Breaking News

భూకంప శిథిలాల కింద ఊపిరిపోసుకున్న బిడ్డ ఇప్పుడిలా..

Published on Sat, 08/05/2023 - 17:18

ఈ ఏడాది ఫిబ్రవరిలో తుర్కియే, సిరియాలను భూకంపం ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రకృతి విలయం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. ఒక్కసారి ఆ ఘటన గుర్తుతెచ్చుకుంటే ఇంకా ఆ దృశ్యాలు కళ్లముందు మెదులుతాయి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆ శిథిలాల కిందే ఓ శిశువు ఊపిరి పోసుకుంది. ఆ 'జననం ఓ అద్భుతం' అనే చెప్పాలి. అంతటి విషాదంలో అందరిలో ఓ కొత​ ఆశను రేకెత్తించినట్లు 'మిరాకిల్‌గా ఆ బేబి' పుట్టడం అందర్ని ఒకింత ఆనందసభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఇప్పుడూ ఆ శిశువు ఎలా ఉందంటే?

నాటి సిరియా భారీ భూకంపంలో శిథిలాల కింద ఆ పసికందు కనిపించినప్పుడు, ఆమె బొడ్డు తాడు తల్లి నుంచి ఇంకా తెగిపోలేదు. ఆ చిన్నారి ఈ ప్రపంచంలోకి వచ్చిన కాసేపటికే ఆమె తల్లి కన్నుమూసింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రపంచాన్ని ఆకర్షించింది. తల్లి లేకపోయిన ఆ చిన్నారి ఆస్పత్రిలో వైద్యుల సాయంతో కోలుకుంది. ఇప్పుడు ఆ శిశువుకి ఆరు నెలలు. చాలా ఆరోగ్యంగా ఉంది. సిరియాలోని జిండిరెస్‌ పట్టణంలో ఆ చిన్నారి తన మేనత్త, మేనమామ, వారి ఏడుగురు పిల్లల మధ్య పెరుగుతోంది.

ఆమె నవ్వుతుంటే వాళ్ల నాన్న, అక్కలే గుర్తుకొస్తున్నారని ఆ చిన్నారి మేనమామ ఖలీల్‌ అల్‌ సవాడీ అన్నారు. ఆ విషాద ఘటనలో ఆమె తండ్రి, తల్లి, నలుగురు అక్కలు ప్రాణాలు కోల్పోయారు. ఆమె కుటుంబంలో బతికి ఉన్న ఏకైక వ్యక్తి అఫ్రానే.  ఆ శిశువును దత్తత తీసుకునేందుకు ఎంతోమంది ముందుకొచ్చారు కూడా. ఆఖరికి అయినవాళ్ల అయిన ఆ చిన్నారి మేనమామ, మేనత్తలకు ఇచ్చేందుకు ఆస్పత్రి సిబ్బంది నిరాకరించింది. ఎన్నో టెస్ట్‌లు నిర్వహించిగానీ వారికి ఆ పాపను అప్పగించలేదు ఆస్పత్రి యజమాన్యం.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన వెంటనే చేసిన పని ఆ పాపకు కొత్తపేరు పెట్టడమే. ఆ చిన్నారికి ఆమె తల్లి  'అఫ్రా' పేరునే పెట్టారు. నిజానికి ఆ శిశువుని కాపాడిని రెస్క్యూ సిబ్బంది, ఆస్పత్రి యజమాన్యం ఆ చిన్నారికి 'అయా' అని పేరు పెట్టడం జరిగింది. 'అయా' అంటే అరబిక్‌లో అద్భుతం అని అర్థం. ఆమె నా కూతుళ్లలో ఒకత్తని, దాన్ని చూడకుండా కాసేపు కూడా ఉండలేనన్నారు ఆ చిన్నారి మేనమామ ఖలీల్. ఇక జిండిరెస్‌లోని ఖలీల్ ఉంటున్న ఇల్లు కూడా బాగా భూకంపం కారణంగా బాగ దెబ్బతిందని, అందువల్ల తాముఅక్కడే ఎక్కువ కాలం ఉండలేకపోయామన్నారు ఖలీల్‌.

దీంతో కష్టాలన్నీ ఒకేసారి చుట్టుముట్టినట్టయిందని, పిల్లలను స్కూల్‌కి పంపే స్థోమత కూడా లేదని ఖలీల్‌ చెప్పుకొచ్చారు. అయితే అక్కడ ఖలీల్‌ లాగానే ఎన్నో వేల కుటుంబాలు అత్యంత దయనీయ స్థితిలో బతుకుతున్నాయి. అంతేగాదు ఆ విషాద ఘటనలో దాదాపు 50 వేలమంది మరణించారని, మరో 50 వేలమంది నిరాశ్రయులయ్యినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది కూడా. 

(చదవండి: బస్సు డ్రైవర్‌ కూతురికి లండన్‌లో ఉద్యోగం)
 

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?