నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
పసికందుపై అఘాయిత్యం, బతికుండగానే ఇసుకలో పాతేశాడు!
చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసులు కాల్పులు జరిపారు: సజ్జల
రైల్వే కౌంటర్ టికెట్లకు ఇక కొత్త సదుపాయం.. ఈ 27 నుంచే..
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు
లాఠీఛార్జ్ చేశారు.. టియర్ గ్యాస్ ప్రయోగించారు: లేళ్ల అప్పిరెడ్డి
ఈసీకి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
39 గంటల రెస్క్యూ ఆపరేషన్ : 9 ఏళ్ల బాలుడి విషాదాంతం
గ్లాస్గోలో కుప్ప కూలిన విమానం, ఇద్దరు మృతి
టీడీపీ గూండాల చేతుల్లో వేటకొడవళ్లు, పెట్రోల్: అవినాశ్ రెడ్డి
పులివెందులలో ఏకే 47తో కాల్పులు
ఎంపీ చేతుల్లోంచి నామినేషన్ పేపర్లు లాక్కుని..
బాలీవుడ్ హీరోకి షాక్ : అక్రమ నిర్మాణం కూల్చివేత
తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యం
IPL 2027: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడికి గుడ్‌బై
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్‌కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
ఏప్రిల్ 15: ముఖ్య సంఘటనలు, విశేషాలు ఇవే!
Published on Sat, 04/15/2023 - 12:57
గడిచిన కాలంలో ఎన్నో ఆసక్తికర, వింత సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందులో కోన్ని ఎప్పటికి చరిత్రలో నిలిచిపోయే అంశాలు ఉన్నాయి. మరి ఈ రోజు ఏప్రిల్ 15. ఈ రోజున గతంలో ఎన్నో వింతలు, విశేషాలు జరిగి ఉంటాయి కదా. మరి ఈ విశేషాలు ఏంటీ! చరిత్రలో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి!
చరిత్రలో నేటి ముఖ్య సంఘటనలు
- 1865: అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ మరణించిన రోజు.
- 1912: టైటానిక్ షిప్ మునిగిపోయింది ఈ రోజే. బ్రిటిష్ ప్యాసింజర్ లైనర్ ఆర్ఎమ్ఎస్ టైటానిక్ ఉత్తర అట్లాంటిక్‌లో తెల్లవారుజామున 2:20 గంటల సమయంలో మంచుకొండను ఢీకొన్న రెండు గంటల నలభై నిమిషాల తర్వాత మునిగిపోయింది. ఈ ఘటనలో 2,224 మంది ప్రయాణికులు, సిబ్బందిలో 710 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
- 1923: ఇన్సులిన్ సాధారణంగా అందుబాటులోకి వచ్చిన రోజు
- 1925: ప్రత్యేక గోదావరి జిల్లా ఏర్పడిన రోజు. గోదావరి జిల్లాను, కృష్ణా జిల్లాను విడదీసి, పశ్చిమ గోదావరి ప్రత్యేక జిల్లాగా ఏర్పరిచారు.
- 1936: పాలస్తీనాలో అరబ్ తిరుగుబాటు మొదటి రోజు.
- 1952: బోయింగ్ B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ మొదటి విమానంగా గుర్తించిన రోజు.
- 1961: యూరి గగారిన్, అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తిగా ఆర్డర్ ఆఫ్ లెనిన్ లభించిన రోజు.
- 1969 - EC-121 షూట్‌డౌన్ సంఘటన: జపాన్ సముద్రం మీదుగా యునైటెడ్ స్టేట్స్ నేవీ విమానాన్ని ఉత్తర కొరియా కూల్చివేసి అనంతరం అందులోని 31 మంది అమెరికా సైనికులను చంపింది ఈ రోజే.
- 1986: లిబియా ఉగ్రవాదానికి ప్రతీకారంగా అమెరికా యుద్ధ విమానాలు లిబియాలోని ట్రిపోలీపై బాంబు దాడి చేసింది ఈ రోజే.
ప్రముఖుల జననం
- 1452: లియొనార్డో డావిన్సి గణితజ్ఞుడు, ఇంజనీర్ లియోనార్డో డావిన్సి జననం. ఆయన చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, వృక్షశాస్త్రజ్ఞుడు, సంగీతకారుడు కూడా. ఆయన 1519లో మరణించారు.
- 1843: అమెరికన్ నవలా రచయితహెన్రీ జేమ్స్ జననం
- 1932: మరాఠీ కవి సుదర్శన్ భట్ జననం. ఆయన 2003లో అనారోగ్యంతో మృతి చెందారు.
ప్రముఖుల మరణాలు
- 1845: మహారాజా చందు లాల్ మృతి. హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రిగా, పేష్కరుగా పలు హోదాల్లో పనిచేసిన రాజకీయవేత్త.
- 1865 : అబ్రహం లింకన్, అమెరికా 16 వ అధ్యక్షుడు. ఆయన 1809లో జన్మించారు.
- 1961: రాచాబత్తుని సూర్యనారాయణ, సాతంత్ర్యసమయోధుడు మృతి. ఆయన 1903 జన్మించారు
- 1965: బండారు రామస్వామి, నాట్య కళాకారులు, బంధిఖానా, భక్త రామదాసు, కర్ణుని స్వామిభక్తి, దమయంతి మొదలైన ఏకపాత్రాభినయం రచనలను నిర్వహించారు.
పండుగలు, ముఖ్యమైన రోజులు
- హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర దినోత్సవం.
- ప్రపంచ కళా దినోత్సవం
- సాంస్కృతిక సార్వత్రిక దినోత్సవం.
#
Tags : 1