Breaking News

భళా వైభవ్‌...వైకల్యానికి ‘చెక్‌’ పెట్టాడు!

Published on Fri, 05/02/2025 - 09:52

సెరిబ్రల్‌ పాల్సీతో చక్రాల కుర్చీకే పరిమితమైన వైభవ్‌కు చెస్‌ పరిచయం చేశాడు తండ్రి గౌతమ్‌. ఆనాటి నుంచి ఒంటరి ప్రపంచం నుంచి చదరంగ ప్రపంచంలోకి వచ్చాడు వైభవ్‌. తండ్రితో కలిసి తరచుగా చెస్‌ ఆడేవాడు. క్రమంగా ఆటలో నైపుణ్యం సాధించాడు. ఆ నైపుణ్యం అతడిని జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది.

దిల్లీ ఇంటర్నేషనల్‌ టోర్నమెంట్‌ వైభవ్‌ తొలి టోర్నమెంట్‌. తొలి ప్రయత్నంలోనే రేటింగ్‌ను సాధించడం విశేషం. చెస్‌లో మరిన్ని శిఖరాలను అధిరోహించడానికి అవసరమైన స్ఫూర్తిని ఆ రేటింగ్‌ ఇచ్చింది.

గ్రాండ్‌ మాస్టర్‌’ కావాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. దేశవిదేశాల్లో జరిగే టోర్నమెంట్స్‌కు వైభవ్‌తో పాటు అతడి తండ్రి గౌతమ్‌ కూడా వెళుతుంటాడు. మ్యాచ్‌ సమయంలో అతడి పక్కనే కూర్చొని నొటేషన్‌లు రాస్తుంటాడు. కొడుకు కెరీర్‌ పట్ల తండ్రి చూపిస్తున్న అంకితభావం మాటలకు అందనిది.

ఇదీ చదవండి: అత్తగారు, ఆవకాయ పచ్చడి : ఉపాసన కొణిదెల వీడియో వైరల్‌
 

 ఆటలంటే ఇష్టపడే గౌతమ్‌ తన కుమారుడు కూడా ఆటలు ఆడాలనుకునేవాడు. న్నప్పటి నుం వీల్‌చైర్‌కే పరిమితమైన వైభవ్‌ క్రికెట్, వాలీబాల్, కబడ్డీ...లాంటి ఆటలు ఆడలేడు. 

 

 

‘ఇంతేనా’ అని కుమారుడి గురించి ఆలోచిస్తున్న సమయంలో ‘చెస్‌’ అనే ఆలోచన మెరిసింది. ఇక అప్పటి నుంచి కుమారుడికి చెస్‌పై ఆసక్తి కలిగేలా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. తానే గురువుగా మారాడు. మొదట్లో తండ్రి ఒక గేమ్, కొడుకు ఒక గేమ్‌ గెలిచేవారు. ఆ తరువాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారి΄ోయింది. తండ్రిపై ఎప్పుడూ వైభవే విజయం సాధించేవాడు. దీంతో కుమారుడిపై ఆ తండ్రికి మరింత నమ్మకం  కలిగింది.

‘యస్‌. మా వాడు సాధించగలడు’ ఒకటికి పదిసార్లు అనుకునేవాడు. ఆటలో మరింత నైపుణ్యం కోసం రామ్‌కుమార్‌ అనే కోచ్‌తో వైభవ్‌కు ఆన్‌లైన్‌లో కొన్ని నెలలు శిక్షణ ఇప్పించాడు. ఆ తరువాత జీబి జోషిని కోచింగ్‌ ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాడు. ‘మీరు ఎంత ఫీజు అడిగినా ఇస్తాను’ అన్నాడు. ‘ఒక్క పైసా కూడా అక్కర్లేదు’ అంటూ వైభవ్‌కు ఉచిత కోచింగ్‌ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు జోషి. ఆటలో ఎప్పటికప్పుడు రేటింగ్‌ పెంచుకుంటూ అద్భుతం అనిపించు కుంటున్నాడు వైభవ్‌.

‘వైభవ్‌ శారీరక స్థితికి వీల్‌చైర్‌లో కూర్చుని చెస్‌ ఆడడం అనేది అంత సులువైన విషయమేమీ కాదు. దీని కోసం ఎంతో కఠోర సాధన చేశాడు’ అంటున్నాడు గౌతమ్‌. జీవనోపాధి కోసం గౌతమ్‌ దిల్లీలో చిన్న షాప్‌ నడుపుతున్నాడు. ‘మీరు ఎక్కువ సమయం వైభవ్‌తోనే గడపాల్సి వస్తుంది కదా’ అని అడిగితే ఆ తండ్రి చెప్పిన జవాబు...

‘మా అబ్బాయికి కచ్చితంగా మంచి టైమ్‌ వస్తుంది. అప్పటి వరకు నా టైమ్‌ గురించి ఆలోచించడం లేదు’ ‘ఇలా అయితే ఎలా?’ అని ఎప్పుడూ బాధ పడలేదు వైభవ్‌. ఆ యువకుడు నడవలేడు. మాట్లాడలేడు. 90 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగుడు. తనను నిస్సహాయ స్థితిలో నుంచి బయటికి తీసుకువచ్చి కొత్త ప్రపంచం చూపించింది చదరంగం....

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)