Breaking News

Paragliding: పారా హుషార్‌..

Published on Sat, 11/09/2024 - 07:45

సాధారణంగా పారాగ్లైడింగ్‌ అనేది పర్యాటకప్రాంతాల్లో మాత్రమే ఉంటుందనే అపోహ చాలా మందిలో ఉంది. పైగా అది నేర్చుకుంటే ఏం వస్తుందిలే అన్న భావన కూడా ఉంది. అయితే మనకు పారాగ్లైడింగ్‌ గురించి కనీసం అవగాహన లేని సమయం నుంచే ఇందులో మెళకువలు నేర్చుకుని నగర యువతకు చుక్కానిగా నిలుస్తున్నారు హైదరాబాదీ ప్రభు సుకుమార్‌ దాస్‌. చిన్నతనం నుంచే గ్లాలో ఎగరాలనే తన కోరికను పారాగ్లైడింగ్‌తో సాకారం చేసుకున్నాడు.

రెక్కలు తొడిగి... 
ప్రయాణాలు అంటే ఇష్టంతో ముందుగా బుల్లెట్‌ బైక్‌పై ఐదు దేశాలు తిరిగాడు. అదే సమయంలో పారాగ్లైడింగ్‌ గురించి తెలుసుకుని, నేర్చుకున్నాడు. అప్పటి నుంచి దేశ విదేశాల్లో  పారాగ్లైడింగ్‌లో అద్భుతాలు సృష్టించాడు. పారాగ్లైడింగ్‌ చేస్తూ ఈజిప్టులోని గ్రేట్‌ పిరమిడ్స్, బ్రెజిల్‌లోని రియో క్రీస్ట్‌ విగ్రహం, అట్లాంటిక్‌ సముద్రంతో పాటు అమెజాన్‌ నది, నైలు నది, ఎర్ర సముద్రంపై ఎగిరిన తొలి భారతీయుడిగా  రికార్డులకెక్కారు. రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర సందర్భంగా కర్ణాటక నుంచి రాజస్థాన్‌ వరకూ పాదయాత్రను ఎగురుకుంటూ ఫాలో అయ్యారు. దీంతో రాహుల్‌ గాంధీ తనను ప్రత్యేకంగా అభినందించారని సుకుమార్‌ సంతోషం వ్యక్తం చేశారు.

ఎంతో మందికి శిక్షణ..
పారాగ్లైడింగ్‌ చేస్తే వచ్చే అనుభూతి వేరని చెబుతున్న సుకుమార్‌.. వందలాది మందికి ఇందులో శిక్షణ ఇచ్చాడు. పారాగ్లైడింగ్‌లో కూడా మంచి భవిష్యత్తు ఉందని, ఎంతోమంది పారాగ్లైడింగ్‌లో శిక్షణ తీసుకుని విదేశాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నాడు. అందుకే ఇప్పుడు చాలామంది పారాగ్లైడింగ్‌ నేర్చుకునేందుకు ముందుకు వస్తున్నారని చెబుతున్నాడు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన కొందరు ఆదివాసీ పిల్లలకు పారాగ్లైడింగ్‌లో ఉచితంగా తర్ఫీదునిచ్చాడు. వారంతా నేషనల్‌ పారామోటార్‌ చాంపియన్‌íÙప్‌లో పాల్గొన్నారని, అప్పుడు వారి కళ్లల్లో చూసిన ఆనందం తనకు ఎంతో సంతృప్తినిచి్చందని సుకుమార్‌ చెబుతున్నాడు. ఎంతోమంది కలలను నిజం చేయడంలో ఉన్న ఆనందం మరెక్కడా దొరకదని పేర్కొంటున్నాడు.  

భవిష్యత్తులో ఎగిరే పోలీసులు..
విపత్తుల వేళ పారాగ్లైడింగ్‌ చేసే వారికి ఎంతో డిమాండ్‌ ఉంటుందని సుకుమార్‌ చెబుతున్నాడు. భవిష్యత్తులో ఎగిరే పోలీసులు కూడా వస్తారని అంటున్నాడు. ఇప్పటికే తాము నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ బలగాలకు శిక్షణ ఇచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూడా పలువురు పోలీసులకు శిక్షణ ఇచ్చానని వివరించాడు. ఇక, తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక తదితర రాష్ట్రాలో ప్రత్యేక పండుగల సందర్భంగా పారాగ్లైడింగ్‌ చేస్తూ వాటి ప్రత్యేకతను ప్రజలకు తెలియజేసేలా సుకుమార్‌ ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ముఖ్యంగా తెలంగాణ అవతరణ దినోత్సవం, బతుకమ్మ, సంక్రాంతి పండుగల వేళ పారాగ్లైడింగ్‌తో వాటి ప్రాముఖ్యత తెలిసేలా చేశాడు. ఇక, మైసూరులో జరిగే దసరా ఉత్సవాల సందర్భంగా చేసే పారాగ్లైడింగ్‌లో ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాడు. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)