Breaking News

చీరకట్టు.. కనికట్టు : ఎన్ని రకాలో!

Published on Tue, 03/11/2025 - 10:02

చీర.. దాన్ని కట్టుకుంటే వచ్చే అందమే వేరు! దాని ముందు ఎన్ని మోడర్న్‌ డ్రెస్‌లు అయినా దిగదుడుపే.. అవెంత సౌకర్యాన్నిచ్చినా! అందుకే అందం, అనుకూలత రెండిట్లోనూ అన్నితరాలకూ  చీర ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ అండ్‌ ఫ్యాషన్‌ కాస్ట్యూమ్‌గా మారింది. అలాంటి మన సంప్రదాయ కట్టుకు  ప్రాంతానికో తీరు ఉంది. కొన్నిటికి వాటి వెనుక పర్యావరణహితాలు కారణాలైతే కొన్నిటికి వాతావరణ పరిస్థితులు కారణాలుగా కనపడుతున్నాయి. ఇంకొన్నిటికి భౌగోళిక స్వరూపాలు కారణంగా నిలుస్తున్నాయి. 

కేరళలో కనిపించే ఆఫ్‌ వైట్‌ విత్‌ గోల్డెన్‌ బార్డర్‌ శారీ (ముండు)నే తీసుకుంటే.. ఆ  ప్యాటర్న్‌ రంగుల్లో కనిపించదు. కేవలం క్రీమ్‌ కలర్‌లోనే కనిపిస్తుంది. కేరళ తీరప్రాంతం కాబట్టి.. రంగుల అద్దకంతో ఆ నీటిని కలుషితం చేసుకోకూడదనే పర్యావరణ స్పృహతో ముండును పర్మినెంట్‌గా క్రీమ్‌కలర్‌లో   ప్యాక్‌ చేశారు. కూర్గ్‌కి వెళితే అక్కడ కొడగు కట్టు కనిపిస్తుంది. 

పశ్చిమ కనుమల్లో ఉన్న కూర్గ్‌ను కన్నడాలో కొడగు అని పిలుస్తారు. కొడగు చీర కట్టులో పమిట కుడివైపు, కుచ్చిళ్లు వెనుకవైపు ఉంటాయి. ఇది హిల్‌ స్టేషన్‌ కాబట్టి.. నడవడానికి, రోజూవారి పనులకు సౌకర్యంగా ఉండేందుకే ఇక్కడి స్త్రీలు చీరను అలా కట్టుకుంటారు. తమిళనాడులోని బ్రాహ్మణ స్త్రీలు మడిసర్‌ చీరకట్టులో కనిపిస్తారు. ఇది తొమ్మిది గజాల చీర. ఇదీ అంతే... రోజూవారీ పనులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. తొమ్మిది గజాలంటే గుర్తొచ్చింది.. తెలంగాణలోని కొన్నిప్రాంతాల్లో.. మహారాష్ట్రలోనూ తొమ్మిది గజాల చీరకట్టు కనపడుతుంది. దీనికి గోచీ చీర అనే వ్యవహార నామమూ ఉంది. ఈ చీరకట్టు కనిపించే ప్రాంతంలోని స్త్రీలు (దాదాపుగా) పొలాల్లో పనిచేసేవారే! చేలల్లో దిగి పనిచేయడానికి అనువుగా ఉండేలా ఈ కట్టును కనిపెట్టుకున్నారని శారీ చరిత్రలో కనిపిస్తున్న సాక్ష్యం. 

గోవాకు వెళితే.. కున్బీ కట్టు కనిపిస్తుంది. ఇది తొమ్మిది గజాల కట్టుకు ఆధునిక రూపం. మూలాలను మరవకుండా ఆధునికతనూ అలంకరించుకోవాలనే ఆసక్తిగల ఆడవాళ్లకు ఇష్టమైన కట్టు కున్బీ. ఇలాంటి వైవిధ్యమైన కట్టులతపాటు దేశం మొత్తమ్మీద 21 రకాల టెక్స్‌టైల్స్‌ కూడా ఉన్నాయని, ఇక్కడ కనిపించే రంగులకూ మన ప్రకృతి, పండే పంటలే ప్రేరణ, స్ఫూర్తి అని చెబుతారు రచయిత, హిస్టారియన్, డాక్యుమెంటరీ ఫిల్మ్‌ మేకర్, శారీ లవర్‌ మాళవికా సింగ్‌. 
 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)