Breaking News

ఇక్కడి బీచ్‌ల్లో రంగురాళ్లు ఏరితే, భారీ జరిమానా!

Published on Fri, 03/22/2024 - 18:04

వేసవి సీజన్‌ వచ్చిందంటే చాలు సముద్ర తీరానికి, బీచ్‌లకు,అందమైన ద్వీపాలకు వెళతాం. బీచ్‌లకు వెళ్లామంటే గవ్వలు, రంగు  రంగుల గులకరాళ్లు ఏరుకోవడం ఒక సరాదా. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల  దాకా ఇదొక అలవాటు మారిపోయింది.  కానీ  ఈ అలవాటు ప్రకృతిని, పర్యావరణా సమతుల్యతను దెబ్బతీస్తుందని మీకు తెలుసా?  ఈ  నేపథ్యంలోనే కెనరీ ఐలాండ్స్‌ కఠిన  చర్యలకు దిగింది. 

పర్యావరణ పరిరక్షణకోసం  స్పెయిన్‌కు చెందిన ద్వీప సముదాయం కెనరీ ఐల్యాండ్స్  సంచలన నిర్ణయం తీసుకుంది. లాంజరోటే, ఫుయెర్తెవెంట్యురా ద్వీపాల్లోని సముద్ర తీరం నుంచి గులకరాళ్లు ఏరడాన్ని నిషేధించింది.  రాళ్లను సేకరించే  టూరిస్టులకు రూ.2 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. బీచ్‌లు క్షీణించకుండా పర్యాటకులకు అధికారులు ఈ హెచ్చరికలు జారీ చేశారు.

మాస్ టూరిజం కారణంగా కానరీ ద్వీపాలు దెబ్బతింటున్నాయంటున్నారు అధికారులు. కానరీ దీవుల్లోని దీవులకు వచ్చే పర్యాటకులు తమతో పాటు రంగురాళ్లు, ఇసుకను తీసుకువెళతారట. పర్యాటకుల రాళ్లను తీసుకెళ్లే అలవాటుతో అక్కడి సహజ సమతుల్యత దెబ్బతింటోందని ఆ దేశం భావిస్తోంది. పర్యావరణ పరిరక్షణలో ఈ రాళ్లు,మట్టి కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు ఈ సందర్భంగా అక్కడి అధికారులు చెప్పారు. ఇప్పటికే ఈ రెండు ప్రాంతాలు ఏటా తీరంవెంబడి భారీ స్థాయిలో ఇసుక, మట్టి కోల్పోతోందని  వెల్లడించారు. 

కానరీ దీవులు ఏడు ప్రధాన ద్వీపాల సమూహం. ఇందులో  టెనెరిఫే, గ్రాన్ కానరియా, లాంజరోట్, ఫ్యూర్టెవెంచురా, లా పాల్మా, లా గోమెరా , ఎల్ హిరో. ఈ ద్వీపాలలో టెనెరిప్‌ ద్వీపం కానరీ దీవులలో అతిపెద్ద ద్వీపం. స్పెయిన్‌లోని అతిపెద్ద పర్వతం మౌంట్ టీడే ఇక్కడే ఉంది. 

Videos

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)