Breaking News

ఈసారి దీపావళికి చీరను వెరైటీగా కట్టుకోండిలా..!

Published on Wed, 10/23/2024 - 16:23

పండుగ టైంలో కూడా ఎప్పుడు కట్టుకునే విధంగానే డ్రెస్‌ లేదా చీరని కట్టుకుంటే కలర్‌ఫుల్‌నెస్‌ ఏముంటుంది..?. జోష్‌ ఏం వస్తుంది. ఏదైనా వెరైటీగా చేస్తేనే కదా..! పండగ మొత్తం మన నుంచే జరుగుతుందేమో..! అనేలా కనిపించాలి ఆహార్యం. అందుకు తగట్టు మన కట్టు, బొట్టు తీరు అదరహో అనే రేంజ్‌లో ఉండాలి. అందులోనూ ఇంకొద్ది రోజుల్లోనే దీపావళి వస్తోంది. మిరమిట్లుగొలిపే దీపాల కాంతిలో మనం ధరించే డ్రెస్‌ లేదా చీర అత్యంత శోభాయమానంగా కనిపించాలి. అందుకోసం ఈసారి చీరను ఇలా ఇన్ని రకాలుగా కట్టుకుని సందడి చేసేందుకు ప్రయత్నిద్దామా..!.

సెలబ్రిటీలకు చీరలు కట్టే డాలీ జైన్‌ డ్రేపింగ్‌ టెక్నీక్‌లతో ఈసారి పండగకు చీర కట్టుకుని అసలైన సందడిని, జోష్‌ని తెద్దామా..!. డాలీ రాధికా మర్చంట్‌ నుంచి నీతా వరకు ఎంతో మంది ప్రముఖులకు స్టైలిష్‌గా చీరలు కట్టేస్తుంది. ఒక్క చీరతోనే లెహంగా స్టైల్‌, వెస్ట్రన్‌​, గుజరాతీ స్టైల్లో చీరలు కట్టేస్తుంది. ఆమె చీర కట్టు తీరుకు సంబంధించిన ఓ ఐదు టెక్నీక్‌లు ఈసారి ట్రై చేసి చూద్దాం.

మెర్మైడ్ తరహా చీర
ఈ శైలిలో కట్టే చీరను ముందుగా నడుమ చుట్టు చక్కగా దోపి ఒకవైపుకే చీరను కుచ్చిళ్లలా మడతపెట్టి కడతారు. ఇది ఫిష్‌టైల్ లెహెంగా రూపాన్ని సృష్టిస్తుంది. దీని పేరుకు తగ్గట్టు సాగర కన్య మాదిరిగా ఉంటుంది ఈ చీర కట్టు తీరు. ఈ స్టైల్‌ కోసం సన్నటి బార్డర్‌, ఫ్లీ ఫ్యాబిక్‌ ఉన్న చీరలకే బాగుంటుంది. ఈ చీర లుక్‌ కోసం సరైన బ్రాస్‌లెట్, చెవిపోగులు ధరిస్తే హైలెట్‌గా ఉంటుంది. 

 

లెహంగా చీర
లెహంగాపై అందంగా చీరను చుట్టి ఓ కొత్త లుక్‌ని తీసుకొస్తారు. ఇందుకోసం విశాలమైన అంచుతో ఉన్న బనారసి లేదా కంజీవర చీర అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. జస్ట్‌ స్కర్ట్‌పైనే చీరను అందంగా కడతారు.

 

ఇండో-వెస్ట్రన్ శైలి..
ఆధునికత ఉట్టిపడేలా చీర కట్టుకోవాలనుకుంటే..చీరను వదులుగా ఉండే కుర్తా లేదా కేప్‌తో జత చేయాలి. ఈ ఇండో వెస్ట్రన్‌ చీర ఆధునికతకు కేరాఫ్‌గా ఉంటుంది. పైగా ఈతరహా స్టైల్‌ సౌలభ్యంగా కూడా ఉంటుంది.

  జలపాతం శైలి చీర
సంప్రదాయ శైలిలో చీరను ధరించి.. అతిథులందరి కంటే భిన్నంగా ఉండాలంటే ఈ శైలి అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. కొద్దిపాటి బార్డర్‌తో కూడిన చీర ఈ స్టైల్‌కి సరిపోతుంది.

 

సిద్ధ పల్లు తరహా చీర
ఇది చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఈ శైలి సంప్రదాయబద్ధమైన లుక్‌ని తీసుకొస్తుంది. క్లాసిక్‌ గుజరాతీ శైలీ చీరలు ఈ తరహా కట్టుకి సరిపోతాయి. దీనికి మంచి బెల్ట్‌ ధరిస్తే చీర లుక్‌ని బాగా హైలెట్‌ చేస్తుంది.

 

 

(చదవండి: ఊహకే అందని రైడ్‌..ఐతే అక్కడ మాత్రమే..!)
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)