Breaking News

కెఫిన్‌ లేని కాఫీ గింజలు..హాయిగా సిప్‌ చేయొచ్చు

Published on Sun, 06/18/2023 - 13:36

కాఫీ అంటే ఇష్టపడనివారు ఉండరు. ఐతే ఈ కాఫీలో ఉండే కెఫిన్‌ మన శరీరంలో అత్యంత దుష్పరిణామాలకు దారితీస్తోంది. అందుకనే రోజుకు రెండు నుంచి మూడు కప్పులకు మించి కాఫీ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. దీంతో పలు కంపెనీలు కెఫిన్‌ లేని కాఫీ పొడిని తయారు చేస్తున్నాయి. కానీ వాటి ఖరీదు ఎక్కువ. అందరూ కొనుగోలు చేయలేరు. ఆ సమస్యకు చెక్‌పెట్టి ఆరోగ్యకరమైన కాఫీని ఆస్వాదించేలా కెఫిన్‌ లేని కాఫీ గింజలను ఉత్పత్తి చేసేందుకు నాంది పలికారు బ్రెజిల్‌ శాస్త్రవేత్తలు.

ఈ మేరకు బ్రెజిలియన్‌ కాఫీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన శాస్త్రవేత్తలు చేపట్టిన రెండు దశాబ్దాల ప్రాజెక్టులో చాలా వరకు పురోగతి సాధించారు. ఈ పరిశోధనలు ప్రముఖ కాఫీ పరిశోధనా కేంద్రం ఇన్‌స్టిట్యూటో అగ్రోనోమికో డీ కాంపినాస(ఐఏఎస్‌)​ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ పరిశోధన ఫలితంగా అధిక దిగుబడినిచ్చే కాఫీ మొక్కలను అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. దీంతో బ్రెజిల్‌ వాణిజ్య పరంగా కాఫీ ప్రపంచ మార్కెట్‌లో పవర్‌హౌస్‌గా మారుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అనేక ఏళ్లుగా కెఫిన్‌ కంటెంట్‌ తక్కువుగా ఉన్న వివిధ కాఫీ మొక్కలను అభివృద్ధి చేయడమే గాక క్షేత్ర స్థాయిలో ట్రయల్స్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది గనుక విజయవంతమైతే అతి పెద్ద వినియోగదారులైన యూరప్‌, యునైటెడ్‌ స్టేట్స్‌ వంటి వాటితో బ్రెజిల్‌కి సముచిత వాణజ్య మార్కెట్‌ ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పారు. అంతేగాక డీకాఫీన్‌(కెఫిన్‌ శాతం తగ్గించడం) తయారు చేస్తున్న కంపెనీలు తమ ఖర్చులను తగ్గించేందుకు మొగ్గు చూపతాయని అంటున్నారు. ప్రస్తుతం తాము బ్రెజిల్‌లో వివిధ ప్రాంతాల్లో ఈ డీకాఫిన్‌ మొక్కలను పెంచుతున్నామని, అవి గింజలను ఉత్పత్తి చేయడానికి సాధారణంగా రెండు నుంచి మూడేళ్ల పడుతుందని చెబుతున్నారు. అందువల్ల తమ పరిశోధన మరింత విజయవంతం కావడానికి తాము ఇంకాస్త సమయం నిరీక్షించాల్సి ఉందని చెబుతున్నారు.

వాస్తవానికి సాధారణ కాఫీలో ఉండే కాఫీ మనల్ని ఉత్సాహంగా ఉంచేలా చేయడమే గాక రోజంతా మేల్కోని ఉండేలా శక్తినిస్తుంది. కానీ ఈ కెఫిన్‌ కడుపులో యాసిడ్‌లను పెంచి మంట లేదా గుండెల్లో నొప్పికి దారితీసే ప్రమాదం పొంచి ఉంది. దాన్ని నివారించేందుకే కెఫిన్‌ తక్కువగా ఉండే కాఫీ మొక్కలను అభివృద్ధి చేసే ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఇప్పటికే యూఎస్‌ వంటి దేశాల్లో 10 శాతం కెఫిన్‌ ఉన్న కాఫీని తయారు చేస్తున్నాయి కొన్ని కార్పొరేట్‌ సంస్థలు. ఇది కాస్త ఖర్చుతో కూడుకున్నది. దీన్ని అధిగమించేందుకే శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేస్తున్నారు. కాగా, శాస్త్రవేత్తల బృందం మాత్రం తమ పరిశోధనలు విజయవంతమవుతాయని ధీమగా చెబుతున్నారు. 

(చదవండి: 127 గంటలు.. డ్యాన్స్‌!)

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)