Breaking News

ఈ మోతాదులో ఉప్పు తీసుకుంటే గుండె, కిడ్నీ వ్యాధులను నివారించొచ్చు..!

Published on Sun, 11/03/2024 - 13:33

వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ సిఫార్సు చేసిన మోతాదులో ఉప్పు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చని మోడలింగ్‌ అధ్యయనం పేర్కొంది. ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన మోతాదులో ఉప్పు తీసుకోవడం వల్ల పదేళ్లలో గుండె, మూత్రపిండాలకు సంబంధించిన దీర్ఘకాలికి వ్యాధుల కారణంగా సంభవించే..దాదాపు మూడు లక్షల మరణాలను నివారించొచ్చని పేర్కొంది. 

అధిక స్థాయి సోడియం అనేది ప్రధాన ఆహార ప్రమాదాల్లో ఒకటి. అధిక ఆదాయ దేశాల్లో సోడియంకి సంబంధించిన ప్యాక్‌ చేసిన ఆహారాలు ప్రధాన వనరు. ఇక తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో వీటి వినియోగం మరింత ఎక్కువగా ఉండటం బాధకరం. ముఖ్యంగా భారతదేశంలో ఉప్పు తగ్గించి తీసుకునేలా సరైన జాతీయ వ్యూహం లేదని హైదరాబాద్‌లోని ది జార్జ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్‌ పరిశోధకులు చెబుతున్నారు.  

ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన ఉప్పు ఒక టీ స్పూన్‌ లేదా ఐదు గ్రాముల కంటే తక్కువగా ఉంటుందని మోడలింగ్‌ అధ్యయనం పేర్కొంది. ఈ మోతాదులోనే ప్రతి రోజూ వినియోగించినట్లయైతే దాదాపు 17 లక్షల కార్డియోవాస్కులర్ సంఘటనలు, గుండెపోటులు, స్ట్రోక్‌లతో సహా క్రానిక్‌ కిడ్న వ్యాధులను నివారించడమే గాక గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందగలమని పరిశోధన వెల్లడించింది. ముఖ్యంగా భారతదేశంలో పూర్తిస్థాయిలో ఇది అమలవ్వాలని పేర్కొంది. 

ఇక్కడి ప్రజలు ఎక్కువగా ప్యాక్‌ చేసిన ఆహారాలను ఉపయోగిస్తున్నట్లు పరిశోధన వెల్లడించింది. ఈవిషయమై ఆహార తయారీదారులకు అవగాహన కల్పించడం, పాటించేలా చేయడం అత్యంత ముఖ్యమని తెలిపింది. 

కాగా, అధిక స్థాయిలో సోడియం తీసుకోవడం తగ్గించేలా ఆరోగ్య  కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా 2018 నుంచి అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది. అయితే ప్రస్తుతం మాత్రం ఈట్‌ రైట్‌ ఇండియా అనే జాతీయ కార్యక్రమం ద్వారా సోడియంను తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందని పరిశోధకులు తెలిపారు.

(చదవండి: వాట్‌ ఏ రికార్డ్‌!..గుమ్మడికాయ పడవతో 26 గంటలు..)

 

#

Tags : 1

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు