Breaking News

కాకరకాయ ఆయిల్‌తో ఎన్ని లాభాలో : చుండ్రుకు చెక్‌, జుట్టు పట్టుకుచ్చే!

Published on Fri, 09/13/2024 - 11:42

కరేలా ఆయిల్‌  లేదా  కాకరకాయ నూనె గురించి ఎపుడైనా విన్నారా? కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, బాదం నూనె, రోజ్ మేరీ గురించి విన్నాం గానీ, ఈ కరేలా   హెయిర్‌ ఆయిల్‌ ఏంటి అనుకుంటున్నారా?  కాకర తినడమే కష్టం..  కాకరకాయ  హెయిర్‌ ఆయిలా? అని తేలిగ్గా తీసి పారేయకండి.  కొన్ని శతాబ్దాలుగా ఆయుర్వేదంలో దీన్ని  ఔషధంగా వినియోగిస్తున్నారు.  జుట్టు, చర్మ  ఆరోగ్యానికి ఉపయోపగడే కరేలా ఆయిల్‌ గురించి తెలుసుకుందాం.

కాకరకాయ  ఎన్నో  ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. దీని నుంచి ఆయిల్‌ను  బిట్టర్ గార్డ్‌ ఆయిల్, కరేలా ఆయిల్ అని కూడా పిలుస్తారు. ఈ నూనెలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు , కొవ్వు ఆమ్లాలు  పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం జుట్టు ,మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జుట్టుకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో  చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు చుండ్రును తగ్గించి, జుట్టు ఆరోగ్యంగా ఎదగడానికి  తోడ్పడుతుంది. రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. 

యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్న  కాకరకాయ నూనె చర్మానికి రాస్తే మృతకణాలు నశించి యవ్వనంగా, కాంతి వంతంగా తయారవుతుంది.  ఈ నూనెలో విటమిన్లు ఎ , సి వంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి,  జుట్టు కుదుళ్లకు పోషణనిచ్చి, జుట్టును బలంగా చేస్తాయి. కరేలా నూనెలో సహజ యాంటీ ఫంగల్ , యాంటీమైక్రోబయల్  చుండ్రు , స్కాల్ప్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేస్తుంది,  దురద, ఇతర చికాకులనుకూడా ఇది చక్కటి పరిష్కారం.
జుట్టు తెల్లబడకుండా
కరేలా నూనెను వారానికి రెండుసార్లు అప్లై చేయడం వల్ల జుట్టు  తొందరగా నెరసిపోకుండా ఉంటుంది. తల చర్మం, జుట్టు తంతువులు రెండింటినీ హైడ్రేట్ చేస్తుంది. జుట్టును తేమగా ఉంచుతుంది. సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. స్కాల్ప్ లోని సహజ నూనె (సెబమ్) ఉత్పత్తిని నియంత్రిస్తుంది  ఇది జుట్టు పెళుసుదనాన్ని తగ్గిస్తుంది. కరేలా నూనెను క్రమం తప్పకుండా   మృదువుగా, సున్నితంగా , మెరుస్తూ ఉంటుంది. యాంటీమైక్రోబయల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, చిన్న గాయాలు,  కాలిన గాయాలకు  తొందరగా నయమవుతాయి.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)