Breaking News

వయ్యారాలు పోతున్న చెట్లు! మిస్టరీలా.. 'వంకర అడవి'..

Published on Thu, 07/20/2023 - 16:08

చెట్లు నిటారుగా ఉంటాయి. కొన్ని వంకరగా కూడా ఉంటాయి. మరికొన్ని ప్రకృతి వైపరిత్యాల వల్లో లేక మరేదైనా కారణం చేతనో వంకరగా ఉండటం సహజం. కానీ ఎవరో దగ్గరుండి పనిగట్టుకుని పెంచినట్లుగా అన్ని ఒకే వంకరల్లో చెట్లు ఉంటాయ?. విచిత్రం ఏమిటంటే అలా వంపు తిరిగి ఉన్నవన్నీ ఒకే జాతి మొక్కలు. ఎందకిలా జరిగింది? రీజన్‌ ఏంటో అని శాస్త్రవేత్తలు జుట్లు పీక్కుని మరీ పరిశోధనలు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. ఇంతకీ ఆ అడవి ఎక్కడుందంటే..

పోలాండ్‌లోని వెస్ట్‌ పోమెరేనియాలోని గ్రిఫినో అనే పట్టణానికి సమీపంలో ఈ విచిత్రమైన అడవి ఉంది. దీన్ని 'వంకర అడవి' లేదా క్రూక్‌ ఫారెస్ట్‌ అని పిలుస్తారు. ఇక్కడ ప్రతి చెట్టు బేస్‌ వద్ద వంపు తిరిగి ఉండి.. అసాధారణమైన అడవిలా ఉంటుంది. ఇక్కడ ఉన్నవన్నీ పైన్‌ చెట్లే. పైగా చెట్లన్ని కూడా సుమారు 90 డిగ్రీ బేస్‌ వంపు తిరిగి ఉన్నాయి. సుమారు రెండు హెక్టార్ల భూమిలో వందకు పైగా ఉన్నో ఈ పైన్‌ చెట్లన్ని ఇలానే వంకరగా ఉన్నాయి. చూడటానికి ఆంగ్ల అక్షరం 'J' ఆకారంలో ఉన్నాయి చెట్లు. ఆ చెట్లన్ని కూడా ఉత్తరం వైపే తిరిగి ఉంటాయి. ఇవి వంకరగా ఉన్నప్పటికీ వాటి వంపుతో సంబంధంల లేకుండా సుమారు 50 అడుగులు ఎత్తు వరకు ఎదగుతుండడం విశేషం.

వాటికి ఎలాంటి చీడపీడల లేవు. పైగా ఆరోగ్యంగా ఉన్నాయి. పైన్‌ చెట్లు ఎందుకిలా వంపు తిరిగి ఉన్నాయని పలువురు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అందులో భాగంగా ఆ చెట్ల వయసును లెక్కిస్తే.. దాదాపు 1930లలో నాటిన చెట్లుగా తేలింది. ఇక్కడ చెట్లు వంపు తిరిగి ఉండటానికి మంచు తుపానులు, లేక గురత్వాకర్షణ శక్తి లేదా జన్యు పరివర్తన అని పరివిధాలుగా పరిశోధనలు చేసినా.. ఓ పట్టాన శాస్త్రవేత్తలు అసలు కారణం ఏమిటో చెప్పలేకపోయారు. గ్రహాంతరవాసులు పని అని కొందరూ భావిస్తున్నారు.

ఈ ఫైన్‌ చెట్లు ఇలా అసాధారణ రీతిలో ఉండటానకి కారణం స్థానికి రైతులేనని అంటున్నారు పలువురు. ఫర్నీచర్‌ కోసం ఇలా వంగిన చెట్లను ఉద్దేశపూర్వకంగానే పెంచుతున్నారని చెబుతున్నారు. మరోవైపు ఈ అడివిలో దాదాపు 400 పైన్‌చెట్లు ఉన్నాయని అవే అలా వంకర ఉన్నాయని పలు వాదనలు వినిపిస్తున్నాయి. 1970లో రెండోవ ప్రపంచ యుద్ధంలో ఆ అడవిని అలా వదిలేయడంతో ఇలా చెట్లు వంపు తిరిగి ఉన్నాయని కొందరూ చెబుతున్నారు. యుద్ధానికి ముందు ఉ‍న్న స్థానికులకే ఈ అసాధారణ అడవికి సంబంధించిన రహస్యం తెలిసి ఉండచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏదీఏమైనా ఇప్పటి వరకు ఆ అడవి అంతుపట్టని మిస్టరీలా మిగిలిపోయింది.  

(చదవండి: ఓర్నీ!.. ఏం రికార్డ్‌రా! ఇది..వింటేనే కన్నీళ్లు వచ్చేస్తున్నాయ్‌!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)