Breaking News

చూస్తే.. గోరంత చేపలే! ఇవి శబ్దం చెవులు చిల్లులు పడాల్సిందే!!

Published on Sun, 06/30/2024 - 04:19

ఈ నీటితొట్టెలోని చేపలను చూశారు కదా! ఇవి చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. వీటి పొడవు దాదాపు గోరంత ఉంటుంది. కచ్చితంగా చెప్పాలంటే, ఇవి 10 నుంచి 12 మిల్లీమీటర్ల పొడవు వరకు ఉంటాయి. పారదర్శకంగా తళతళలాడుతూ చూడచక్కగా ఉంటాయి.

అయితే, ఇవి శబ్దం చేస్తే మాత్రం చెవులు చిల్లులు పడాల్సిందే! ఈ చేపలకు శాస్త్రవేత్తలు ‘డేనియోనెల్లా సరీబ్రమ్‌’ అని పేరుపెట్టారు. వీటి నుంచి వెలువడే శబ్దం 140 డెసిబల్స్‌ వరకు ఉంటుంది. మామూలుగా మనుషుల చెవులు 70 డెసిబల్స్‌ వరకు శబ్దాన్ని భరించగలవు. అంతకు రెట్టింపు స్థాయిలో కూత పెట్టగలగడమే ఈ గోరంత చేపల ప్రత్యేకత.

వీటి శబ్దం దాదాపుగా జెట్‌విమాన శబ్దంతో సమానంగా ఉంటుంది. ఈ చేపలను తొలిసారిగా 1980లలో గుర్తించారు. అయితే, ఈ చేపలను పోలిన ‘డేనియోనెల్లా ట్రాన్స్‌లూసిడా’ అనే మరోరకం చేపలు కూడా ఉండటంతో శాస్త్రవేత్తలు వీటి లక్షణాలను నిర్దిష్టంగా గుర్తించడంలో కొంత గందరగోళానికి లోనయ్యారు.

మూడేళ్ల కిందట ఒక అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం వీటిపై పరిశోధనలు జరిపి, వీటి కూత శక్తిని తెలుసుకున్నారు. వీటి గొంతు వద్ద ధ్వనికండరాలు, మృదులాస్థి ప్రకంపనల ద్వారానే ఈ చేపలు చెవులు చిల్లులు పడే స్థాయిలో కూత పెట్టగలుగుతున్నాయని గుర్తించారు. వీటి కూత ముందు సింహగర్జన కూడా బలాదూరే! సింహగర్జన శబ్దం 114 డెసిబల్స్‌ అయితే, ఈ చేపల కూత శబ్దం 140 డెసిబల్స్‌. ఇంతకు మించిన శబ్దం చేసే జీవి ప్రపంచంలో మరేదీ లేదు.
 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)