Breaking News

ధనత్రయోదశి 2024 : అసలే కొండెక్కిన గోల్డ్‌ , ఈ విషయాలు మీకోసమే!

Published on Fri, 10/25/2024 - 14:24

దీపావళి అనగానే  గుర్తొచ్చే  ముఖ్యమైన  వేడుక ధంతేరస్. ఐదు రోజుల దీపావళి పండుగకు నాంది ఈ ధనత్రయోదశి. కార్తీక మాసంలో కృష్ణ పక్షం పదమూడో రోజున జరుపుకునే ముఖ్యమైన పండుగ  ధన త్రయోదశి(ధంతేరస్‌) ఈ ఏడాది అక్టోబర్ 29న వస్తోంది.  

సాగర మథనం  సమయంలో దుర్గాదేవి ,కుబేరుడు సముద్రం నుండి ఉద్భవించారని పురాణ కథ  చెబుతోంది. అందుకే ఈ అందుకే త్రయోదశి నాడు ఇద్దరినీ పూజిస్తారు. అలాగే దేవతలు అసురులు "అమృతం"తో సముద్రంమీదుగా ప్రయాణిస్తున్నప్పుడు,  ధన్వంతరి భగవానుడు ఉద్భవించాడట. అందుకే  ఈ పండుగను ధనత్రయోదశి , ధన్వంతరి త్రయోదశి అని కూడా అంటారు.

అలాగే సంపద , శ్రేయస్సును సూచించే లక్ష్మీ దేవిని, కుబేరుడిని భక్తితో  పూజిస్తారు.  ఎంతో శుభప్రదమైన ఈ రోజున ఒక గ్రాము అయినా బంగారం లేదా విలువైన వస్తువలను, కొనుగోలు చేయడం అదృష్టంగా భావిస్తారు. అలాగే కొత్త పెట్టుబడులు లాభాలను ప్రసాదిస్తాయని  నమ్మకం. స్టాక్‌మార్కెట్లో కూడా దీపావళి రోజు ముహూరత్ ట్రేడింగ్ పేరుతో ప్రత్యేక ట్రేడింగ్‌ కూడా ఉంటుంది.

సాధారణంగా బంగారం, వెండి నగలను కొనుగోలు చేయడంతోపాటు  ఈ రోజు  కొత​ ఇల్లు,  కొత్త కారు, టీవీ తదితరఎలక్ట్రానిక్ వస్తువులను  ఇంటికి తెచ్చుకోవడం శుభప్రదంగా భావిస్తున్నారు. ఈ క్రేజ్‌ను సొంతం చేసుకునేందుకు అనేక ఆఫర్లు, బంపర్‌ ఆఫర్లు అంటూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు ఇబ్బడిముబ్బడిగా ఉంటాయి.  అసలే బంగార ధర కొండెక్కి కూర్చున్న  నేపథ్యంలో బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు సమయంలో తీసుకోవల్సిన కనీసం  జాగ్రత్తల గురించి తెలుసుకుందాం!

బంగారం స్వచ్ఛత
బంగారం స్వచ్ఛతను నిర్ధారించుకోవాలి.  సాధారణంగా 18 క్యారట్లు, 22 క్యారట్లు, 24 క్యారట్ల బంగారం అందుబాటులో ఉంటుంది.

హాల్ మార్క్ 
నమ్మకమైన దుకాణదారుని వద్ద మాత్రమే బంగారు, డైమండ్‌ ఆభరణాలను కొనుగోలు చేయడం  ఉత్తమం.  బంగారు ఆభరణాలు కొనుగోలులో అతి కీలకమైంది హాల్‌ మార్క్‌. బంగారు నాణ్యతకు ప్రామాణికమైన  బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) హాల్‌మార్క్‌ను ప్రభుత్వం మాండేటరీ చేసినప్పటికీ,  మన నగలపై  హాల్ మార్క్ ఉందో లేదో కచ్చితంగా చెక్‌ చేసుకోవాలి. ఆభరణాల లోపలి వైపు  ఉండే బీఐఎస్ సర్టిఫికేషన్ మీదే నగల విలువ ఆధారపడి ఉంటుంది.( Dhanteras 2024 : వెండి, బంగారమేనా? ఇలా చేసినా ఐశ్వర్యమేనట!)


 

తూకానికి సంబంధించి  బంగారం, గ్రాములు. మిల్లీ గ్రాములు లెక్కను సరిగ్గా చూసుకోవాలి. లేదంటే, ఆదమరిచి ఉంటే,  మోసపోయే, డబ్బులు  నష్టపోయే అవకాశం ఉంది. ఆ రోజు మార్కెట్లో ధరను పరిశీలించాలి. తరుగు, మజూరీ చార్జీలను కూడా కూడా ఒక కంట గమనించాలి.  డైమండ్‌నగల విషయంలో అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి.

 

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)