Breaking News

వింటర్‌ కేర్‌ : పాదాల పగుళ్లకు స్ప్రే

Published on Fri, 01/10/2025 - 10:28

చలికాలంలో చర్మ సమస్యలు సాధారణం. వీటిలో  పాదాల పగుళ్లు, ట్యాన్, తిమ్మిర్లు,పాదాల నుంచి వేడి ఆవిర్లు కమ్మినట్లు అనిపించడం వంటివి ఎదుర్కొంటూ ఉంటాం. ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పాదాలచర్మాన్ని కాపాడుకోవచ్చు.మృదువుగానూ మార్చుకోవచ్చు.

తిమ్మిర్లు తగ్గడానికి...
∙ఈ కాలం ఎక్కువసేపు కుర్చీ, సోఫాలో కూర్చునే వారికి తిమ్మిర్ల సమస్య ఎక్కువ. అలాంటప్పుడు గ్లాసు వేడినీళ్లలో స్పూన్‌ వెనిగర్‌ కలిపి, దానిలో దూదిముంచి, దాంతో రెండు పాదాలు పూర్తిగా తుడవాలి. దీనివల్ల తిమ్మిర్లు,పాదాల చర్మం ΄÷డిబారడం వంటి సమస్యలు తగ్గుతాయి. కాటన్‌ సాక్సులు వేసుకుంటే కాళ్ల తిమ్మిర్లు తగ్గుతాయి.

పగుళ్ల నివారణకు...
పాదాల చర్మం భరించగలిగేంత వేడినీటిలో రాళ్ల ఉప్పు వేసి ఐదు నిమిషాలు ఉంచి తీయాలి. స్పూన్‌ అలోవెరా జెల్, స్పూన్‌ గ్లిజరిన్, విటమిన్‌ – ఇ క్యాప్సుల్, కొంచెం రాక్‌ సాల్ట్‌... ఇవన్నీ బాగా కలపాలి. పాదాల పగుళ్లుపైన ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. తర్వాత పాలిథిన్‌ కవర్‌తోపాదం మొత్తం మూసేయాలి. 10 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత కవర్‌ తీసేయాలి. దీనివల్ల  పాదాల వేడి, నెమ్మదిగా పగుళ్లు తగ్గుతాయి.

ట్యాన్‌ ఏర్పడితే...
∙చలికాలం క్రీములు, లోషన్లు పాదాలకు ఎక్కువ రాస్తుంటాం. బయటకు వెళ్లినప్పుడు దుమ్ము, ఎండవల్ల ట్యాన్‌ ఏర్పడుతుంది. ఈ సమస్య నివారణకు.. స్పూన్‌ టమోటా రసంలో స్పూన్‌ బంగాళ దుంప రసం, స్పూన్‌ వెనిగర్, శనగపిండి లేదా కాఫీ పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్నిపాదాలకు అప్లై చేసి, పదిహేను నిమిషాలు ఉంచి, వాటర్‌ స్ప్రే చేసి, కాటన్‌ క్లాత్‌తో తుడిచేయాలి. వారానికి 2–3 సార్లు చేసుకుంటే ట్యాన్‌ తగ్గిపోతుంది.

శుభ్రమైన గోళ్లు
పాదాల గోళ్లు శుభ్రంగా ఉండాలంటే పెట్రోలియం జెల్లీని కొద్దిగా కరిగించి, దాంట్లో విటమిన్‌– ఇ క్యాప్సుల్, గ్లిజరిన్, రోజ్‌వాటర్‌ కలిపి రాత్రి పడుకునే ముందు గోళ్లచుట్టూ అప్లై చేయాలి. రోజూ ఇలా చేస్తుంటే గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

మృదువైన చర్మానికి...
రోజ్‌వాటర్, రోజ్‌మెరీ ఆయిల్, నీమ్‌ ఆయిల్, అలోవెరా ఆయిల్‌ అన్నీ సమపాళ్లలో కలిపి స్ప్రే బాటిల్‌లో  పోయాలి. ఈ మిశ్రమాన్ని రోజూ పడుకునే ముందు  పాదాలకు స్ప్రే చేయాలి. ఇలా చేస్తే పాదాల చర్మం మృదువుగా అవుతుంది. 
– సంతోష్‌ కుమారి,  బ్యూటీషియన్‌

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)