‘మధ్యలో ఏంటి బాసూ’ గజరాజుకు కోపం వచ్చింది
ఎందుకొచ్చిన తలనొప్పి ఇది?
Published on Sat, 12/13/2025 - 08:43
ఒక విచిత్రమైన విషయం తెలుసా? మన ఎమోషన్స్‌కూ, ఆలోచనలకూ, ఉపాయాలకూ, బాధలకూ, సంతోషాలకూ కారణమైన మెదడులో ఉండేదంతా కేవలం కొవ్వుల కణజాలం మాత్రమే. అయినా ఒంట్లో ఎక్కడెక్కడి నొప్పులనూ తాను ఇట్టే తెలిసేలా చేస్తుంది కదా... కానీ ఇంతా చేసి ఇలా అన్ని నొప్పుల్నీ తెలియజేసే ఈ మెదడుకు మాత్రం నొప్పి తెలియదు. తనను కోస్తున్నా తనకు నొప్పే తెలియని ఇదే మెదడు... మిగతా ‘తల’నొప్పులను మాత్రం ఎందుకు తెలియజేస్తుంది? అసలు తలనొప్పి అంటే ఏమిటి? అది ఎందుకు వస్తుంది?... ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు.
మామూలుగా తలనొప్పి అనగానే తేలిగ్గా తీసుకున్నా... ‘అబ్బ... అదో తలనొప్పి రా’ అనే వాడుక మాట వల్ల అదెంత దుర్భరంగా ఉంటుందో, ఎలా మన రోజునూ, సంతోషాలనూ పాడుచేస్తుందో చెప్పకనే చెప్పినట్లవుతుంది.
అన్నట్టు తలనొప్పి వచ్చినప్పుడు ఓ ఆసక్తికరమైన ప్రశ్న కూడా ఉద్భవిస్తుంది. అదేమిటంటే... మెదడుకు నొప్పి అనే అనుభూతే కలగక΄ోతే... తలనొప్పి సమయంలో ఇంత బాధ ఎందుకు కలుగుతుంది? అప్పుడు తలలో ఏం జరుగుతుందంటే...
ఎప్పుడెప్పుడు...?
నాడీ వ్యవస్థలో ఏమైనా సమస్యలున్నా, మైగ్రేన్ వంటి సమస్య లేదా ఏదైనా తీవ్రమైన మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఉన్నప్పుడు చాలామందిలో తలనొప్పి వస్తుంటుంది. అంతేకాదు... ఈ తలనొప్పుల రహస్యాలను ఇంకా ఎందరో పరిశోధకులూ, వైద్యశాస్త్రవేత్తలూ శోధిస్తూ తలనొప్పుల కారణాలను అన్వేషిస్తూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు.
తోడు తెచ్చుకునే ఇతర నొప్పులెన్నో!
సాధారణంగా తలనొప్పి ఒంటరిగా రాకుండా... మరికొన్ని నొప్పులతో పాటు వస్తుంటుంది. ఉదాహరణకు... ∙వికారం ∙ముక్కు కారుతుండటం
కళ్ల నుంచి నీళ్లు కారుతుండటం ∙దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేని సమయాల్లో... ఇలా పైన పేర్కొన్న లక్షణాలతోపాటు తలనొప్పి ఎందుకు వస్తుంటుందన్నది స్పష్టంగా తెలియదు. కానీ ఇప్పటికి తెలిసిందల్లా... దేహాన్ని రక్షించే ప్రక్రియలో భాగంగానే ఇలా జరుగుతోందన్న విషయం మాత్రం స్పష్టం.
ఎందుకు వస్తాయి?
సాధారణంగా శరీరం ఏదో రకమైన ఒత్తిడి.. శారీరకమైన ఒత్తిడి లేదా భావోద్వేగాల వల్ల లేదా పర్యావరణపరమైన ఒత్తిడుల వల్ల కావచ్చు. మెదడు, మెడ చుట్టూ ఉండే నరాలు, రక్తనాళాలు చాలా సున్నితమైన మార్పులకూ తేలిగ్గా ప్రతిస్పందించేలా ఉంటాయి. దాంతో పైన పేర్కొన్న ఏ మార్పులు కలిగినా వెంటనే ఇరిటేట్ అయి నొప్పిని కలిగించేలా చేస్తాయి. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, కౌమారసమయంలో హార్మోన్లలో వచ్చే మార్పులు, నిద్రలేమి, ఒంట్లో నీరు తగ్గడం (డీహైడ్రేషన్), ఆహారం తీసుకోక΄ోవడం, మోతాదుకు మించి కెఫిన్ తీసుకోవడం వంటి వాటితో తలనొప్పులు రావచ్చు.
అలాగే తీవ్రమైన భావోద్వేగాలకు లోనుకావడం వల్ల కూడా తలనొప్పిని ప్రేరేపిస్తుంది. ఉదాహరణకు బాగా ఉద్విగ్నతకు లోనుకావడం, తీవ్రంగా ఎక్సైట్ కావడం, తీవ్రమైన విచారంలో మునిగి΄ోవడం వంటి చర్యలు మెదడులోని కొన్ని రసాయనాల సమతుల్యతను భగ్నం చేస్తాయి. కండరాల్లో ఒత్తిడిని కలిగిస్తాయి. ఇవన్నీ కలిసి తలనొప్పులను ప్రేరేపిస్తాయి. ఒక్కోసారి వాతావరణంలో తీవ్ర మార్పు... ఉదాహరణకు ఒక ప్రదేశంలో ఎక్కువగా ఉన్న వాతావరణ ఒత్తిడి కారణంగా సైనస్‌లలో ఒత్తిడి పెరిగి అది ముఖం కండరాల్లో ముఖ్యంగా నుదురు వెనకనుండే ప్రదేశం, చెంపలు, కళ్ల దగ్గర ఉండే కండరాల్లో టెన్షన్ వృద్ధి చేయడం వల్ల కూడా తలనొప్పి రావచ్చు.
