Breaking News

Diwali 2024 దివాలీకి ఈ స్వీట్లు చేసిపెడితే : దిల్‌ ఖుష్‌!

Published on Mon, 10/28/2024 - 14:46

దీపాల పండుగ దీపావళి (Diwali 2024) కోసం ఉత్సాహంగా జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా పిల్లా పాపా అంతా  ఎదురు చూస్తున్నారు. దీపావళి  దీప కాంతులు, బాణాసంచా  వెలుగులతో పాటు, స్వీట్ల సందడి కూడా ఉంటుంది.మరి ఈ  క్రమంలో టేస్టీగా, ఈజీగా, హెల్దీగా  చేసుకునే రెండు హల్వాల గురించి తెలుసుకుందాం.   ఒకటి మూంగ్‌ హల్వా, రెండు క్యారెట్‌–ఖర్జూరం హల్వా. మరి వీటికి తయారీకి కావాల్సిన పదార్థాలు,  తయారీ విధానం  ఇదిగో..ఇలా..!


మూంగ్‌ హల్వా
కావల్సిన పదార్థాలు
నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు
చాయ పెసరపప్పు – అరకప్పు (కడిగిపెట్టుకోవాలి)
నీళ్లు – రెండు కప్పులు
నెయ్యి – అరకప్పు
గోధుమ పిండి – రెండు టేబుల్‌ స్పూన్లు
పంచదార – ముప్పావు కప్పు
ఫుడ్‌ కలర్‌ – చిటికెడు
యాలకుల పొడి – పావు టీస్పూను
జీడిపలుకులు – రెండు టేబుల్‌ స్పూన్లు
కిస్‌మిస్‌లు – రెండు టేబుల్‌ స్పూన్లు

తయారీ 

  • స్టవ్‌ మీద ప్రెజర్‌ కుకర్‌ పెట్టి వేడెక్కిన తరువాత టీస్పూను నెయ్యి వేసి పెసరపప్పును దోరగా వేయించాలి.
  • తరువాత రెండు కప్పుల నీళ్లుపోయాలి, కుకర్‌ మూతపెట్టి మూడు విజిల్స్‌ రానివ్వాలి.
  • పప్పు చల్లారాక మిక్సీజార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ∙స్టవ్‌ మీద మరో బాణలి పెట్టుకుని పావుకప్పు నెయ్యి, గోధుమ పిండి వేసి ఉండలు లేకుండా కలుపుతూ వేయించాలి.
  • పిండి వేగిన తరువాత పప్పు మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉడికించాలి.
  • ఐదు నిమిషాల తరువాత ముప్పావు కప్పు పంచదార వేసి సన్నని మంట మీద పదిహేను నిమిషాల పాటు తిప్పుతూ ఉడికించాలి.
  • ఇప్పుడు పప్పు మిశ్రమం బాగా ఉడికి బాణలికి అంటుకోకుండా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో ఫుడ్‌ కలర్‌ వేసి మరో ఇరవై నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి.  
  • స్టవ్‌మీద మరో పాన్‌ పెట్టి టేబుల్‌ స్పూను నెయ్యి, జీడిపలుకులు, కిస్‌మిస్‌లు వేసి గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌ లోకి వచ్చేంతవరకు వేయించి హల్వాలో వేయాలి. యాలకులపొడి వేసి రెండు నిమిషాలు తిప్పితే మూంగ్‌ హల్వా రెడీ. 

     

 

క్యారెట్‌–ఖర్జూరం హల్వా 

కావల్సిన పదార్థాలు 

ఖర్జూరం – పావు కప్పు (గింజలు తీసి, కడిగి, కొన్ని మంచి నీళ్లలో కొంత సేపు నానబెట్టి తీసి, ఉడికించి, మిక్సీ పట్టుకోవాలి)
క్యారెట్‌ తురుము– 1 కప్పు, కొబ్బరి పాలు– 2 కప్పులు
కొబ్బరి కోరు, కస్టర్డ్‌ మిల్క్‌– పావు కప్పు చొప్పున, నెయ్యి,
పంచదార– పావు కప్పు చొప్పున (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు), కుంకుమ పువ్వు – చిటికెడు, వెనీలా ఎసెన్స్‌– 1 టీ స్పూన్‌
కిస్మిస్‌ గుజ్జు– 1 టేబుల్‌ స్పూన్, డ్రై ఫ్రూట్స్‌ ముక్కలు– కొన్ని (నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి)


తయారీ

  • ముందుగా ఖర్జూరం గుజ్జు, కొబ్బరి పాలు, పంచదార, ఏలకుల పొడి వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం స్టవ్‌ ఆన్‌ చేసుకుని పాన్‌ బౌల్‌లో నెయ్యి వేడి చేసుకుని.. అందులో ఖర్జూరం మిశ్రమం మొత్తం వేసుకుని చిన్న మంట మీద, గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి.
  • కాస్త దగ్గర పడుతున్నప్పుడు క్యారెట్‌ తురుము, కస్టర్డ్‌ మిల్క్, ఫుడ్‌ కలర్‌ వేసుకుని తిప్పుతూ ఉండాలి.
  • ఆ తర్వాత కిస్మిస్‌ గుజ్జు, కొబ్బరి కోరు, వెనీలా ఎసెన్స్‌ ఒకదాని తరవాత ఒకటి వేసుకోవాలి.
  • ఆ మిశ్రమం మరింత దగ్గర పడగానే, డ్రై ఫ్రూట్స్‌ వేసుకుని ఒకసారి అటు ఇటు కలిపి, సర్వ్‌ చేసుకోవాలి.
     

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)