Breaking News

బిడ్డ పుట్టినట్టు, ఏడుస్తున్నట్టు కల వస్తే.. అపశకునమా!

Published on Sat, 01/27/2024 - 10:11

నిద్రలో కలలు అందరికీ వస్తుంటాయి. రకరకాల కలలు. కొన్ని అస్పష్టంగా, అల్లిబిల్లిగా అల్లుకుంటాయి. మరి కొన్ని  కళ్లముందే జరిగినట్టు చాలా స్పష్టంగా  గుర్తు ఉంటాయి.  సాధారణంగా వాటిని చాలావరకు మరచిపోతాం. ఒక్కోసారి అస్సలు పట్టించుకోం.  డ్రీమ్ సైన్స్ ప్రకారం మన మనసులోని భావాలకు, మన జీవితంలోని అంశాలకు కలలు ప్రతిరూపాలట. కొన్ని కలలు మర్చిపోనీయకుండా వెంటాడుతుంటాయి.

ఎవరితోనో పెళ్లి జరిగిపోతున్నట్టు, ఏదో కొండలోయల్లోకి జారిపోతున్నట్టు, ఎంత పరిగెత్తాలన్నా పరిగెత్తలేక నిస్సత్తువగా ఉన్నట్టు కల వస్తూ ఉంటాయి.  ఉలక్కి పడి లేచి ..హమయ్య  కలే కదా అనుకుంటాం. కానీ కొన్ని మాత్రం మనల్ని  కుదురుగా ఉండనీయవు. అలా ఎలా? అనుకుంటూ ఉంటాం. నిజానికి మన జీవితంలో మనం చేసేది, చేయలేనిది మన కలలో మాత్రమే కనిపిస్తుంది. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో బిడ్డకు జన్మనిస్తే, దాని అర్థం ఏమిటి? అనే దాన్ని పరిశీలిస్తే..

కలలో బిడ్డ పుట్టడం, ఏడ్వటం
ప్రొఫెషనల్ డ్రీమ్ అనలిస్ట్ , రచయిత లారీ క్విన్ లోవెన్‌బర్గ్ ప్రకారం, శిశువు కలలో  కనిపిస్తే  కొత్త ప్రారంభానికి  సూచిక.  చేస్తున్న  పనిలో పెరుగుదల లేదా అభివృద్ధిని సూచించే  సానుకూల సంకేతమని లోవెన్‌బర్గ్ చెప్పారు.

ఒకవేళ బిడ్డ ఏడుస్తున్నట్టు,  అలా వదిలేసినట్టు కల వస్తే.. చేయాల్సిన పనిని నిర్లక్ష్యం చేస్తున్నట్టు. పాప ఏడుపు ఆపకుండా, డ్రీమ్ బేబీ అసహనంగా ఏడుస్తుంటే జీవితంలో  కొత్త విషయం లేదా కొంత అంశం మీ దృష్టి అవసరమనేదానికి సూచన అని లోవెన్‌బర్గ్ వివరించాడు.

స్వప్న శాస్త్రం ప్రకారం మీరు కలలో పుట్టిన బిడ్డను చూసినట్లయితే అది శుభసూచకమట. మన జీవితంలో కొత్త అదృష్టం ప్రకాశించబోతోంది అని అర్థమట. జీవితంలో చాలా ఆనందం ,సంపద వస్తాయని భావిస్తారు. వెల్‌.. చెడు అంటే భయపడాలిగానీ, కొత్త సంతోషంగా వస్తోంది అంటే ఆనందమేగా! 

నిజానికి శతాబ్దాలుగా  కలలపై పరిశోధనలు జరుగుతున్నాయి. నాగరితక ఆరంభంలో  భూలోక ప్రపంచం , దేవతల మధ్య కలలను ఒక మాధ్యమంగా భావించేవారు. వాస్తవానికి, కలలకు కొన్ని ప్రవచనాత్మక శక్తులు ఉన్నాయని గ్రీకులు , రోమన్లు  విశ్వసించేవారు. పంతొమ్మిదవ శతాబ్దం చివరి వరకు సిగ్మండ్ ఫ్రాయిడ్ , కార్ల్ జంగ్ కలలు కనడం గురించి విస్తృతంగా తెలిసిన కొన్ని ఆధునిక సిద్ధాంతాలను ముందుకు తెచ్చారు. తీరని కోరికలు ప్రతిరూపం కలలని ఫ్రాయిడ్   అంటే, కలలకు మానసిక ప్రాముఖ్యత ఉందంటాడు  కార్ల్ జంగ్ అంటాడు.  కానీ వాటి అర్థం గురించి భిన్నమైన సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. న్యూరోబయోలాజికల్ సిద్ధాంతంప్రకారం అసలు కలలకు అర్థం  లేద. అవి మన జ్ఞాపకాల నుండి యాదృచ్ఛిక ఆలోచనలు  ఎలక్ట్రికల్‌ బ్రెయిన్‌ ఇంపల్షన్స్‌ మాత్రమే. 

ఏ కల అయినా శుభమా? లేదా అశుభమా? అనేదాన్ని పక్కన పెట్టి.. ఆ కలల్ని మన జీవితంతో అన్వయం చేసుకొని సమీక్షించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు.అర్థం పర్థంలేని కలల గురించి ఊరికే టెన్షన్‌ పడి ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం కంటే అలా వదిలేయడమే బెటర్‌.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)