శరన్నవరాత్రులు..ఎనిమిదో రోజు దుర్గాదేవి అలంకారం

Published on Wed, 10/09/2024 - 16:19

దుర్గతులను నివారించే పరాశక్తి ఎనిమిదో రోజున దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి.

శ్లోకం: సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాదికే 
       శరణ్యే త్య్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే.

రాహుగ్రహ దోషాలను నివారించి, భక్తుల కష్టాలను శీఘ్రంగా దూరం చేస్తుంది. ఓం దుర్గ దుర్గాయ నమః అని వీలైనన్ని సార్లు జపిస్తే శత్రు బాధలు తొలగి, సుఖశాంతులతో వర్ధిల్లుతారని భక్తుల నమ్మకం. అంతేగాదు. ఈ రోజు 'ఓం కాత్యానాయ విద్మహే కన్యకుమారి ధీమహి! తన్నో దుర్గ్‌ ప్రచోదయాత్‌!' అంటూ ప్రార్థన చేసి, ఆరాధిస్తే మనకున్న దుర్గతులు పోతాయని పురాణ వచనం.

మరోవైపు ఎనిమిదోరోజు కొన్ని చోట్ల నవదుర్గల ప్రకారం గౌరి దేవిని పూజిస్తారు. ఈ తల్లి తెల్లటి ముత్యంలా మెరుస్తుంది. ఆమె శక్తి అత్యంత ఫలప్రదమైనది.  ఈ రోజున మహాగౌరీ దేవిని తెలుపు లేదా ఊదా రంగు దుస్తులు ధరించి పూజించాలి

నైవేద్యం: బెల్లం పొంగలి, చెక్కెర పొంగలి, పాయసాన్నం వంటివి నివేదిస్తారు  

(చదవండి: నవరాత్రుల్లో గర్బా నృత్యం ఎందుకు చేస్తారో తెలుసా..!)
 

Videos

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

కొండా రెడ్డి బురుజు సాక్షిగా దొరికిన బడి దొంగలు

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)