Breaking News

ధరించే కొద్దీ ఆభరణాలు మెరుపు తగ్గుతాయా? ఏం చేయాలి?

Published on Sat, 01/18/2025 - 14:35

ఆభరణాలను ధరించే కొద్దీ మెరుపు తగ్గిపోతాయని అ΄ోహ పడుతుంటాం. కానీ వాటి మెరుపు ఎక్కడికీ పోదు. రోజూ ధరించే బంగారు ఆభరణాలు గాలి, దుమ్ము, ధూళి, వాయు కాలుష్యం కారణంగా మసకబారుతుంటాయి. వాటికి మెరుగు పెట్టించాలనుకుని దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. నెలకోసారి ఇంట్లోనే శుభ్రం చేసుకోవచ్చు.  

ఒక పాత్ర (మెటల్‌ పాత్ర వాడరాదు, ప్లాస్టిక్‌ పాత్ర వాడాలి)లో డిష్‌ వాష్‌ లిక్విడ్‌ నాలుగు చుక్కలు వేసి గోరువెచ్చని నీటిని ΄ోసి కల΄ాలి. ఆ తరవాత ఆభరణాలను నీటిలో మునిగేలా ఉంచి 15 నిమిషాల తర్వాత చేత్తో రుద్ది కడగాలి. ఆ తర్వాత మంచినీటి పాత్రలో పెట్టి వేళ్లతో మృదువుగా రుద్దుతూ సబ్బు వదిలేటట్లు శుభ్రం చేయాలి.  

నీటితో శుభ్రం చేసిన తర్వాత పేపర్‌తో తుడిచే ప్రయత్నం చేయరాదు. మెత్తటి కాటన్‌ వస్త్రాన్ని ఒత్తుగా నాలుగు మడత లు వేసి ఆభరణాన్ని ఉంచాలి. శుభ్రం చేసిన ఆభరణాన్ని బీరువాలో పెట్టాలంటే ఆభరణంలో ఏ మాత్రం తేమ లేకుండా ఆరిన తర్వాత మాత్రమే భద్రపరచాలి. 

ఆభరణాలను శుభ్రం చేసేటప్పుడు పాటించాల్సిన నియమం ఏమిటంటే...ఒక్కొక్క ఆభరణాన్ని విడిగా శుభ్రం చేయాలి. చెవికమ్మలు, రింగుల వంటి వాటిని కలిపి నానబెట్టి శుభ్రం చేసే అలవాటు చాలామందికి ఉంటుంది. కలిపి ఒకే పాత్రలో నానబెట్టాల్సి వస్తే అడుగు వెడల్పుగా ఉండి ఒక కమ్మ మరొక కమ్మకు తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే కడిగేటప్పుడు కూడా ఒకదానికి మరొకటి తగులుతూ ఉంటే గీతలు పడతాయి.

రాళ్లు  పొదిగిన బంగారు ఆభరణాన్ని శుభ్రం చేయాలంటే నీటిలో నానబెట్టరాదు. మొదట సబ్బు నీటితో ముంచిన మెత్తని వస్త్రంతో ఆభరణాన్ని తుడవాలి. ఆ తర్వాత మంచినీటిలో ముంచిన క్లాత్‌తో తుడవాలి. తుడిచిన తర్వాత మెత్తటి టవల్‌ మీద ఆభరణాన్ని తలకిందులుగా (ఈ స్థితిలో ఆభరణంలో పొదిగిన రాయి కిందగా టవల్‌ను తాకుతూ ఉంటుంది. బంగారు పైకి కనిపిస్తుంటుంది) ఆరబెట్టాలి. ఇలా ఆరబెట్టడం వల్ల  రాయికి బంగారానికి మధ్య తేమ చేరకుండా ఉంటుంది.  

చదవండి: కళ్లు చెదిరే ఇన్‌స్టా రీల్‌ : 55.4 కోట్లతో రికార్డులు బద్దలు

బామ్మకు స్వీట్‌ సర్‌ప్రైజ్‌ : 20 లక్షలకు పైగా వ్యూస్‌


 


 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)