దసరాకు ఆ పేరు ఎలా వచ్చింది?

Published on Sat, 10/05/2024 - 12:11

దసరా పండగకు కొత్త బట్టలు కొనుక్కోవడం, అమ్మ చేసిన రకరకాల పిండివంటలు తినడం, సెలవలకు ఊళ్లకెళ్లడం అందరికీ తెలుసు. అయితే అంతకన్నా ముందు అసలు దసరా పండగకు ఆ పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకోవాలి కదా... అక్కడికే వద్దాం... దశ అహః అంటే పది రోజులు అని అర్థం. దశ అహః అనే పదమే దశహర అయింది. దశహర, పది రోజులు అనే పదం కాలక్రమంలో ‘దసరా’ గా మారింది. దసరా అంటే పది జన్మల పాపాలను, పది రకాలైన పాపాలను పోగొట్టేది అనే అర్థం కూడా వ్యాప్తిలో ఉంది.

దుష్టరాక్షసులయిన రావణ కుంభకర్ణమేఘనాథులను సంహరించినందుకు గుర్తుగా కొన్ని ప్రాంతాలలో వారి దిష్టిబొమ్మలను తయారు చేసి టపాసులతో పేల్చేయడమో లేదా దహనం చేయడమో ఒక ఉత్సవంగా నిర్వహిస్తారు దసరా అంటే దక్షిణాదిన అమ్మవారి పూజకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో, ఉత్తరాదిన రాముని లీలలను గానం చేసేందుకు అంతే ఉత్సాహం చూపుతారు. 

వారి దృష్టిలో దసరా అంటే అమ్మవారు మహిషాసురుని సంహరించిన రోజు మాత్రమే కాదు, రాముడు, రావణుని చంపిన రోజు కూడా. అందుకే ఈ పది రోజుల పాటు అక్కడ రామాయణంలో ఘట్టాలను వర్ణిస్తూ.. చివరి రోజున ‘రావణ దహన్‌’ పేరుతో రావణుడి భారీ దిష్టిబొమ్మను దహనం చేస్తారు. దాదాపు 50 ఏళ్ల నుంచి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏటా ఈ వేడుకలు అట్టహాసంగా సాగుతాయి. ఈ వేడుకలను ప్రత్యక్షంగా చూడటానికి వేలాది భక్తులతో పాటు రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు కూడా తరలివస్తారు.

సమయం, వ్యక్తిగత కారణాల రీత్యా కొంత మందికి రామ్‌లీలా మైదానంలో జరిగే వేడుకలను వీక్షించడం కుదరదు. చాలా మందికి ఈ వేడుకల విశిష్టత కూడా తెలియదు. ఈ నేపథ్యంలో ప్రసిద్ధ రెలీజియస్‌ యాప్‌ ‘హౌస్‌ ఆఫ్‌ గాడ్‌’ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. రామ్‌లీలా మైదానంలో వేడుకలను ఈ యాప్‌ ద్వారా లైవ్‌ స్ట్రీమింగ్‌ అందించనుంది. 

Videos

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

కొండా రెడ్డి బురుజు సాక్షిగా దొరికిన బడి దొంగలు

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)