Breaking News

పాత జీన్స్‌ ప్యాంటులతో స్లీపింగ్‌ బ్యాగ్‌లు..ఒక్కో జీన్స్‌కి ఏకంగా..!

Published on Sun, 06/23/2024 - 13:02

మన ఉపయోగించే బట్టల వల్ల కాలుష్యం ఏర్పడుతుందని తెలుసా..!. ఏటా వేల బట్టలు చెత్త కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. వాటిని కాల్చడం వల్ల మరింత కాలుష్యం ఏర్పడుతుంది. అవి మట్టిలో కలిసిపోయేందుకు చాలా టైం పడుతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం పర్యావరణవేత్తలు పలు మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు కూడా. ముఖ్యంగా జీన్స్‌ లాంటి దుస్తులు అంతతేలిగ్గా మట్టిలో కలిసిపోవు. పైగా దీని తయారీ కోసం ఎన్ని నీళ్లు ఖర్చుఅవుతాయో వింటే షాకవ్వుతారు. అలాంటి పాత జీన్స్‌ రీసైకిల్‌ చేసి ఉపయోగపడేలా చక్కగా రూపాందిస్తున్నాడు 16 ఏళ్ల యువకుడు. అంతేగాదు పర్యావరణ సంరక్షణలో తన వంతు పాత్ర పోషిస్తూ అందిరిచేత శెభాష్‌ అని ప్రశంలందుకుంటున్నాడు. అతనెవరంటే..

ఢిల్లీకి చెందిన 16 ఏళ్ల నిర్వాన్‌ సోమనీ మన ఇంట్లో ఉండే దుస్తులు, వాటికి ఉపయోగించే రంగులు వల్ల ఎంత కాలుష్యం ఏర్పడతుందో తెలుసుకున్నాడు. అదీగాక ఏటా ఈ దుస్తులు వ్యర్థాలు ఎంతలా కుప్పలుగా పేరుకుపోతున్నాయో గమనించాడు. పర్యావరణ సమస్యకు చక్కటి పరిష్కారం చూపించ్చేలా ఏదైనా చేయాలనుకున్నాడు. అలా అతడి దృష్టి జీన్స్ దుస్తులపై పడింది. అప్పుడే.. ఒక్కో జీన్స్‌ తయారీకి ఏకంగా పదివేల లీటర్లు అవుతుందని, తెలుసుకుని షాక్‌ అవ్వుతాడు. 

ఐదు జతల జీన్స్‌కి ఏకంగా 50 వేల లీటర్ల అవుతాయా అని విస్తుపోయాడు. అంత నీటిని ఖర్చు చేస్తున్న ఈ జీన్స్‌లు సౌకర్యవంతంగా వినియోగించేలా రీ సైకిల్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలోనే ప్రాజెక్ట్‌ జీన్స్‌ పేరుతో స్లీపింగ్‌ బ్యాగ్‌లు తయారు చేయడం ప్రారంభించాడు. కొన్ని కార్పొరేట్‌ సంస్థలు, వ్యక్తులు సహాయంతో నిర్వాణ్‌ వేల జతలు జీన్స్‌లు సేకరించాడు నిర్వాన్‌. వాటితో దాదాపు 900 స్లీపింగ్‌ బ్యాగ్‌లను రూపొందించాడు. 

అవి ఎవరికీ ఇస్తారంటే..
ఢిల్లీలో చలికాలంలో రోడ్లపై నిద్రించే నిరాశ్రయులకు స్లిపింగ్‌ బ్యాగ్‌లు అందిస్తున్నాడు నిర్వాన్‌. సాధారణంగా మనం వారికి దుప్పట్లు ఇస్తుంటాం. అయితే అది పరిష్కారం కాదు. అవి కొంతకాలం తర్వాత చిరిగిపోతాయి. నిద్రపోయేలా పరుచుకుని పడుకోవడం కుదరదు కూడా. దీంతో ఈవిషయమై లోతుగా ఆలోచించి మరీ ఇలా స్లీపింగ్‌ బ్యాగ్‌లు రూపొందించాడు. అవి బెడ్‌ మాదిరిగా  ఉండి..దాని లోపల పడుకోవచ్చు. ఎలా అంటే.. పడుకునే బెడ్‌ కమ్‌ దుప్పటిగా ఉంటుంది. ఇది వారికి సౌకర్యవంతంగా, ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది. మిగతా దుస్తులు కంటే జీన్స్‌ చాలా దృఢంగా ఉంటుంది. అంత ఈజీగా చీరగదు కాబట్టి నిరాశ్రయులకు, అభాగ్యులకు ఇది బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నాడు నిర్వాన్‌. 

తనకు ఈ ఆలోచన రావడానికి కారణం వాళ్లమ్మ దుస్తుల దుకాణమేనని చెబుతున్నాడు. అక్కడ చాలా మెటీరియల్‌లు కుట్టగా చాలా దుస్తుల వేస్టేజ్‌ వస్తుంది. వాటిలో కొంత మేర ఏదో రకంగా ఉపయోగిస్తాం. మిగతా చాలా వరకు వేస్ట్‌ అయ్యేది. దాన్ని ఉపయోగిస్తూ ఏదైనా చేయగలనా అనుకున్నాను అలా ఈ స్లీపింగ్‌ బ్యాగ్‌లు తయారు చేసినట్లు వివరించాడు. గతేడాది టర్కీలో భూకంపం వచ్చి నిరాశ్రయులుగా మారిన ప్రజల కోసం దాదాపు 400 స్లీపింగ్‌ బ్యాగ్‌లను అందజేశాడు నిర్వాన్‌. మన అలమార్లో వృధాగా పడి ఉన్న జీన్స్‌ని అతడి కంపెనీకి అందజేస్తే మన వంతుగా పర్యావరణ సంరక్షణలో బాధ్యత తీసుకున్నట్లే అవుతుంది. ఈ పర్యావరణ కోసం అందరూ ఇలాంటి పలు కార్యక్రమాలు చేసి మన పుడమతల్లిని కాలుష్యం కోరల నుంచి కాపాడుకుందాం!.

(చదవండి: ఆరు తరాలు, 185 మంది సభ్యులు..ఇప్పటికి ఒకే ఇంటిలో..)

 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)