Breaking News

విడాకుల కేసులో వెన్నెలకు ఎదురుదెబ్బ..!

Published on Wed, 03/04/2026 - 12:54

వెన్నెలకి తన 21వ ఏట పెళ్ళి చేశారు పెద్దలు. భర్తకి అప్పటికే 35 ఏళ్ళు. పెళ్లి అయిన వారం కూడా గడవకుండానే హింసించడం మొదలుపెట్టాడు. అలాగే భరిస్తూ ఉండగా ఒక పాప పుట్టింది. వెన్నెలకి 25 ఏళ్ళు వచ్చాయి. విపరీతంగా అనుమానించి కొట్టడంతో తృటిలో ప్రాణం పోయే ప్రమాదం తప్పి, బతికి బయటపడింది. విడాకులు, డీ.వీ.సీ కేసులతో పాటు కూతురికి, తనకు మెయింటెనెన్స్‌ కోరుతూ కేసు వేసింది. కేసులు నడుస్తూ ఉండగా వెన్నెలకు ఒక వ్యక్తి పరిచయం అయ్యారు. ఓదార్పుగా తన భుజం అందించారు. అప్పుడు వెన్నెలకి 28 సంవత్సరాలు. వెన్నెల తన సహచరుడితో దిగిన ఫోటోలు తీసుకుని వచ్చి కోర్టులో చూపించి వెన్నెల మరొకరితో సహజీవనం చేస్తోందని చెప్పడంతో కోర్టు వెన్నెలకి మెయింటెనెన్స్‌ తిరస్కరించింది. పాపకి మాత్రం నెలకి 7 వేలు ఇచ్చింది. భర్త దగ్గర ఉంటే ప్రాణాలకే ప్రమాదం. తనకు ఒక సహచరుడు దొరికితే చట్టం వెన్నెలనే దోషిగా చూస్తోంది. ఇప్పుడు తన దారెటు?

తమను తాను పోషించుకోలేని భార్య, మైనర్‌ పిల్లలు, తల్లిదండ్రులు (కొన్ని సందర్భాలలో మేజర్‌ అయిన పిల్లల సైతం) భర్త నుంచి, తండ్రి నుంచి లేదా కొడుకు నుంచి మెయింటెయినెన్స్‌ పోందవచ్చు అని సెక్షన్‌ 125 సి.ఆర్‌.పీ.సి చెప్తుంది. (కొత్త చట్టంలో సెక్షన్‌ 144). అయితే భార్యకి మెయింటెనెన్స్‌ ఇవ్వకుండా ఉండడానికి ఉన్న కారణాల్లో ఒక ప్రధానమైన కారణంగా మెయింటెనెన్స్‌ చట్టం లోని సీ.ఆర్‌.పీ.సీ. సెక్షన్‌ 125(4) – ప్రస్తుత బీ.ఎన్‌.ఎస్‌.ఎస్‌. లోని సెక్షన్‌ 144(4) ప్రకారం భర్త కాకుండా మరొక వ్యక్తితో సంబంధం కలిగి ఉంటే, భార్యకి మెయింటెనెన్స్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. 

అంతేకాదు, సరైన కారణం లేకుండా కాపురానికి వెళ్లకపోయినా కూడా మెయింటెనెన్స్‌ ఇవ్వవలసిన అవసరం లేదు అని చట్టం చెప్తుంది. అనేక జడ్జిమెంట్లలో ఒకటి రెండు సార్లు లైంగిక సంబంధం కలిగి ఉండటం వలన మెయింటెనెన్స్‌ ఇవ్వమంటే కుదరదు అంటూ మహిళలకు అనుకూలమైన తీర్పులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా మెయింటెనెన్స్‌ ఎగ్గొట్టాలి అని ప్రయత్నించే భర్తలకు కోర్టులో రుజువు చేయాలి అనుకునే విషయం – తన భార్య ఒక వ్యభిచారి అని! వేరే వాళ్లతో తనకు అక్రమ సంబంధాలు ఉన్నాయి అని!

స్త్రీని ఒక శరీరంగాను, మగవాడికి బానిసగాను, మగాడు పోషిస్తే తప్ప పోషించుకోలేని వ్యక్తిగాను, ‘పతి’ వ్రతగాను – చూడడం ఆపేసి ఒక మనిషిలా – ఒక మైండ్‌ లా చూడడం మొదలుపెట్టిన రోజున స్త్రీ తన సాధికారత తను సాధించుకోగలదు.

ఇదే చట్టంలో అనేకమంది మహిళలతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్న భర్తలకు డబుల్‌ మెయింటెనెన్స్‌ వెయ్యరు కదా?
వెన్నెల కేసులో ప్రస్తుత చట్టం ప్రకారం విడాకులు కాకుండా సహజీవనం సాగిస్తుంటే, లేదా వెన్నెల లైంగిక సంబంధం కారణంగా విడాకులు మంజూరు అయివుంటే తనకి మెయింటెనెన్స్‌ రాకపోవచ్చు. ఒకవేళ వెన్నెలది సహచర్యమే కానీ సహజీవనం కాదు అని నిరూపించగలితే మాత్రం తనకి కూడా మెయింటెనెన్స్‌ మంజూరు అవుతుంది. అంతే కాక, పాపకి 7 వేలు సరివవు అనుకున్నా, ఖర్చులు పెరిగాయి అనుకున్నా, కోర్టులో అప్పీల్‌ ద్వారా కానీ, మెయింటెనెన్స్‌ పెంపునకు కానీ దరఖాస్తు చేసుకోవచ్చు.

– శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది
మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comMýకు మెయిల్‌ చేయవచ్చు.  

#

Tags : 1

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)