Breaking News

పరదా చాటున అలర్జీ మాటేస్తది!

Published on Tue, 10/15/2024 - 12:36

తలుపులకూ, కిటికీలకు పరదాలు (డోర్‌ అండ్‌ విండో కర్టెయిన్స్‌) అందాన్నీ, ప్రైవసీని ఇస్తాయి. కొన్ని స్టార్‌ హోటల్స్‌లో మంచి రాజసపు లుక్‌ కోసం వెరైటీగా కర్టెన్‌లు అమరుస్తారు. ఇటీవల ఇండ్లలోనూ ఈ తరహాలోనే రంగురంగుల ఆకర్షణీయమైన కర్టెన్స్‌ అమర్చుకోవడం చాలా సాధారణం. కొన్నిసార్లు ఇంటి పై సజ్జబల్లల మీద / అటక మీద పాత సామాన్ల వంటివి సర్దిపెట్టినప్పుడు అవి బయటకు కనపడకుండా పరదాలు అడ్డుగా అమర్చి ఉంచడమూ మామూలే. అయితే వాటిని నెలల తరబడి అలాగే ఉంచడం వల్ల వాటి వెనక అలర్జీకి కారణమయ్యే డస్ట్‌మైట్స్‌ చేరి అలర్జీ కలిగించవచ్చు. అది ఎన్ని రకాలుగా కలుగుతోందో, నివారణకు ఏం చేయాలో తెలుసుకుందాం.

సాధారణంగా కర్టెన్లతో వచ్చే అలర్జీలు రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించడం వల్ల... అత్యంత చురుకుగా పనిచేసే ఆ వ్యాధి నిరోధక వ్యవస్థ సొంత కణాలపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల అలర్జీలు వస్తాయి. అది ఈ కింది విధాలుగా జరుగుతుంది. 

 ఫ్యాబ్రిక్‌ కర్టెన్లలో చేరే అలర్జెన్లూ, డస్ట్‌మైట్స్‌ : 
కరై్టన్లు ఇళ్లలోకి దుమ్మూ, ధూళి రాకుండా నిరోధిస్తాయి. ఈ క్రమంలో దుమ్ము ధూళిలో ఉండే డస్ట్‌మైట్స్‌... తలగడల్లో, పక్కబట్టల్లో చేరినట్టే పరదాల్లోకీ చేరతాయి. ఒక అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే... 30 గ్రాముల దుమ్ములో కనీసం 14,000 డస్ట్‌మైట్స్‌ ఉంటాయి. ఒక చదరపు గజం విస్తీర్ణంలో కనీసం 1,00,000 (లక్ష) వరకు ఉండవచ్చు. ఒక్కో డస్ట్‌మైట్‌ తన జీవితకాలంలో 300 మిల్లీగ్రాముల విసర్జకాలను వెలువరిస్తుంది. ఈ విసర్జకాల్లోని ఒక రకమైన ప్రోటీన్‌ మనుషులు శ్వాసించేటప్పుడు ముక్కులోకి వెళ్లి... అది వారిలో అలర్జీ కలిగిస్తుంది. కొన్నిసార్లు అలర్జీలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకూ దారితీస్తాయి.  కేవలం డస్ట్‌మైట్స్‌ మైట్స్‌ మాత్రమే కాకుండా అనేక రకాల అలర్జెన్స్‌ సైతం కర్టెన్లలో దాగి ఉంటాయి. అవి కలిగించే అలర్జీ కారణంగా దగ్గడం, తుమ్ములు రావడం, అదేపనిగా ముక్కుకారడం, భయం కలిగించేలా కళ్లెర్రబడటం వంటి రియాక్షన్స్‌ కనిపిస్తాయి. కొందరిలో ఈ డస్ట్‌మైట్స్, అలర్జెన్లు తీవ్రమైన  ఆస్తమాను కలిగించి, ఊపిరాడకుండా చేస్తూ తీవ్రంగా బాధిస్తాయి. 

మౌల్డ్స్‌ లాంటి ఫంగస్‌ చేరడం : కర్టెన్లలో మౌల్డ్స్‌ వంటి  ఫంగల్‌ జాతికి చెందిన అతి సూక్ష్మమైన జీవులు చేరతాయి. ఇవి ఒకరకంగా బూజు లాంటివి. గాలిలో తేమ ఉండేచోట్ల, వెలుతురు తక్కువగా ప్రసరించే చోట్లలో ఈ మౌల్డ్స్, ఇతర ఫంగస్‌లు పెరుగుతాయి. అన్ని చోట్లలాగే కర్టెన్లలో చేరినప్పుడు అవి కలిగించే అలర్జిక్‌ రియాక్షన్‌ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు.  

