో మాత్రం కవల అరటిపళ్ళను మినహాయించడమే మంచిది. 

(చదవండి: ఉపేక్షిస్తే ఉనికికే ప్రమాదం!)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)