Breaking News

క్రిస్మస్‌ స్పెషల్‌: ఇటాలియన్‌ పీచ్‌ కుకీస్‌, ఇంట్లోనే చేసుకోవచ్చు

Published on Fri, 12/22/2023 - 12:00

ఇటాలియన్‌ పీచ్‌ కుకీస్‌ తయారీకి కావల్సినవి:

మైదా – మూడున్నర కప్పులు; వంటసోడా – టేబుల్‌ స్పూను;
కోషర్‌ సాల్ట్‌ – పావు టీస్పూను; బటర్‌ – అరకప్పు;
పంచదార – రెండు కప్పులు; గుడ్లు – రెండు కప్పులు;
వెనీలా ఎసెన్స్‌ – రెండు టీస్పూన్లు; పాలు – కప్పు;
ఎరుపు, పసుపు ఫుడ్‌ కలర్‌ – నాలుగు చుక్కలు (ఒక్కోటి రెండు చుక్కలు).
పీనట్‌  బటర్‌ క్రీమ్‌: బటర్‌ – పావు కప్పు;
వెనీలా ఎసెన్స్‌ – అర టీస్పూను; కోషర్‌ సాల్ట్‌ – చిటికెడు;
పంచదార  పొడి – కప్పు; పీచ్‌ ప్యూరీ – రెండు టేబుల్‌ స్పూన్లు.



తయారీ విధానమిలా:
►ఒక గిన్నెలో వంటసోడా, ఉప్పు వేసి కలపాలి ∙దీనిలో బటర్, కప్పు పంచదార వేసి క్రీమ్‌లా మారేంత వరకు హ్యాండ్‌ మిక్సర్‌తో కలపాలి. తరువాత క్రీమ్‌ను పక్కన పెట్టుకోవాలి ∙మిక్సర్‌ను తక్కువ స్పీడ్‌లో పెట్టి గుడ్ల సొన, వెనీలా ఎసెన్స్‌ వేసి రెండు నిమిషాలు బీట్‌ చేసుకోవాలి ∙తరువాత మైదా, బటర్‌ మిశ్రమం అరకప్పు పాలు పోసి అన్ని చక్కగా కలిసేంత వరకు బీట్‌ చేయాలి.

► ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కూప్‌ పరిమాణంలో తీసుకుని గుండ్రని బాల్స్‌లా చేసి పైన కొద్దిగా వత్తి పీచ్‌ ఫ్రూట్‌ ఆకారంలోకి తీసుకు రావాలి ∙ఇలా అన్ని కుకీస్‌ రెడీ అయిన తరువాత అవెన్‌లో పెట్టి 350 డిగ్రీల ఫారిన్‌ హీట్స్‌ వద్ద పదిహేను నిమిషాలు బేక్‌ చేయాలి ∙పీచ్‌ క్రీమ్‌కోసం తీసుకున్న బటర్, వెనీలా ఎసెన్స్, కోషర్‌ సాల్ట్‌ లనుగిన్నెలో వేసి హ్యాండ్‌ మిక్సర్‌తో కలపాలి.

► ఇవన్నీ చక్కగా కలిపిన తరువాత మిక్సర్‌ స్పీడు తగ్గించి పంచదార పొడి, పీచ్‌ ప్యూరీవేసి మీడియం హై లో నిమిషం పాటు మిక్సర్‌తో కలపాలి ∙మిగిలిన అరకప్పు పాలను రెండు సగాలుగా చేసి రెండు వేర్వేరు గిన్నెల్లో పోయాలి.  ఒకదానిలో ఎరుపు, మరో దానిలో పసుపు ఫుడ్‌ కలర్‌ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.

► మరోగిన్నెలో మిగిలిన పంచదారను పెట్టుకోవాలి.కుకీస్‌ బేక్‌ అయిన తరువాత..వేడిగా ఉన్నప్పుడే కుకీస్‌ మధ్యలో చిన్న గాటు పెట్టి.. మధ్యలో పీచ్‌క్రీమ్‌ను వేసి శాండ్‌విచ్‌లా కొద్దిగా వత్తాలి ∙ఇప్పుడు కుకీకి ఒకవైపు ఎరు రంగు కలపిన పాలు, మరోవైపు పసుపు రంగు కలపిన పాలు అద్దాలి. చివరిగా పంచదార అద్దితే ఇటాలియన్‌ పీచ్‌ కుకీస్‌ రెడీ.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)