హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్
Breaking News
'వర్క్–లైఫ్'లలో ఏది ముఖ్యం? జెన్-జడ్ యువతరం ఏం అంటుందంటే..
Published on Fri, 12/26/2025 - 18:34
ఉద్యోగ జీవితం ఎలా ఉంది? ఆనందంగా ఉందా? ‘అవసరం కాబట్టి తప్పదు’ అన్నట్లుగా ఉందా? ఉద్యోగ జీవితంలో ఆనందపరిచేవి ఏమిటి? వర్క్–లైఫ్‌లలో ఏది ముఖ్యం?... ఇలా ఎన్నో ప్రశ్నలను యువతరం ముందు పెట్టింది డెలాయిట్ గ్లోబల్ సర్వే 2025. ఆ సర్వే ప్రకారం..
చాలా స్పీడ్‌గా తమ కెరీర్‌లో ఉన్నతస్థాయికి చేరుకోవాలనుకోవడం కంటే, వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌పై మన జెన్–జడ్ యువతరం అధికంగా దృష్టి సారిస్తోంది. ‘జాబ్ లెర్నింగ్’ అనేది ‘కెరీర్ గ్రోత్’కు ఉపయోగపడుతుంది అని మన దేశ జెన్–జడ్‌లో 94 శాతం మంది చెబుతున్నారు. లెర్నింగ్ ఫ్లాట్‌ఫామ్‌లు, సబ్‌స్క్రిప్షన్‌లకు యాక్సెస్ ద్వారా తమ వృత్తినైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నట్లు చెబుతున్నారు.
జెన్ ఏఐ
మన దేశంలో 85 శాతం జెన్–జడ్‌లు, 85 శాతం మిలీనియల్స్ తమ రోజువారి పనిలో ‘జెన్ ఏఐ’ని ఉపయోగిస్తున్నారు. జెన్–జడ్‌లు ఎక్కువగా డిజైన్, కంటెంట్ క్రియేషన్, డేటా విశ్లేషణ, ప్రాజెక్ట్ మెనేజ్‌మెంట్ కోసం జెన్ ఏఐని ఉపయోగిస్తున్నారు. తమ వృత్తినైపుణ్యాన్ని పెంచుకోవడానికి ‘జెన్ ఏఐ’ ఉపయోగపడిందని చెబుతున్నారు.
ఆర్థిక అభద్రత
ఆర్థిక భద్రత లేని పనిని అర్థవంతమైన పనిగా భావించే అవకాశం తక్కువగా ఉంటుందని, ఆర్థికభద్రత లేకుండా మానసిక ప్రశాంతత సాధ్యం కాదని జెన్–జడ్‌లు, మిలీనియల్స్ చెబుతున్నారు.గత సంవత్సరం నుంచి యువతరంలో ఆర్థిక అభద్రత(ఫైనాల్సియల్ ఇన్‌సెక్యూరిటీ) పెరుగుతోంది. జెన్–జడ్‌లో 28 శాతం మంది, మిలీనియల్స్‌లో 31 శాతం మంది తాము ఆర్థికంగా సురక్షితంగా లేమని చెబుతున్నారు.
పాజిటివ్ వెల్‌బీయింగ్
పాజిటివ్ వెల్‌బీయింగ్ పనిలో ఉత్సాహాన్ని పెంచుతుంది. సమాజానికి ఉపయోగపడే ఉద్యోగం చేస్తున్నామని జెన్–జడ్‌లో 52 శాతం మంది, మిలీనియల్స్‌లో 60 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. ఇక ‘పూర్ మెంటల్ వెల్–బీయింగ్’ విభాగంలో జెన్–జడ్‌లు 32 శాతం, మిలీనియల్స్ 33 శాతం ఉన్నారు.
మరి కొన్ని...
టైమ్ మేనేజ్‌మెంట్ అనేది కెరీర్‌లో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుందని జెన్–జడ్, మిలీనియల్ ఇండియన్‌లు విశ్వసిస్తున్నారు
ఉన్నత విద్యను అభ్యసించకపోవడానికి ఆర్థిక పరిమితులు ప్రధాన కారణం అంటున్నారు.
జెన్–జడ్‌లో 32 శాతం, మిలీనియల్స్‌లో 44 శాతం తాము ఇప్పటికే ‘జెన్ ఏఐ’ ట్రైనింగ్ పూర్తిచేశామని చెబుతున్నారు. జెన్–జడ్‌లో 51 శాతం, మిలీనియల్స్‌లో 43 శాతం రాబోయే పన్నెండు నెలల కాలంలో ‘జెన్ ఏఐ’ శిక్షణ పూర్తిచేస్తామని చెబుతున్నారు.
∙
Tags : 1