నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా
Breaking News
చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డులు
ఒక్క పోటుతో.. చిన్నారెడ్డి ఫస్ట్ రియాక్షన్
సురేఖ బర్తరఫ్.. కొండా మురళి సంచలన ట్వీట్
ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన చాట్‌జీపీటీ, జెమిని ఏఐ
మోదీకి ఆ కానుక ఇవ్వాలనుకున్నా.. కానీ ఏమైందంటే?
శ్రీకాంత్ అద్భుత విజయం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర
హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు.. ఈ రూట్లలో వెళ్తున్నారా?
వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు
అగార్కర్ అందుకే రాలేదు.. రోహిత్ గురించి ఎందుకు?: బీసీసీఐ
‘బీజేపీ నేతలు సమాధానం చెప్పాల్సిందే’
రేవంత్‌రెడ్డిని శపిస్తున్నాను: కొండా సుస్మిత సంచలనం
తెలంగాణ సీఈఓ సుదర్శన్‌రెడ్డికి ‘సర్’ నోటీసులు
మీసం మెలేసిన కొండా మురళి
స్త్రీవాద దిగ్గజం, ప్రముఖ జర్నలిస్టు, రచయిత్రి కన్నుమూత
గతంలోనూ మంత్రులు బర్తరఫ్.. ఎవరెవరు? ఎప్పుడెప్పుడంటే?
తెలంగాణ రాజకీయాల్లో నెక్ట్స్ ఏంటి?
కొండా సురేఖ వివాదం.. ఎలా మొదలైంది? ఎప్పుడేం జరిగింది?
స్కార్పియోని రూఫ్‌టాప్ ఎక్కించాడు? ఎందుకో తెలుసా?
రూ. 1,200 కోట్లతో వందేళ్లు నిలిచేలా కొత్త సెక్రటేరియట్
ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్‌గా చిన్నారెడ్డి తొలగింపు
కనకదుర్గమ్మ జనులను కాచుగాత!
Published on Wed, 10/01/2025 - 11:36
విజయవాటిక యందు విజయదుర్గ
నామమున నున్న జగదంబ కోమలాంగి
సిరులు కురిపించు, భగవతి
సింధుతనయ!
కనకదుర్గమ్మ జనులను కాచుగాత!!
హస్తముల పుష్పశరమును, అంకుశమ్ము,
నెన్నుదుట కాంతి జిమ్మెడి నేత్రమొకటి,
విశ్వజనని లలితగా వెలసినట్టి
కనకదుర్గమ్మ జనులను కాచుగాత!!
అష్టభుజములు ధరియించి దుష్టులైన
రక్కసుల గర్వమణచిన రౌద్రమూర్తి!
సర్వమంగళదాయిని జగము లేలు
కనకదుర్గమ్మ జనులను కాచుగాత!!
అక్షమాల అలరుచుండ హస్తమందు
పుస్తకమును దాల్చి వేరొక హస్తమందు,
కమలమందున కూర్చున్న కల్పవల్లి!
కనకదుర్గమ్మ జనులను కాచుగాత !!
పాయసాన్నంబు నిండిన పాత్రతోడ
‘అన్నపూర్ణ’వై కృపగాంచు కన్నతల్లి!
భక్తులకు వరము లొసంగు భాగ్యరాశి
కనకదుర్గమ్మ జనులను కాచుగాత !!
– డా. జంధ్యాల పరదేశి బాబు, విశ్రాంత తెలుగు ఆచార్యులు ‘
91219 85294
#
Tags : 1