Breaking News

Pumpkin Halwa: టేస్టీ టేస్టీగా గుమ్మడికాయ హల్వా రెసిపీ, అలా.. వెన్నలా..

Published on Fri, 05/24/2024 - 16:57

గుమ్మడి కాయలు రెండు రకాలు. రెండూ తీగ జాతికి చెందినవే. తీపి గుమ్మడి, లేదా కూర గుమ్మడి, రెండోది బూడిద గుమ్మడి.  తీపి గుమ్మడికాయతో పులుసు కూరలు, స్వీట్‌ చేసుకుంటారు. బూడిద గుమ్మడికాయతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వడియాలు పెట్టుకుంటారు. మరికొన్ని చోట్ల బూడిద గుమ్మడితో స్పెషల్‌  స్పీట్‌ చెస్తారు. అయితే  ఈరోజు తీపి గుమ్మడితో చేసే  హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం.

 

గుమ్మడికాయ హల్వా, కావాల్సిన పదార్థాలు
తీపి గుమ్మడికాయ - ఒకటి, పాలు - రెండు కప్పులు, యాలకుల పొడి - ఒక స్పూను, నెయ్యి - రెండు స్పూన్లు, జీడిపప్పు, బాదం కలిపి  - అర కప్పు, కోవా - ఒక కప్పు, చక్కెర లేదా బెల్లం - ఒక కప్పు (గుమ్మడికాయ ఎలాగూ తీయగా ఉంటుంది కాబట్టి పెద్దగా తీపి అవసరంలేదు)  కిస్‌మిస్‌ :   కాసిన్ని

తయారీ విధానం 

మంచి తీపి గుమ్మడికాయను తీసుకొని శుభ్రంగా కడిగి, పైన చెక్కు తీసి ఉంచుకోవాలి.  దీన్ని  సన్నగా తురుముకోవాలి.

ముందుగా  జీడిపప్పు, కిస్‌మిస్‌, కొద్దిగా బాదం పప్పులను వేయించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌ వెలిగించి, అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకుని,  కొద్గాది నెయ్యి వేసుకోవాలి. తరువాత గుమ్మడికాయ తురుము వేసి , సన్నని మంటమీద వేయించుకోవాలి. పచ్చివాసన పోగానే పాలు పోసి బాగా ఉడికించాలి. అది కాస్త చిక్కబడ్డాక పంచదార, యాలకుల పొడి, కోవా వేసుకొని బాగా కలపాలి. బెల్లం అయితే హల్వా చక్కటి రంగు వస్తుంది.  

పది నిమిషాల ఉడికిన తరువాత దగ్గరగా వస్తుంది.  నెయ్యి పైకి తేలుతుంది.  ఇపుడు చిన్నమంట మీద ఉంచి మరికాసేపు ఉంచి, మంటను ఆపేయాలి. దీన్నిఒక బౌల్‌లోకి తీసుకొని వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌లో  గార్నిష్‌ చేసుకోవడమే.  తడి తగలకుండా  ఉంటే ఇది నాలుగైదు రోజులు నిల్వ కూడా ఉంటుంది.
 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)