Breaking News

డయానా ధరించిన డ్రెస్‌ ధర ఏకంగా రూ. 9 కోట్లు! మరోసారి..

Published on Wed, 12/20/2023 - 15:12

ప్రిన్స్‌ డయానా దుస్తులు వేలంలో మరోసారి రికార్డు స్థాయిలో పలికి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతకు మునుపు ఆమె ధరించిన స్వెట్టర్‌ ధర, వివాహ దుస్తులు ఇలానే కోట్లలో ధర పలికి ఆమె ఫ్యాషన్‌ ఐకాన్‌ అని ప్రూవ్‌ చేసింది. మళ్లీ మరోసారి అదే రికార్డు స్థాయిలో ప్రిన్స్‌ డయానికి సంబంధించిన డ్రస్‌ అమ్ముడిపోయింది యువరాణి క్రేజ్‌ని మరోసారి బహిర్గతం చేసింది. ఈ డ్రస్‌ని ప్రిన్స్‌ డయానా 1985లో ఫోరెన్స్‌లోని బాలేరినాలో సాయంత్రం ఈ దుస్తులను ధరించింది. అలాగే వాంకోవర్‌ పర్యటనలో ఈ డ్రస్‌తో ఫోటోగ్రాఫర్ల కంట పడినట్లు జూలియన్స్‌ వేలం సంస్థ పేర్కొంది​. ఈ డ్రస్‌ టాప్‌ నీలిరంగు నక్షత్రాలతో ఎంబ్రాయిడరీ చేసిన పొడవాటి నల్లటి వెల్వెట్ కలర్‌లో ఉండగా, స్కర్ట్‌ ఊదారంగులోని ఆర్గ్కాన్జాలా ఉండి పైన రిబ్బన్‌ మాదిరిగా ఉంటుంది.

లండన్‌లో జూలియన్స్‌ నిర్వహించిన వేలంలో అంచనా వేసిన దానికంటే 11 రెట్టు ధర పలికడం విశేషం. ఇంతకమునుపు వేలం వేసిన డయనా గౌనుల్లో ఒక దాని రికార్డుని బ్రేక్‌ చేసేలా రూ. 9 కోట్లు పలికింది. ఈ దుస్తులు యువరాణి ప్రిన్స్‌ డయానా రాజదర్పాన్ని తెలియజేసేలా ఉండటమే గాక ఆ డ్రస్‌ అత్యధికంగా అమ్ముడుపోయి ఆమె ఫ్యాషన్‌ ఐకాన్‌కి కేరాఫ్‌ అని మరోసారి చాటి చెప్పింది. వేలంలో అత్యధిక ధర పలికిన దుస్తులగా ప్రపంచ రికార్డును డయాన ధరించిన దుస్తులే నిలవడం విశేషం.

నిజానికి జూలియన్స్‌ వేలం నిర్వాహకులు ఈ డ్రస్‌ వేలంలో సుమారు రూ. 83 లక్షల నుంచి కోటి రూపాయ వరకు పలికే అవకాశం ఉందనుకున్నారు. కనివినీ ఎరుగని రీతిలో అత్యధికంగా పలికీ దటీజ్‌ ప్రిన్స్‌ డయానా అనేలా ఆశ్చర్యపరిచింది. కొందరూ కొద్దికాలమే బతికినా వారి ప్రభావం అలానే ఉంటుంది. అందరి మదిలో చిరస్థాయిగా ఉండిపోతారు కూడా. ఆఖరికీ వారికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా వారి మాదిరిగానే ఓ అద్భుతంగా నిలుస్తాయి కాబోలు.

(చదవండి: శీతాకాలం ముఖానికి కొబ్బరి నూనె రాస్తున్నారా?)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)