Breaking News

క్యాబేజీతో క్రేజీగా...!

Published on Fri, 09/13/2024 - 10:11

క్యా... బే... జీ! పిల్లలు ఈ జోక్‌ని సరదాగా ఎంజాయ్‌ చేస్తారు. సిబ్లింగ్స్‌ ఒకరినొకరు తిట్టుకోనట్లు తిట్టుకుంటారు. పొగడక తప్పనట్లు పొగుడుకుంటారు. క్యాబేజీ తినమంటే మాత్రం ముఖం చిట్లిస్తారు. వారానికి ఒకసారి క్యాబేజ్‌ తినమంటోంది ఆరోగ్యం. క్యాబేజీతో ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటుంది?

క్యాబేజ్‌ కుల్చా..
కావలసినవి..
గోధుమపిండి– పావు కేజీ;
నూనె– 2 టీ స్పూన్‌లు;
నీరు – ము΄్పావు కప్పు;
ఉప్పు – పావు టీ స్పూన్‌;
స్టఫింగ్‌ కోసం... క్యాబేజ్‌ – పావు కేజీ;
నూనె – టేబుల్‌ స్పూన్‌;
పచ్చిమిర్చి – 2 (తరగాలి);
వాము – అర టీ స్పూన్‌;
అల్లం తురుము – టీ స్పూన్‌;
పసుపు – పావు టీ స్పూన్‌;
కొత్తిమీర తరుగు – టీ స్పూన్‌;
జీలకర్ర పొడి– అర టీ స్పూన్‌;
గరం మసాలా పొడి– అర టీ స్పూన్‌;
ఆమ్‌చూర్‌ – అరటీ స్పూన్‌;
ఉప్పు – అర టీ స్పూన్‌;
నూనె – టేబుల్‌ స్పూన్‌.

తయారీ..
– గోధుమపిండిలో ఉప్పు, నీరు పోసి ముద్దగా కలిపి పైన నూనె వేసి అద్ది పలుచని వస్త్రాన్ని కప్పి పక్కన పెట్టాలి.
– క్యాబేజ్‌ని శుభ్రంగా కడిగి మరుగుతున్న నీటిలో వేసి ఐదు నిమిషాల సేపు ఉంచి తీయాలి. నీరు పోయిన తర్వాత తురమాలి.
– వెడల్పు పెనంలో నూనె వేడి చేసి వాము గింజలు వేయాలి.
– అవి చిటపటలాడిన తర్వాత క్యాబేజ్‌ తురుము, ఉప్పు వేసి కలిపి మంట తగ్గించి మూతపెట్టాలి.
– ఏడెనిమిది నిమిషాలకు క్యాబేజ్‌ మగ్గుతుంది. అవసరమైతే కొద్దిగా నీటిని చిలకరించాలి.
– ఇప్పుడు పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, అల్లం, పసుపు, ఆమ్‌చూర్‌ పౌడర్, గరం మసాలా పొడులు వేసి కలిపి మూత పెట్టాలి.
– రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లి దించేయాలి. చల్లారే వరకు పక్కన పెట్టాలి.
– ఈ లోపు గోధుమ పిండితో చపాతీలు చేయాలి. ఒక చపాతీ మీద ఒక గరిటె క్యాబేజ్‌ స్టఫింగ్‌ పెట్టి ఆ పైన మరో చపాతీ పెట్టి అంచులను చేత్తో అతికించాలి.
– ఇప్పుడు క్యాబేజ్‌ సమంగా విస్తరించడానికి అప్పడాల కర్రతో జాగ్రత్తగా రోల్‌ చేస్తే అదే కుల్చా. ఇలాగే పిండి అంతటినీ చేయాలి.
– ఇప్పుడు చపాతీల పెనం వేడి చేసి ఒక్కో కుల్చాను చపాతీలాగానే నూనె వేస్తూ రెండువైపులా కాలనివ్వాలి.
– స్టఫింగ్‌ బరువుతో కుల్చా విరిగిపోకుండా జాగ్రత్తగా తిరగేయాలి.
– వేడి కుల్చాలోకి వెన్న, పెరుగు మంచి కాంబినేషన్‌. కారంగా తినాలంటే నిమ్మకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి బాగుంటుంది.

గమనిక: ఆమ్‌చూర్‌ పౌడర్‌ లేకపోతే తాజా మామిడి తురుము టీ స్పూన్‌ తీసుకోవాలి.

క్యాబేజ్‌ డ్రై మంచూరియా..
కావలసినవి..
క్యాబేజ్‌ – 200 గ్రాములు (తరగాలి);
ఉల్లిపాయ – 1 (పెద్దది, తరగాలి);
క్యాప్సికమ్‌ – 1 (తరగాలి);
క్యారట్‌ – 1 (తరగాలి);
షెజ్వాన్‌ సాస్‌ – అర టేబుల్‌ స్పూన్‌;
అల్లం తురుము – టీ స్పూన్‌; 
కశ్మీరీ మిరపొ్పడి– అర టీ స్పూన్‌;
మిరియాల పొడి– పావు టీ స్పూన్‌;
ఉప్పు – అర టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి;
శనగపిండి – 100 గ్రాములు;
మైదా – 50 గ్రాములు;
మొక్కజొన్న పిండి– 50 గ్రాములు;
నూనె – వేయించడానికి తగినంత;
గార్నిష్‌ చేయడానికి... క్యాబేజ్‌ తురుము – టేబుల్‌ స్పూన్‌;
కొత్తిమీర తరుగు – టీ స్పూన్‌.

తయారీ..
– వెడల్పు పాత్ర తీసుకుని అందులో నూనె మినహా మిగిలిన దినుసులన్నీ వేసి కలిపి పక్కన పెట్టాలి.
– నీరు అవసరం లేదు, కూరగాయల్లోని నీటితోనే పిండి ముద్దగా అవుతుంది.
– అరగంట తర్వాత మరోసారి బాగా కలుపుకోవాలి.
– బాణలిలో నూనె మరిగించి పై మిశ్రమాన్ని చేతి నిండుగా తీసుకుని వేళ్లతో కొద్ది కొద్దిగా నూనెలో వదలాలి.
– కాలి కొంచెం గట్టి పడిన తర్వాత చిల్లుల గరిటెతో అన్ని వైపులా బాగా కాలే వరకు తిరగేస్తూ కాలనివ్వాలి.
– ఒక ప్లేట్‌లో టిష్యూ పేపర్‌ పరిచి మంచూరియా దోరగా కాలిన తర్వాత తీసి పేపర్‌ మీద వేయాలి.
– వేడిగా ఉండగానే క్యాబేజ్, కొత్తిమీరతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేయాలి.

ఇవి చదవండి: ఉన్నది ఒకటే.. 'జిమ్'దగీ..!

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)