Breaking News

ఈ వెరైటీ వంటకాలను ఓసారి ట్రై చేయండి..!

Published on Sun, 09/15/2024 - 06:14

బ్రింజాల్‌ పిజ్జా..
కావలసినవి..
వంకాయలు– 3 లేదా 4 (కొంచెం పెద్ద సైజువి తీసుకుంటే పిజ్జాలు బాగా వస్తాయి)
ఆలివ్‌ నూనె– 1 టేబుల్‌ స్పూన్‌
బేబీ టమాటో– 2 (గుండ్రంగా కట్‌ చేసుకోవాలి)
మోజరెలా చీజ్‌– అర కప్పు
వెల్లుల్లి తురుము, మిరియాల పొడి– తగినంత
ఉప్పు– తగినంత, తులసి ఆకులు– కొన్ని

తయారీ..
– ముందుగా ఒక్కో వంకాయను శుభ్రం చేసుకుని గుండ్రంగా మూడు లేదా నాలుగు చక్రాల్లా కట్‌ చేసుకుని ఆలివ్‌ నూనెలో ముంచాలి.
– అనంతరం వాటిని ఒక ట్రేలో వరుసగా పేర్చుకుని, వాటిపై కొద్దిగా మోజరెలా చీజ్‌ వేసి, ఐదు నిమిషాల పాటు ఓవెన్‌లో దోరగా బేక్‌ చేసుకోవాలి.
– అనంతరం ముక్కలను బయటికి తీసి, వాటిపై మిరియాల పొడి, వెల్లుల్లి తురుము, చిన్నచిన్న టమాటో ముక్కలు, మోజరెలా చీజ్‌ చల్లుకోవాలి.
– మరోసారి ఆ ట్రేను ఓవెన్‌లో పెట్టుకుని, బేక్‌ చేసుకోవాలి. వాటిని తులసి ఆకులతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

పొద్దుతిరుగుడు లడ్డూ..
కావలసినవి..
పొద్దుతిరుగుడు గింజలు– 1 కప్పు
బెల్లం తురుము– 1 కప్పు
నీళ్లు– పాకానికి సరిపడా
కొబ్బరి తురుము– పావు కప్పు
నెయ్యి– 3 టేబుల్‌ స్పూన్లు

తయారీ..
– ముందుగా పొద్దుతిరుగుడు గింజలను నేతిలో దోరగా వేయించి, మిక్సీలో పౌడర్‌లా చేసుకోవాలి. ఈలోపు స్టవ్‌ ఆన్‌ చేసుకుని కళాయిలో బెల్లం తురుము, నీళ్లు పోసుకుని పాకం పెట్టుకోవాలి.
– చల్లారాక వడకట్టుకుని, అందులో నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం ఆ మిశ్రమంలో పొద్దుతిరుగుడు గింజల పొడి, 
కొబ్బరి తురుము వేసుకుని, ముద్దలా చేసుకోవాలి.
– అవసరం అయితే అదనంగా కాస్త నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.

టమాటో హల్వా..
కావలసినవి..
టమాటోలు– 10, 
పంచదార– 1 కప్పు
నెయ్యి– అరకప్పు, 
బొంబాయి రవ్వ– ఒక కప్పు
నట్స్‌– రెండు గుప్పిళ్లు, ఫుడ్‌ కలర్‌– అభిరుచిని బట్టి
ఏలకుల పొడి– అర టీస్పూను

తయారీ..
– ముందుగా టమాటోలను నీళ్లలో ఉడికించి చల్లార్చాలి. వాటిని మిక్సీలో వేసుకుని గుజ్జులా చేసుకుని, బౌల్‌లోకి వేయాలి.
– ఇప్పుడు స్టవ్‌ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసి నట్స్, బొంబాయి రవ్వలను విడివిడిగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
– ఇప్పుడు స్టవ్‌ మీద కాస్త లోతుగా ఉండే పాత్రని పెట్టి అందులో రెండు కప్పుల నీళ్లు పోయాలి.
– నీళ్లు మరిగాక వేయించిన బొంబాయి రవ్వ, కొద్దిగా నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి.
– రవ్వ చిక్కబడుతున్న సమయంలో టమాటో గుజ్జు, పంచదార, మిగిలిన నెయ్యి వేసి బాగా కలపాలి.
– ఆ మిశ్రమం హల్వాలా చిక్కబడుతున్న సమయంలో ఫుడ్‌ కలర్, ఏలకుల పొడి చల్లి, బాగా కలిపి దించేయాలి.
– తరువాత బౌల్‌ లోపల కాస్త నెయ్యి రాసి, సగానికి పైగా హల్వాని వేయాలి.
– తర్వాత నట్స్‌ చల్లుకుని, మిగిలిన హల్వా కూడా పైన వేసుకుని పరచుకోవాలి. గాలికి చల్లారి దగ్గరపడిన తర్వాత నచ్చిన షేప్‌లో కట్‌ చేసుకుంటే సరిపోతుంది.

ఇవి చదవండి:

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)