Breaking News

'స్పేస్‌ మీల్‌': వ్యోమగాముల కోసం ప్రత్యేక భోజనం!

Published on Tue, 01/09/2024 - 12:09

అంతరిక్ష రహస్యాలను ఛేదించడానికి వ్యోమగాములు (అస్ట్రోనాట్స్‌) శ్రమిస్తుంటారు. ఇందుకోసం సుదీర్ఘకాలం గగనతలంలోనే ఉండాల్సి వస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌), నాసా స్పేస్‌ షటిల్స్‌లో వ్యోమగాములు నెలల తరబడి గడపాల్సి ఉంటుంది. ప్రయోగాల్లో భాగంగా కొన్నిసార్లు సంవత్సరానికిపైగానే అంతరిక్షంలో ఉండిపోవాలి. పైగా భూమిపై గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లుగా అక్కడ ఎలాంటి గురుత్వాకర్షణ శక్తి ఉండదన్న సంగతి తెలిసిందే. ఇలా స్పేస్‌లో ఉండే వ్యోమగాములకు సరైన పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వడం కష్టంగా ఉంది. దీనిపై శాస్త్రవేత్తలు పలుపరిశోధనలే చేశారు. ఆ సమస్యకు చెక్‌ పెడుతూ ఆ గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా ఉండేలా మంచి ఆహారాన్ని తయారు చేశారు శాస్త్రవేత్తలు. ఆ ఆహారం ప్రత్యేకత ఏంటీ? తదితర విశేషాలు తెలుసుకుందాం!.

స్పేస్‌ ట్రావెలర్స్‌ అంతరిక్షంలో అన్ని రోజులు ఉంటే వారి ఆరోగ్యంపై పలు ప్రభావాలు ఉంటాయని విన్నాం. అయితే ఇప్పటి వరకు వారికి సరైన ఆహారం అందించడంలో శాస్త్రవేత్తలు విఫలమవుతూ వస్తున్నారు. ఇంతవరకు వారికి ప్రిజర్వేటడ్‌ ప్యాక్‌ చేసిన ఆహారాలను మాత్రమే ఇస్తున్నారు. అయితే అవి స్పేస్‌లోకి వెళ్లాక చప్పగా అయిపోవడం జరగుతోంది. దీంతో ఈ వ్యోమగాములకు సరైన పోషకాలతో కూడిన ఆహారం అందక పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

అయితే ఆ సమస్యకు చెక్‌పెడుతూ ఏసీఎస్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ "ఆప్టిమల్‌ స్పేస్‌ మీల్‌" అనే శాఖాహార సలాడ్‌ని కనిపెట్టింది. ఇది అక్కడ ఉండే వ్యోమగాములకు అన్ని రకాల పోషకాహారాన్ని అందించడంలో సహాయపడుతుంది. నిజానికి స్పేస్‌లో ఉండే వ్యోమగాములకు భూమిపై ఉండే మానువుల కంటే ఎక్కువ కేలరీలను బర్న్‌ చేస్తారు. జీరో మైక్రోగ్రావిటీలో ఎక్కువ సేపు గడుపుతారు కాబట్టి వారికి కాల్షియం వంటి అదనపు సూక్ష్మపోషకాలు అవసరం అవుతాయి.

వారికీ ఈ ప్రత్యేకమైన ఫుడ్‌ ఆ లోటుని భర్తి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలం స్పేస్‌ మిషన్‌లో ఉండేవారికి మంచి ఆహారాన్ని అందించేలా నిపుణులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈ భోజనాన్ని తయారు చేశారు. దీనిలో తాజా ఆకుకూరలకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే వారికి అందించే శాకాహార పంటలను తక్కువ నీరు, తక్కువ ఎరువులతో పండించాలని అన్నారు.

పరిశోధకులు ఈ "స్పేస్‌ మీల్"ని సోయాబీన్స్, గసగసాలు, బార్లీ, కాలే, వేరుశెనగ, చిలగడదుంప, పొద్దుతిరుగుడు విత్తనాలు వంటి వాటితో తయారు చేశారు. ఈ శాకాహార భోజనంతో వ్యోమగాములకు గరిష్ట పోషాకాలు అందడమే గాక సమర్థవంతమైన సమతుల్య ఆహారమని చెబుతున్నారు పరిశోధకులు. ఈ భోజనాన్ని భూమిపై ఉన్న వారికి ఇవ్వగా చక్కటి ఫలితం వచ్చిందని అన్నారు. అందువల్ల స్పేస్‌లో ఉండే వారికి ఇది మంచి మీల్‌ అని నమ్మకంగా చెప్పొచ్చు అని అన్నారు. 

(చదవండి: మసాలా దినుసులు ఘాటు పోకూడదంటే..ఇలా స్టోర్‌ చేయండి!)


 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)