వేసవి సీజన్‌ ముగిసినా విహారయాత్రలు...

Published on Wed, 07/08/2026 - 23:15

ప్రతీ ఏడాది మే నెలాఖరు లేదా జూన్‌ మొదటివారంలో ముగియాల్సిన సమ్మర్‌ టూర్స్‌ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జూన్‌ నెల ముగుస్తున్నప్పటికీ చల్లని ప్రాంతాలకు నగరవాసుల పరుగులు ఆగడం లేదు. హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రో నగరాలకు చెందిన పర్యాటకులూ ఇదే  ధోరణి కనబరుస్తున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది.

తగ్గని వేడి...ఛలో మరి...
దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఉపశమించే జాడలు కనిపించని పరిస్థితుల్లో జూన్‌ నెలలోనూ చల్లని ప్రదేశాలు రద్దీని చవిచూస్తూనే ఉన్నాయి. పర్వత ప్రాంత విహారయాత్రల పట్ల పెరిగిన ఆసక్తికి నిదర్శనంగా ఈ నెలలో సిమ్లాలోని వసతి గృహాలలో బుకింగ్‌లు  గతేడాదితో పోలిస్తే ‘76 శాతం పెరిగాయని హాస్పిటాలిటీ, బ్యాక్‌ప్యాకర్‌ హాస్టల్‌ చైన్‌ అయిన జోస్టెల్‌ విడుదల చేసిన డేటా వెల్లడించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే శ్రీనగర్, తీర్థన్‌ వ్యాలీ, గాంగ్‌టక్‌ వంటి గమ్యస్థానాలకు వచ్చే సందర్శకుల సంఖ్యలో ఏకంగా ‘95 శాతం వృద్ధి‘ నమోదవడం విశేషమని పేర్కొంది. 

గత ఏడాదితో పోలిస్తే ఈ జూన్ లో జోస్టెల్‌ ప్రాపర్టీలలో పర్వత ప్రాంత బుకింగ్‌లు 76 శాతం పెరిగాయి, మరియు ఆ బుకింగ్‌లలో దాదాపు సగం ప్రయాణ తేదీకి 72 గంటల లోపే జరిగాయి. దాదాపు ‘48 శాతం‘ మంది ప్రయాణానికి మూడు రోజుల ముందే  బుకింగ్‌లు చేసుకున్నారు. అంటే అనుకోని విధంగా పెరుగుతున్న ఎండల నేపధ్యంలోనే  ఆకస్మిక ప్రయాణాల పట్ల ఆసక్తి పెరిగినట్టు కూడా ఇది సూచిస్తోంది.  హోటళ్లలో అధిక ఆక్యుపెన్సీ  ఏప్రిల్‌ నెలలో ప్రారంభమై  జూన్‌ నెలలోనూ కొనసాగడం గమనార్హం.  కసౌలిలోని వెల్‌కమ్‌హెరిటేజ్‌ పార్వ్‌ విలాస్‌ రిసార్ట్‌ – స్పా వంటి హాస్పిటాలిటీ సంస్థలు ఈ నెలలో ఆక్యుపెన్సీ స్థాయిలు  ‘15–18 శాతం‘ పెరిగాయని తెలిపాయి.

ప్రాచుర్యం లేని ప్రాంతాలకూ...
అంతగా ప్రాచుర్యం లేని పర్వత ప్రాంతాలను సైతం పర్యాటకులు ఎక్కువగా అన్వేషిస్తున్నారని, తద్వారా  గమ్యస్థానాల ప్రాధాన్యతలలో మార్పు వచ్చిందని  నివేదిక వెల్లడించింది. సిమ్లా అత్యధిక ఆదరణ పొందిన గమ్యస్థానంగా కొనసాగుతోంది.  అయితే ఈ సీజన్ లో దోభి, రాజ్‌గుంధ  కరేరి వంటి ప్రదేశాలు అత్యధిక సందర్శకుల వృద్ధిని నమోదు చేశాయి. కొత్తగా ప్రాచుర్యం పొందుతున్న ఈ ప్రాంతాలతో పాటు, శ్రీనగర్, తీర్థన్‌ వ్యాలీ  గ్యాంగ్‌టాక్‌ వంటి ప్రదేశాలు కూడా  ప్రధాన నగరాల  పర్యాటకులను ఆకర్షించాయి.  బెంగళూరు, ముంబై, పుణె, ఢిల్లీ–ఎన్ సిఆర్, హైదరాబాద్‌లు అత్యధిక పర్యాటకులను అందిస్తున్నాయని, అలాగే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి కూడా  డిమాండ్‌ పెరుగుతోందని నివేదిక తేల్చింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)