Breaking News

కొబ్బరి నూనెలో ఇవి కలిపి ముఖానికి రాసుకుంటే.. ముఖం వెలిగిపోతుంది

Published on Sat, 12/02/2023 - 10:58

సహజ సిద్ధమైన  మాయిశ్చరైజర్‌

►కొబ్బరినూనె మంచి సౌందర్య సాధనంగా పనిచేస్తుంది. సెలబ్రెటీలు చాలామంది తమ చర్మాన్ని అందంగా... ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కొబ్బరినూనెను విరివిగా వాడుతుంటారు. కొబ్బరినూనెలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్‌ గుణాలు పొడి చర్మానికి ఔషధంలా పనిచేస్తాయి. కొబ్బరినూనె చర్మానికి సహజసిద్ధమెన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.

► టీ స్పూను కొబ్బరినూనెలో అర టీస్పూను పెరుగు, టీస్పూను ఓట్స్‌ పొడి వేసి మెత్తని పేస్టులా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషాలపాటు ఆరనివ్వాలి. పూర్తిగా ఆరాక గుండ్రంగా మర్దన చేస్తూ గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్‌ వేసుకోవడం వల్ల ముఖచర్మానికి తేమ అంది ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

► రెండు టీస్పూన్ల కొబ్బరినూనెలో  కొద్దిగా నిమ్మరసం, టీ స్పూను వంటసోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముక్కు, గడ్డం, నుదురు వంటి బ్లాక్‌హెడ్స్‌ ఎక్కువగా ఉండే ప్రాంతంలో పట్టించి పది నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ బ్లాక్‌హెడ్స్‌ను తొలగించడమేగాక, చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది. ఫలితంగా చర్మరంధ్రాల్లో పేరుకున్న అధిక జిడ్డు, దుమ్మూ ధూళీ పోయి చర్మం చక్కని నిగారింపుని సంతరించుకుంటుంది.

►  ముఖం మీద నల్లమచ్చలు, కంటిచుట్టూ ఏర్పడిన నల్లని వలయాలపై కొబ్బరినూనెతో క్రమం తప్పకుండా మర్దన చేస్తుంటే .. మచ్చలు తగ్గుముఖం పడతాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)