Breaking News

రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారికి స్క్రాబుల్ గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌! అసలేంటి గేమ్‌..

Published on Sun, 11/30/2025 - 15:18

వయసు కేవలం నెంబరే అని, అది మా మనసుకు కాదని ప్రూవ్‌ చేసి శెభాష్‌ అనిపించుకుంటున్నారు చాలామంది వృద్దులు. నచ్చిన వ్యాపకం, క్రీడలతో తమ ఆనందాన్ని, అభిరుచిని వెతుక్కోవడమే కాదు. అందులో సత్తాచాటి టైటిల్స్‌ గెలుచుకుని యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి కోవకు చెందినవారే రిటైర్డ్ IAS అధికారి మోహన్‌ వర్గీస్‌  చుంకత్.  ఇంతకీ అసలేంటి గేమ్‌..? ఎలా ఆడతారంటే..

ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన వర్డ్ బోర్డ్ గేమ్ స్క్రాబుల్‌లో IAS అధికారి మోహన్‌ వర్గీస్‌ చుంకత్ సత్తా చాటుతున్నారు.  తమిళనాడు మాజీ ప్రధాన కార్యదర్శ మోహన్‌ వర్గీస్‌ స్క్రాబుల్‌ ఆటలో భారతదేశంలోని ఏడుగురు మాస్టర్‌లలో ఒకరు. కొన్నిరోజుల  క్రితం స్క్రాబుల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SAI) యునైటెడ్ కింగ్‌డమ్ అచ్చం చెస్‌ల మాదిరిగానే ఆటగాళ్ల​ నైపుణ్యాన్ని గుర్తించే స్కాబుల్‌ టైల్‌ వ్యవస్థను ప్రాంరభించినట్లు తెలిపింది. ఇంగ్లీష్‌ భాషపై ఉన్న ఆసక్టి, సామర్థ్యంతో గత మూడు దశాబ్దాలుగా పోటీపడుతున్నాడు ఈ స్క్రాబుల్‌ ఆటలో. జనవరి 2015 మరియు డిసెంబర్ 2022 మధ్య రెండేళ్లలో అతని ప్రదర్శన ఆధారంగా జాతీయ గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. 

తనకు ఇంగ్లీష్‌ భాష మక్కువతో తరుచుగా డిక్షనరీ చదువుతూ ఉంటాననే అదే ఈ ఆటలో గెలుపుని సొంతం చేసకోవడానికి కారణమవుతోందని అన్నారు. చెన్నై నివాసి అయిన మోహన్‌ వర్గీస్‌ 1999లో మెల్‌బోర్న్‌తో ప్రారంభించి, రాష్ట్ర ఐఏఎస్‌ హోదాలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో భారతదేశానికి ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే 90లలో చదువుకు విరామం తీసుకున్నప్పుడు అమెరికాలోని ఒక క్లబ్‌లో ఆడిన తర్వాత భారతదేశంలో తన అవకాశాన్ని ఎలా అన్వేషించాడో అతను గుర్తుచేసుకున్నాడు. 

తన కెరీర్‌ కారణంగా వృత్తిపరమై బాధ్యతల నడుమ ఎలా ఈ ఆటక తక్కువ సమయమే కేటాయించాల్సి చ్చేదో కూడా చెప్పారు. అయితే పదవీ విరణ తర్వాత ఆ ఆటను ఉత్సాహంగా ఎంచుకుని పద జాబితాలు, పద అర్థాలపై ప్రాక్టీస్‌ చేస్తూ..ఆ ఆటకు పూర్తిస్థాయిలో సన్నద్ధమయయాడు. స్కాబుల్‌కి ఈ వ్యూహం చాలా ముఖ్యమైనది. మనసుని ఆహ్లాదంగా ఉంచుకోవడానికే ఈ గేమ్‌ని ఎంచుకున్నట్లు తెలిపారు. తాను వారానికి రెండుసార్లు ఆడతానని చెప్పారు. ప్రతిసెషన్‌ రెండు నుంచి మూడూ లేదా నాలుగు గంటలు ఉంటుందని చెప్పారు. ఆయన క్రాస్‌వర్డ్‌ ప్రేమికుడు. 

ఈ ఆటకు చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై వంటి నగరాల్లోనే మంచి ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం భారతదేశంలో ఇది కూడా వృత్తిపరమైన క్రీడగా మారనుంది. ప్రధాన టోర్నమెంట్‌లలో 500-600 మంది పాల్గొంటారని, కానీ స్క్రాబుల్‌ను భారత ప్రభుత్వం ఇంకా క్రీడగా గుర్తించలేదని చుంకత్ చెప్పారు. ఇక్కడ ఇది యాజమాన్య బోర్డు గేమ్ . ఈ ఆటకు కూడా జెండర్‌, వయసు నిబంధన, ప్రవేశ రుసుము తదితరాలు ఉంటాయి. 

ప్రతి ప్రధాన టోర్నమెంట్‌లో గత ప్రదర్శనల ఆధారంగా, ర్యాంకింగ్‌ల ఆధారంగా ఆటగాళ్లను నాలుగు విభాగాలుగా వర్గీకరిస్తారు. అందుబాటులో ఉన్న వసనరులతోనే ఈ ఆటలో విజయాన్ని సంపాదించుకోవచ్చని చెబుతున్నారు. అంతేగాదు ఈ ఆటలో ఆటగాళ్ళు అక్షరాల టైల్స్ ఎంచుకోవాల్సి ఉంటుందని, అందుకోసం ఎన్ని అచ్చులు, హల్లులు మిగిలి ఉన్నాయో మానసికంగా లెక్కించాలి,  ఆ తర్వాత హై-పాయింటర్ టైల్స్ (J,Q,X,Z) నుఎ లా ఉత్తమంగా ఉపయోగించాలో అంచనా వేస్తూ ఆడాల్సి ఉంటుందని అన్నారు.

స్క్రాబుల్ అంటే ఏమిటి?
ఇదొక క్రాస్‌ వర్డ్‌ గేమ్‌ లాంటిది. 
ఒక్కొక్క అక్షరం ఉన్న టైల్స్ ఉపయోగించి ఆడే వర్డ్ బిల్డింగ్ బోర్డ్ గేమ్. ఆటగాళ్ళు 15x15 బోర్డుపై పదాలను రూపొందించాలి, పాయింట్లు స్కోర్ చేయాలి ప్రతి మలుపు తర్వాత టైల్స్ గీయాలి.

(చదవండి: 
 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)