Breaking News

సెంచరీ కొట్టిన టమాటా, మీరు మాత్రం అతిగా తినకండి!

Published on Tue, 10/08/2024 - 14:32

కూరగాయల ధరలు మండిపోతున్నాయి.  భారీ వర్షాలకు పంట దెబ్బతినడం, సప్లయ్‌ తగ్గిపోవడంతో ఒక్కసారిగా కూరగాయల ధరలు ఆకాశం వైపుచూస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో టమాటా కిలో ధర 100 రూపాయలు పలుకుతోంది. దీనికి తోడు నవరాత్రి ఉత్సవాలు, అన్నదానాల హడావిడి మధ్య డిమాండ్‌ మరింత పెరిగింది. నిజానికి ప్రతి కూరలో టమాటా వాడటం అలవాటుగా మారిపోయింది. కూరకు రుచిరావడంతోపాటు, మన ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తాయి కూడా. అయితే అందని ద్రాక్ష పుల్లన అనుకొని వేరే ప్రత్యామ్నాయాల్ని వెదుక్కోవాలి.  అన్నట్టు టమాటాలు అతిగా తినకూడదు. తింటే  ఎలాంటి నష్టాలుంటాయి? తెలుసుకుందాం.

 విటమిన్ సి, విటమిన్ కె, ఫోలెట్, పొటాషియం,యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ  గుణాలు పుష్కలంగా ఉంco సూపర్‌ ఫుడ్‌  టమాటా. టమాటాల్లో  ఉండే లైకోపీన్ కొలన్, ప్రొస్టేట్, లంగ్ కేన్సర్లను అడ్డుకుంటుంది. డయాబెటిస్, హైపర్ టెన్షన్, గుండె సమస్యలున్నవారికి కూడా టమాటాలు  మేలు చేస్తాయి.  

టమాటా ధర పెరిగితే ఏం చేయాలి?
ఏ కూరగాయ అయినా ధర పెరిగితే మధ్యతరగతి ప్రజలు ప్రత్యామ్నాయాలు వెదుక్కోవాల్సిందే.  టమాటా విషయంలో అయితే చింతపండు, పుల్లగా ఉండే ఆకుకూరలను ఎంచుకోవాలి. అలాగే టమాటాలు చవకగా లభించినపుడు సన్నగా తరిగి, బాగా ఎండబెట్టి ఒరుగుల్లా చేసుకొని నిల్వ చేసుకుంటే కష్టకాలాల్లో ఆదుకుంటాయి.

అతి ఎపుడూ నష్టమే, ఎవరెవరు తినకూడదు?
టమాటా ఎక్కువగా తీసుకోవడం వల్ల  కొన్ని సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. వంకాయలు, దుంపకూర ల్లాగానే టమాటాలతో  కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది.  సోలనిన్ అనే సమ్మేళనం  కారణంగా ఆర్థరైటిస్, కీళ్లు, మోకాళ్ల నొప్పులను ఇంకా పెంచుతుంది.  ఇప్పటికే ఆస్టియో ఆర్థరైటిస్ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉంటే టామాటా వినియోగాన్ని  తగ్గించడం ఉత్తమం.

టమాటా గింజల్లో ఉండే ఆక్సలేట్  కిడ్నీ సమస్యలకు దారి తీస్తుంది. టమాటాలు కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్న  టమాటాలకు దూరంగా ఉండాలని చెబుతారు. ఇంకా  జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట వంటి  సమస్యలొస్తాయి. వీటిల్లోని  మాలిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్‌  మన శరీరంలోకి ఎక్కువగా చేరితే  యాసిడ్ రిఫ్లక్స్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది.   టమాటాల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన రక్తంలో ఎక్కువగా చేరితే  లైకోపెనోడెర్మియా వస్తుంది. రోజుకు 75 మిల్లీగ్రాముల మోతాదు మించితే  ఈ సమస్య వస్తుంది. 
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)