Breaking News

7 ‘అడుగుల’తో దాంపత్య బలం

Published on Sun, 09/13/2026 - 11:40

విడివిడిగా వ్యాయామం చేసే యువ దంపతులతో పోలిస్తే కలిసి వ్యాయామం చేసే దంపతుల్లో దాంపత్య బంధం బలోపేతం అవుతోందని అమెరికాలో జరిగిన తాజా అధ్యయనంలో తేలిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దంపతులు మాట్లాడుకొనే తీరు, వారి మధ్య తలెత్తే గొడవలు, వాటిని పరిష్కరించుకునే విధానంపై చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైందన్నారు. 

పరిశోధకులు పరిశీలించిన దంపతుల్లో దాదాపు 60 శాతం మంది తాము క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నామని చెప్పగా... వారిలో మూడింట ఒక వంతు మంది మాత్రమే కలిసి వ్యాయామం చేస్తున్నారని తేలింది. కలిసి వ్యాయామం చేసే దంపతులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, సమస్యలను సులభంగా పరిష్కరించుకోవడంతో వారి మధ్య మనస్పర్థలు తక్కువగా ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయ­నంలో దంపతులు కలిసి చేసిన వ్యాయామాల్లో నడక అన్నింటికంటే ఎక్కువగా కనిపించింది. 

దంపతులు కలిసి చురుగ్గా ఉండేందుకు నడక వ్యాయామం చాలా సులువైన, ఉపయుక్తమైన ఎక్సర్‌సైజ్‌ అని... ఇలా కలసి నడవడం వారి బంధాన్ని మరింత బలోపేతం చేస్తోందని వెల్లడైంది. ఈ క్రమంలో దంపతులు తమ జీవిత భాగ­స్వామి తమ మాటలను ఎక్కువగా వింటున్నారని, తమకు అండగా నిలుస్తున్నారన్న భావ­న కలుగుతోందనీ పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధన వివరాలు ఫ్యామి­లీ రిలేషన్స్‌ అనే మెడికల్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 

స్ట్రెంత్‌ ట్రైనింగ్‌తో అతివల గుండె పదిలం
వారంలో కనీసం 2 గంటలపాటు బరువులు ఎత్తడం, తాళ్లను లాగడం వంటి స్ట్రెంత్‌ ట్రైనింగ్‌/రెసిస్టెన్స్‌ ట్రైనింగ్‌ ఎక్సర్‌సైజులతో మహిళల్లో గుండె, రక్తనాళాల వ్యాధుల ముప్పు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అమెరికాలో జరిగిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ఈ వ్యాయామా­లన్నీ గుండెపోటు వచ్చే ముప్పును గణనీయంగా తగ్గించగలవని ఈ పరిశోధనలో తేలింది. æఎలాంటి వ్యాయామాలు చేయని మహిళలతో పోలిస్తే వారానికి కనీసం రెండు గంటలపాటు స్ట్రెంతెనింగ్‌/రెసిస్టెన్స్‌ ట్రైనింగ్‌ వ్యాయామాలు చేసే మహిళల్లో గుండె, రక్తనాళాల వ్యాధుల ముప్పు 20 శాతం తక్కువగా, గుండెపోటు ముప్పు 44 శాతం తక్కువగా కనిపించిందని పరిశోధకులు గుర్తించారు. 

అలాగే రెండు గంటలకు మించి వ్యాయామాలు చేసే మహిళల్లో ప్రతి అదనపు గంట వ్యాయామం వల్ల గుండె, రక్తనాళాల వ్యాధుల ముప్పు మరో 5 శాతం, గుండెపోటు ముప్పు 14 శాతం మేర తగ్గుతోందని కనుగొన్నారు. అయితే రెసిస్టెన్స్‌ ట్రైనింగ్‌ వ్యాయామాలు మాత్రమే చేసే వారిలో పక్షవాతం వచ్చే ముప్పు తగ్గినట్లు కనిపించలేదు. రెసిస్టెన్స్‌ ఎక్సర్‌సైజులతోపాటు ఏరోబిక్‌ వ్యాయామాలు కూడా కలిపి చేస్తే మాత్రం మరింత ప్రయోజనం కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయన ఫలితాలను జర్నల్‌ ఆఫ్‌ ద అమెరిన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీ అనే జర్నల్‌ ప్రచురించింది.  