నివారణ / చికిత్స
తలనొప్పులకు చికిత్స అందించాలంటే ముందుగా దానికి నిర్దిష్టమైన కారణం ఏదో తెలుసుకోవాలి. మైగ్రేన్ లాంటి తీవ్రమైన, డాక్టర్ దగ్గర చికిత్స అందించాల్సిన తలనొప్పి మినహా చాలా రకాల తలనొప్పులు సింపుల్‌గా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్లనే తగ్గి΄ోతాయి. ఉదాహరణకు నీళ్లు ఎక్కువగా తాగుతూ దేహాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం లాంటి సాధారణ సూచనలతోనూ తగ్గుతాయి. ఇక వేళకు తినడం, వేళకు నిద్ర΄ోవడం వల్ల నాడీవ్యవస్థలో సమతౌల్యత, క్రమం తప్పని వ్యాయామం వల్ల ఒత్తిడి తగ్గడం వంటి చర్యలతో చాలావరకు నివారితమవుతాయి లేదా అవి వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి. దీనికి తోడుగా యోగా, రిలాక్సేషన్ టెక్నిక్స్, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లతో ఒత్తిడి తగ్గించుకోవడం ద్వారానూ నివారించుకోవచ్చు.
చికిత్స విషయానికి వస్తే... ఒకటి రెండుసార్లు పెయిన్ కిల్లర్స్ వాడాక అప్పటికీ తలనొప్పలు వస్తూనే ఉంటే.... దానికి ఇంకేదో కారణం (అండర్ లైయింగ్ కాజ్) ఉంటుందని గ్రహించి, దానికి చికిత్స తీసుకోవాలి. ఇక మైగ్రేన్‌కు డాక్టర్లు అప్పటికప్పుడు నొప్పిని తగ్గించేందుకు ఒక రకం, మళ్లీ మళ్లీ రాకుండా ఉండేందుకు మరో రకం... ఇలా రెండు రకాల మందులు వాడతారు. ఇలా తలనొప్పులకు కారణాలు తెలుసుకునే దానికి తగ్గ చికిత్స తీసుకోవడం ద్వారా తలనొప్పులు తగ్గుతాయి.
– యాసీన్
తలనొప్పి అంటే ఏమిటి?
తలనొప్పిని అర్థం చేసుకోవాలంటే మొదట మెదడు నొప్పిని అనుభవించదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే మెదడులో నొప్పిని తెలుసుకునే పెయిన్ రిసె΄్టార్స్ ఉండవు. దాంతో మెదడుకు గాయమైనా లేదా మెదడును కోస్తున్నా అది నొప్పిని అనుభవించదు. ఇటీవల కొన్ని సందర్భాల్లో మెదడుకు సర్జరీ చేస్తుంటే బాధితుడికి సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స నిర్వహించామంటూ న్యూస్‌పేపర్లలో, టీవీల్లో చూసిన సంఘటనలు చాలామందికి గుర్తుండే ఉంటాయి. అయితే మెదడు చుట్టూ ఉండే అనేక పొరలు, రక్తనాళాలు, వాటిని రక్షించే కణజాలం, నాడీతంత్రులు, నరాల్లో నొప్పిని గ్రహించే పెయిన్ రిసె΄్టార్స్ వల్లనే తలనొప్పి అనుభవంలోకి వస్తుంది.
మైగ్రేన్ అంటే ఏమిటి?
మైగ్రేన్ అనేది తలనొప్పుల్లో చాలా తీవ్రంగా నొప్పిని కలగజేస్తుంటుంది. తలబద్దలవుతున్నట్లుగా వచ్చే ఈ తలనొప్పితో పాటు వికారం, వాంతులు, వెలుతురు చూడలేక΄ోవడం/ శబ్దాలు వింటుంటే చికాకు, కళ్ల ముందు మిరిమిట్లు గొలుపుతున్నట్లుగా వింతకాంతులు ఇలాంటి లక్షణాలూ కలగలసి బాధను మరింత తీవ్రతరం చేస్తాయి. ప్రతి పదకొండు మంది పిల్లల్లో ఒకరిని బాధించే ఈ మైగ్రేన్ వల్ల చాలామంది పిల్లలు చదువులో వెనకబడతారు. ఆ
డుకోలేరు, గదిలోంచి కదల్లేనంతగా బాధపడుతుంటారు. తమకు సరిపడని ఏదో అంశం పిల్లలను ట్రిగర్ చేయడం వల్ల వచ్చే ఈ తలనొప్పిలో మెదడులోని నొప్పిని తెలిపే పాత్‌వేస్ అవసరానికంటే ఎక్కువగా... అంటే మరింతగా ప్రతిస్పందించడం వల్ల నొప్పి కలుగుతుంది. తల్లిదండ్రుల్లో ఈ వ్యాధి ఉన్నవారి పిల్లల్లో ఇది అనువంశీకంగా కూడా రావచ్చు. తీవ్రమైన ఎండ, గాఢమైన వాసనలు, చెవులు బద్దలయ్యే శబ్దాలు, వేళకు తినక΄ోవడం / వేళకు నిద్ర΄ోక΄ోవడం వంటి అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపించవచ్చు.
Tags : 1