Breaking News

మామిడి పండ్లను తినడం వల్ల మొటిమలు వస్తాయా?

Published on Mon, 05/13/2024 - 16:56

మామిడి      పండ్లు తినడం వల్ల ముఖంపై మొటిమలు, గడ్డలు వస్తాయని చాలామంది చెబుతుంటారు. పాపం ఆ ఉద్దేశ్యంతోనే మామిపండు తినేందుకు భయపడుతుంటారు. నిజానికి మామిడి పండ్లకు మొటిమలకు సంబంధం ఉందా? వాటిని తినడం వల్ల వస్తాయా ? అంటే..

వేసవిలో అందరూ మామిడి పండ్లంటే ఇష్టంగా తింటారు. పోషకాల రీత్యా మామిడిని పండ్లలో రారాజు అని పిలుస్తారు. నిజానికి ఈ మామిడి ఆగ్నేయాసియాలో ఉద్భవించింది. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా సాగు చేసే సాధారణ పండుగా మారింది. ఈ మామిడి తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల విటమిన్లు, పోషకాలు అందుతాయి. దీనిలో బీటా కెరోటిన్‌ అధికంగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తుందని డెర్మటాలజీ నిపుణులు చెబుతున్నారు.

ఈ బీటా కెరోటిన్‌ అనేది యాంటీ ఆక్సిడెంట్‌ పిగ్మెంట్‌, శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతుంది. అంతేగాక దీనిలో ఉండే పోషకాలన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మంటను తగ్గించి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అలాంటి మామిడి పండ్లను తింటే కొందరిలో మొటిములు ఎందుక వస్తాయంటే..? అధిక చక్కెర స్థాయి, గ్లైసెమిక్‌ సూచిక అని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ గ్లైసెమిక్‌​ ఇండెక్స్‌ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను సూచించే స్కేల్‌. 

ఇక్కడ పండ్లు, బియ్యం, ఇతర కార్బ్‌ రిచ్‌ ఉత్పత్తులు, ముఖ్యంగా వేయించిన లేదా ప్రాసెస్‌ చేసిన ఆహారాల్లో అత్యధిక గ్లైసెమిక్‌ సూచికను కలిగి ఉంటాయి. అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ డెర్మటాలజీ అసోసీయేషన్‌ ప్రకారం..తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఆహారం బరువు తగ్గడానికి మెటిమలు తగ్గించడానికి 91% సహాయపడుతుందని వైద్యులు తెలిపారు. ఇక్కడ మొటిమలు రక్తంలోని చక్కెర స్థాయిలతో ముడిపడి ఉందని తెలిపారు. అందులోనూ ఈ మామిడిపండ్లను చిన్నపిల్లలు, టీనేజ్‌ పిల్లలు తెగ ఇష్టంగా తింటారు. 

ఇది వారు యుక్త వయసుకు చేరుకునే సమయం..సరిగ్గా ఈ టైంలోనే వారిలో సెబమ్‌ ఉత్పత్తి అవుతుంటుంది. దీంతో వారిలో జిడ్డు చర్మం, మొటిమలు మొదలయ్యే దశ స్లోగా మొదలవుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే ఈ మామిడి పండ్లు కూడా వాళ్లుగా ఇష్టంగా తినడంతో పెద్దవాళ్లు మొటిమలకి, మామిడి పండ్లకి లింక్‌ చేసి..అవి తినడం వల్లనే వస్తున్నాయని అనేస్తారు. వాస్తవానికి అది అపోహ అని తేల్చి చెబుతున్నారు నిపుణులు.  

సముతల్యమైన ఆహారం తీసుకున్నవాళ్లు హాయిగా మామిడి పండ్లను తినవచ్చని చెబుతున్నారు. ఇక్కడ మొటిమలు చర్మ పరిస్థితికి ఒక లక్షణం అనేది గ్రహించాలి. ఇక్కడ చర్మాన్ని శుభ్రంగా ఉంచుకుని, మంచి పరిశుభ్రతను పాటిస్తూ.. మొటిమలను నిరోధించే క్రీమ్‌లను ఉపయోగిస్తే..ఈ సమస్య నుంచి సులభంగా బయటపడగలుగుతారు. పైగా చర్మం కూడా ప్రకాశవంతంగా అందంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు.

(చదవండి: గురుద్వారా సేవా కార్యక్రమంలో మోదీ! ఏంటీ లంగర్‌ ..?)

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)