Breaking News

Clinical Vampirism: ఈ జబ్బు గురించి తెలుసా?

Published on Tue, 10/29/2024 - 14:38

ఇంగ్లిష్‌ సినిమాల్లో, కథల్లో డ్రాక్యులాలు రక్తం తాగుతాయి. ఇలా రక్తాన్ని రుచి చూసే ఆ పిశాచాల్లాంటి క్యారెక్టర్స్‌ను ఇంగ్లిష్‌లో ‘వాంపైర్స్‌’ అని పిలుస్తారు. కానీ అలా రక్తం తాగే కోరికతో ఉండే ఒక జబ్బు ఉంటుందనీ, ఆ మెడికల్‌ కండిషన్‌ పేరే ‘వాంపైరిజమ్‌’ అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆ వాంపైరిజమ్‌ గురించిన కథనమే కాస్త సంక్షిప్తంగా...  


ప్రతి మనిషీ తనకు తెలియకుండానే ఒక్కోసారి రక్తాన్ని ఎంతో కొంత రుచి చూస్తుంటాడు. దీనికి ఉదాహరణే... వేలు తెగినప్పుడు గబుక్కున అకస్మాత్తుగా చాలామంది ఆ వేలిని నోట్లో పెట్టుకుంటారు. ఇందులో రక్తాన్ని రుచిచూడడానికంటే... అలా కంటిన్యువస్‌గా రక్తస్రావం జరగకుండా నివారించేందుకే ఇలా తెగిన వేలిని నోట్లో పెట్టుకుంటారు. ఎవరికి వారు తమ సొంత రక్తాన్ని రుచి చూసే ఆ ప్రక్రియకు ‘ఆటో వాంపైరిజమ్‌’ అంటారు. వేలు తెగి రక్తస్రావం అవుతున్నప్పుడు చాలామందిలో కనిపించే ఈ ప్రక్రియ చాలా సాధారణమైన ప్రతిక్రియగా భావించవచ్చు. 

అయితే కొంతమంది మానసిక రోగుల్లో ఓ అసాధారణమైన కండిషన్‌ ఉంటుంది. చాలా చాలా అరుదైన ఈ కండిషన్‌ ఉన్నవారిలో రక్తం తాగాలనే కోరిక కలుగుతుంది. ఈ కోరిక పుట్టడాన్ని ‘క్లినికల్‌ వాంపైరిజమ్‌’ అంటారు. మరికొందరిలోనైతే ఇది కాస్త రుగ్మత స్థాయికి చేరుకుంటుంది. అలాంటి ఓ అత్యంత అరుదైన జబ్బే ‘రెన్‌ఫీల్డ్స్‌ సిండ్రోమ్‌’. ఈ జబ్బు ఉన్నవారికి రక్తం తాగాలనే కోరిక కలుగుతుంది. 

ఇది చాలా చాలా అరుదు కావడంతో దీనికి నిర్దిష్టమైన చికిత్స అంటూ లేకపోయినా... ప్రవర్తనకు సంబంధించిన రుగ్మతలకు చికిత్స అందించినట్లే న్యూరోసైకియాట్రిస్టులు దీనికీ ‘బిహేవియరల్‌ థెరపీ’ అనే చికిత్స చేస్తారు.  అన్నట్టు... ఈ జబ్బు ‘రెన్‌ఫీల్డ్స్‌’ పేరిట 2023లో ఓ అమెరికన్‌ మూవీ  కూడా విడుదలైంది. పేరుకు తగ్గట్టుగానే ఇది ఓ ‘అమెరికన్‌ యాక్షన్‌ కామెడీ హారర్‌’ థీమ్‌తో తయారైన సినిమా.

 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)