Breaking News

ప్రపంచంలోని సహజసిద్ధమైన అద్భుతాలేవో తెలుసా?

Published on Sat, 07/26/2025 - 16:45

హలో పిల్లలూం. మనకు ప్రపంచ వింతలంటే ఠక్కున గుర్తొచ్చేవి – ది గ్రే వాల్‌ ఆఫ్‌ చైనా, పెట్రా, క్రైస్ట్‌ ది రిడీమర్, మచ్చు పిచ్చు, చిచెన్‌ ఇట్జా, రోమన్‌ కొలోసియం, మనందరికీ ఇష్టమైన తాజ్‌ మహల్‌. ఈ ఏడు వింతలు తప్ప మరొకటి జ్ఞప్తికి రావు. ఇవి ఎంతో అందమైన, ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు, కట్టడాలు అయినప్పటికీ ఇవన్నీ కూడా మానవ నిర్మాతలు. మనకంటే ముందు జీవించిన మన పితరులు వివిధ కాలాలలో, విభిన్న సందర్భాలలో నిర్మించిన అద్భుతమైన కట్టడాలు ఇవి. కానీ ఈరోజు మనం, మానవ ప్రమేయం లేకుండా ప్రకతి ద్వారా సహజంగా ఏర్పడిన వింతల గురించి తెలుసుకుందాం. 

ప్రపంచంలోని ఏడు సహజసిద్ధమైన అద్భుతాలు (seven natural wonders of the  World)

1. గ్రాండ్‌ కాన్యన్‌  (Grand Canyon)


అమెరికాలోని ఈ భారీ లోయ అరిజోనాలో ఉంది. కొలరాడో నది సష్టించిన ఈ కాన్యన్‌ దాదాపు 446 కిలోమీటర్ల ΄÷డవు, 29 కిలోమీటర్ల వెడల్పుతో 1.6 కిలోమీటర్ల లోతు కలిగి ఉంది. దీని అద్భుతమైన రంగులు, భౌగోళిక నిర్మాణం పర్యాటకులను కట్టిపడేస్తాయి.

2. గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌ (Great Barrier Reef


ఆస్ట్రేలియా సమీపంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బ. ఇది 2,300 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఈ అద్భుతం అనేక సముద్ర జీవులకు ఆవాసం.

3. అమెజాన్‌ రెయిన్‌ ఫారెస్ట్‌ (Amazon Rainforest)

దక్షిణ అమెరికాలోని ఈ ఉష్ణమండల వర్షారణ్యం ‘‘ప్రపంచ ఊపిరితిత్తులు’’ గా పిలువబడుతుంది. ఇది అమెజాన్‌ నది చుట్టూ విస్తరించి ఉండటంతోపాటు భూమ్మీద ఇంతవరకు కనిపించని ఎన్నో జాతుల జంతుజాలం, వక్షజాలానికి నిలయం.

4. విక్టోరియా జలపాతం (Victoria Falls) 
ఆఫ్రికాలోని జాంబియా–జింబాబ్వే సరిహద్దులో ఉన్న ఈ జల΄ాతం జంబేజీ నదిపై ఉంది. దీని వెడల్పు 1.7 కిలోమీటర్లయితే,  ఎత్తు 108 మీటర్లు.

5. ఆరోరా బోరియాలిస్‌ (Aurora Borealis Northern Lights)
ఉత్తర ధ్రువ ప్రాంతాలలో (నార్వే, స్వీడన్, ఫిన్లాండ్‌) కనిపించే ఈ అద్భుతమైన ఆకాశ దశ్యం సౌర కణాలు భూమి వాతావరణంతో సంకర్షణ చెందడం వల్ల ఏర్పడుతుంది. ఈ దశ్యాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా ప్రకతి డిజైన్‌ చేసిన గ్రాఫిక్స్‌ లా ఉంటాయి.

6.పారిసెలో రాక్‌  (Paricutin Volcano)
మెక్సికోలోని ఈ అగ్నిపర్వతం 1943లో ఒక రైతు భూమిలో ఏర్పడింది. ఇది ఏర్పడిన తొమ్మిది సంవత్సరాలలోనే 424 మీటర్ల ఎత్తుకు చేరుకుని ఆధునిక ప్రపంచ వింతగా పరిగణింపబడుతుంది.

7. మౌంట్‌ ఎవరెస్ట్‌ (Mount Everest, Mount in Asia )
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం, హిమాలయాలలో 8,848 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మంచు పర్వతాలు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ హిమ పర్వతాలను అధిరోహించడానికి కొన్ని వేల మంది ఆసక్తి చూపుతుంటారు.

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)