Breaking News

ప్రపంచంలో చిట్టచివరి గ్రామం ఏదో తెలుసా!

Published on Sun, 09/24/2023 - 07:24

ప్రపంచంలో చిట్టచివరి గ్రామం ఏదో తెలుసా? అది ఎక్కడుందో తెలుసా? గ్రీన్‌ ల్యాండ్‌ వాయవ్య ప్రాంతంలోని నుసువాక్‌ ద్వీపకల్పానికి ఉత్తరతీరంలో ఉందీ గ్రామం. దాని పేరు నియాకోర్నాట్‌. ఇక్కడ సముద్రం.. కొండలా గడ్డ కడుతుంది. నెలల తరబడి చీకటి చుట్టుముడుతుంది. పెద్ద పెద్ద మంచుపెళ్లలు కనుచూపుమేరలో నీటమునుగుతుంటాయి. ఇక్కడ భయంకరమైన ఉష్ణోగ్రతలు ఒకసారి, తట్టుకోలేనంత చలిగాలులు ఒకసారి వణికిస్తాయి.

ఎటు చూసినా తరగని ప్రకృతి అందాలు ఆకట్టుకుంటాయి. ఈ గ్రామానికి ఏకైక ఆదాయమార్గం చేపల కర్మాగారం. అది మూతబడిన తర్వాత చాలామంది జీవనాధారం కోసం మకాం మార్చేశారు. నిజానికి  ఇలాంటి ప్రమాదకరమైన ప్రదేశాల్లో 50 కంటే తక్కువ జనాభా ఉంటే బలవంతంగా గ్రామవాసులను పరిసర పట్టణాల్లోకి తరలించడం సర్వసాధారణం. అయితే 2011లో 52 మంది జనాభాతో ఈ గ్రామం ఉనికి నిలుపుకోగలిగింది.

కానీ 2020 జనాభా లెక్కల ప్రకారం గ్రామస్థుల సంఖ్య 34కి తగ్గిపోయింది. ప్రస్తుతం ఈ గ్రామం గురించి ఎలాంటి తాజా సమాచారం అందుబాటులో లేదు. అయితే ఇక్కడ ధ్రువపు ఎలుగుబంట్లు, పెద్దపెద్ద తిమింగలాలు తరచుగా కనిపిస్తూ ఉంటాయని ‘సారా గావ్రొన్‌’ అనే దర్శకురాలు 2013లో తీసిన ‘విలేజ్‌ ఎట్‌ ది ఎండ్‌ ఆఫ్‌ ది వరల్డ్‌’ అనే డాక్యుమెంటరీలో వివరించారు. 

(చదవండి: పాములు కాటేసే ముందు హెచ్చరిస్తాయా? ఆ ఒక్క పాము మినహా..)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)