సూక్ష్మజీవుల ఆవాసంగా : అనేక రకాల సూక్ష్మ
జీవులు (జెర్మ్స్‌) సైతం పెద్దసంఖ్యలో కర్టెన్లలో చేరి అవి కూడా ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. 
∙దుమ్ము కణాలు : అత్యంత సూక్ష్మమైన దుమ్ము కణాలు కూడా అలర్జీలకు తెచ్చి పెడతాయి. 
ప్లాస్టిక్‌ కర్టెన్ల విషయంలో : మొదట్లో ఇళ్లలో, నివాస ప్రదేశాల్లో కేవలం క్లాత్‌ కర్టెన్లు మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇటీవల ఉపయోగాలూ, ఫ్యాషన్‌ దృష్ట్యా ప్లాస్టిక్‌తో తయారైనవీ వాడుతున్నారు. ఇక బాత్‌రూమ్‌ల విషయానికి వస్తే... అక్కడ అవి నీళ్ల వల్ల పాడైపోకుండా ఉండటం కోసం పూర్తిగా వాటర్‌ప్రూఫ్‌ మెటీరియల్‌తో తయారయ్యేవే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని ప్లాస్టిక్‌కర్టెన్లు ఫ్యాబ్రిక్‌లతో చేసిన పరదాల్లో అటు ఇటు ఒంగకుండా (ఫ్లెక్సిబుల్‌గా లేకుండా) ఉంటాయి. అందుకే అవి బట్టలాగే ఎటు పడితే అటు కాస్తంత వంగేందుకు వీలుగా వాటిల్లో ‘థాలేట్‌’ అనే పదార్థంతో తయారు చేస్తారు. ఇదే పదార్థాన్ని వాల్‌పేపర్లు, ఫ్లెక్సీల్లో కూడా వాడతారు.

ప్లాస్టిక్‌కరై్టన్లతో ఎంతో హాని... 
ఈ ప్లాస్టిక్‌వంటి కర్టెన్లలోని హానికర / విష పదార్థాలు (టాక్సిక్‌ మెటీరియల్స్‌) కేవలం అలర్జీలను ప్రేరేపించడం, శ్వాససంబంధ సమస్యలను తెచ్చిపెట్టడం మాత్రమే కాకుండా హార్మోన్ల వ్యవస్థపైన కూడా ప్రతికూలంగా పనిచేసి ప్రత్యుత్పత్తి వ్యవస్థనూ దెబ్బతీస్తాయి. ఇక గర్భవతులపై కూడా ప్రతికూలంగా పనిచేయడం వల్ల పుట్టబోయే పిల్లలకు ఏడీహెచ్‌డీ (అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌ అటెన్షన డిజార్డర్‌) వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్లాస్టిక్‌వంటి పదార్థాలతో తయారైన కర్టెన్ల కారణంగా నాలుగు నుంచి తొమ్మిదేళ్ల పిల్లలో ఏడీహెచ్‌డీ (అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌ యాక్టివ్‌ డిజార్డర్‌) వచ్చే అవకాశాలు ఎక్కువని ‘మౌంట్‌ సినాయ్‌ మెడికల్‌ సెంటర్‌’ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనల్లోనూ తేలింది.

అలర్జీలు వస్తే... 
కర్టెన్లు లేదా ఇతరత్రా కూడా అలర్జీలు వచ్చినప్పుడు తీవ్రతను బట్టి డాక్టర్ల పర్యవేక్షణలో యాంటీహిస్టమైన్స్‌ వాడాల్సి ఉంటుంది. తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్లు చాలా నిశితంగా పరిశీలిస్తూ, అవసరమైన మోతాదుల్లో స్టెరాయిడ్స్‌ ఇస్తూ చికిత్స అందిస్తారు. ఈ పరిస్థితి తెచ్చుకోవడం కంటే కర్టెన్స్‌ను ఎప్పటికప్పుడు ఉతికి శుభ్రం చేసుకోవడం వల్ల ఇంటి పరిశుభ్రతతో పాటు ఒంటి ఆరోగ్యాన్నీ కాపాడుకున్నట్లు 
అవుతుంది.

అలర్జీల నివారణకు...

∙డోర్, విండో కర్టెన్ల కోసం వీలైనంతవరకు వస్త్రంతోతయారైన పరదాలు (ఫ్యాబ్రిక్‌ కర్టెన్స్‌) వాడటమే మంచిది షవర్‌ కర్టెన్లు కోసం ఫ్యాబ్రిక్‌ మెటీరియల్‌ వాడటం మంచిది ∙అయితే... బాత్‌రూమ్‌ల్లో వాడటం వల్ల అవి తడిసే అవకాశాలు ఎక్కువ కాబట్టి అక్కడ పీవీసీ మెటీరియల్‌ కంటే హానికరం కాని అలర్జీ ఫ్రెండ్లీ బ్లైండ్స్‌ వంటివి వాడటం మంచిది ∙కర్టెన్లు ఫ్యాబ్రిక్‌ లేదా ప్లాస్టిక్‌మెటీరియల్‌తో చేసినవైనా బాగా మాసిపోయే వరకు ఆగకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచడం అవసరం. ఫ్యాబ్రిక్‌ మెటీరియల్‌తో తయారైన కర్టెన్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతికి, పూర్తిగా పొడిబారే వరకు ఆరబెట్టడం... అదే విధంగా ప్లాస్టిక్‌మెటీరియల్‌తో తయారైన వాటిని డిస్‌ఇన్ఫెక్టెంట్స్‌తో తరచూ శుభ్రపరచడం చాలా అవసరం. ఇలా ΄్లాస్టిక్‌తో తయారైనవి వాడాల్సి వచ్చినప్పుడు హైపో అలర్జెనిక్‌ వాషబుల్‌వి వాడాలి. దాంతో వాటిని కూడా సబ్బుతో కడిగినట్టే కడిగే అవకాశం ఉంటుంది.  

#

Tags : 1

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)