6 సూత్రాలతో మానసిక ఆరోగ్యం 
మనిషి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆరు అంశాలు ఎంతో కీలకమని ఓ అంతర్జాతీయ అధ్యయనం పేర్కొంది. వాస్తవానికి మానసిక ఆరోగ్యానికి 19 ప్రధాన అంశాలను పరిశో­ధణనాలు గుర్తించగా వాటిలో ఆరు అంశాలకు 90 శాతానికిపైగా నిపుణుల నుంచి ఏకాభిప్రా­యం వ్యక్తమైంది. నేచర్‌ మెంటల్‌ హెల్త్‌ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం కోసం 26 దేశాలకు చెందిన 11 విభాగాల్లోని 122 మంది ప్రముఖ నిపు­ణులతో సర్వేలు నిర్వహించారు. అయితే ఆదా­యం, శారీరక ఆరోగ్యం వంటి అంశాలు కూడా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపొచ్చని అధ్యయనంలో వెల్లడైంది.  

1    జీవితానికి అర్థం–పరమార్థం, లక్ష్యం ఉండటం: మన జీవితం విలువైనది. దానికో అర్థం, పరమా­ర్థం ఉన్నాయి. మనం ఏదో ఒక లక్ష్యం వైపు ముందుకు వెళ్తున్నామనే భావన ఉండటం అవసరం. 
2    జీవితంపై సంతృప్తి: జీవితాన్ని మొత్తంగా చూసుకున్నప్పుడు ఒక రకమైన సంతప్త భావన కలిగి ఉండటం ముఖ్యం. 
3    స్వీయ అంగీకారం: తనలోని మంచిని, లోపాలను అర్థం చేసుకొని, తనను తాను తప్పుబట్టుకోకుండా సానుకూలంగా చూసుకోవడం.  
4    ఇతరులతో సత్సంబంధాలు: మనకు బాగా దగ్గరి వారితో శ్రద్ధ, ప్రేమ, సహకారం, పరస్పర అవగాహనతో కూడిన అర్థవంతమైన సానుకూల సంబంధాలను కొనసాగించడం.
5    స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం: జీవితానికి సంబంధించిన నిర్ణయాలను స్వయంగా తీసుకొనే స్వేచ్ఛ ఉండటం, తన భావాలను నిజాయితీగా వ్యక్తపరచగలగడం.
6    ఆనందం: రోజువారీ జీవితంలో సానుకూల భావోద్వేగాలను సంతోషంగా, ఆనందంగా, హాయిగా అనుభవించడం. 

#

Tags : 1

Videos

10 వేలతో 9 లక్షల లాభం.. HDFC Flexi Cap Fund రికార్డ్ రిటర్న్స్

జగన్ లేకపోతే నేను లేను.. అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్న బద్దుకొండ అప్పలనాయుడు

2లక్షలు వసూలు చేసిన హిజ్రాలపై కేసు

చేసిందంతా ఆ ఇద్దరే! జూడో అసోసియేషన్ లీలలు

ముంచుకొస్తున్న 76 కిలోమీటర్ల ఉపద్రవం.. నాసా కెమెరాకు చిక్కిన సాక్ష్యం

పుష్ప రేంజ్ లో ఛేజింగ్.. పరారైన స్మగ్లర్లు

స్పిరిట్ ని తొక్కండి చూద్దాం... క్రిటిక్స్ కు వంగా తమ్ముడు సవాల్

భక్తుల దర్శనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణేషుడు

వాళ్ళు నా దగ్గర డబ్బు తీసుకుని ఒక్కటే హామీ ఇచ్చారు.. బాధితుడు షాకింగ్ నిజాలు

కార్యకర్తల కోసం కదిలిన జగనన్న.. గోల్డ్, సిల్వర్ కార్డ్స్

Photos

+5

'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)

+5

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)

+5

వినాయక చవితి రోజు తప్పక సమర్పించాల్సిన 21 పత్రాలు.. (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. ఈ ఫోటోలు చూశారా?

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (సెప్టెంబర్ 13 -సెప్టెంబర్ 19)

+5

'ఎపిక్' షూటింగ్‌లో ఆనంద్-వైష్ణవి గ్యాంగ్ ఇలా (ఫొటోలు)

+5

వినాయకుడికి ఇష్టమైన 10 ప్రసాదాలు... మీరు ఓ లుక్ వేయండి (ఫొటోలు)

+5

సమంత స్టన్నింగ్‌ లుక్స్‌ అదుర్స్‌ (ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహాగణపతి ఆగమన కార్యక్రమం (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)