Breaking News

పిల్లల లోకంలోకి రండి

Published on Sat, 11/14/2026 - 01:07

పిల్లలకు ఒక ప్రపంచం ఉంటుంది. 
పిల్లలకంటూ ఒక లోకం ఉంటుంది.

ఆ లోకంలో పరీక్షలు ఉండవు. మార్కులు ఉండవు. ర్యాంకులు ఉండవు. అక్కడ చిన్న రాయే గుడి. కాగితపు పడవే ఓడ. గోళీలే బంగారం. స్నేహితుడి భుజమే పెద్ద ఆస్తి. ఆ లోకంలో ఆకాశం చాలా దగ్గరగా ఉంటుంది. కలలు చాలా పెద్దగా ఉంటాయి. ఏడ్చిన ఐదు నిమిషాలకే మళ్లీ నవ్వేసే మాయ ఆ లోకంలోనే ఉంటుంది.

గతంలో ఆ లోకం ఎంత బాగుండేది! వీధి మొత్తం ఆటస్థలం. సాయంత్రం అయితే ఇంటి ముందు కేరింతలు. అమ్మమ్మ ఒడిలో వినే కథలు. వర్షం వస్తే నింగికి వెక్కిరింతలు. ఎండాకాలం వస్తే మామిడి కాయలు, వేసవి సెలవులు. పిల్లలు పిల్లల్లా బతికేవారు. పసితనపు 

దుప్పటిలో వెచ్చగా ఉండేవారు.
పెద్దలు పిల్లల పక్షం వహించేవారు. పిల్లలు తప్పు చేస్తే తిట్టేవారు... కానీ భయపెట్టేవారు కాదు. ఓడి పోతే ఓదార్చేవారు, అవమానించేవారు కాదు. వారు కింద పడితే లేపి వీపు తట్టడానికి ఇరుగింటి పొరుగింటి బాబాయ్, పిన్ని ఉండేవారు.
మరి ఇప్పుడు పిల్లల లోకం ఎలా ఉంది? చిన్న ఫ్లాట్‌లోకి, చిన్న స్క్రీన్‌లోకి కుంచించుకు పోయింది. ఉదయం 7 గంటలకే వీపున పడే బ్యాగ్‌ రాత్రి 10 గంటల వరకు వదలదు. ఆట లేదు. నిద్ర లేదు. స్నేహితులు లేరు. ఉన్నదల్లా మొబైల్, ట్యూషన్, మార్కుల భయం. 

పిల్లలు నవ్వడం మర్చి పోయారు. ప్రశ్న అడగడం మర్చి పోయారు. ఏడుపును కూడా దాచుకోవడం నేర్చుకున్నారు. పిల్లాడు ఇప్పుడు పిల్లాడు కాదు. చిన్న పెద్దమనిషి. ఈ పిల్లల ప్రపంచాన్ని పాడు చేసింది ఎవరు? మనమే.
మార్కులు రాక పోతే పిల్లాడు పనికిరాడని నమ్మిన తల్లిదండ్రులం మనమే. ఆటస్థలాలు అమ్మేసి అపార్ట్‌మెంట్లు కట్టిన సమాజం మనదే. బడిని జైలులా, పరీక్షను యుద్ధంలా మార్చిన వ్యవస్థ మనదే. పిల్లల చేతికి ఆట వస్తువు బదులు ఫోన్‌ ఇచ్చిన వాళ్ళం మనమే.

మరి దీనిని బాగు చేయాల్సింది ఎవరు? మనమే. చాలా పెద్ద పనులు అక్కర్లేదు. పిల్లాడు ఆడాలంటే ఆడనివ్వండి. ప్రశ్న అడిగితే విసుక్కోకుండా జవాబు చెప్పండి. మార్కులు తక్కువ వస్తే తిట్టకుండా దగ్గరకు తీసుకోండి. రోజుకు ఒక్క గంటైనా ఫోన్‌ లేకుండా వాడితో కలిసి కూర్చోండి. బడిలో ఆటకు ఒక పీరియడ్‌ ఇవ్వండి. వాడి తప్పును క్షమించండి, వాడి కలను నమ్మండి.

‘బాలల దినోత్సవం’ సందర్భంగా ఒక్కసారి మనం మన పిల్లల ప్రపంచంలోకి వెళ్దాం. వాళ్ళతో పాటు కింద కూర్చుందాం. వాళ్ళ కళ్లతో ఈ లోకాన్ని చూద్దాం. అప్పుడు తెలుస్తుంది, మనం వాళ్లకు ఏం  పోగొట్టామో. పిల్లల ప్రపంచం ఇంకా చావలేదు. అది మన కోసం ఎదురు చూస్తోంది. రండి, ఆ ప్రపంచంలోకి వెళ్దాం. పిల్లలకు తోడు పెద్దలు కలిస్తే అక్కడ మళ్ళీ నవ్వులు పూస్తాయి. మళ్ళీ కలలు మొలుస్తాయి. మళ్ళీ పిల్లలు పిల్లల్లా బతుకుతారు.

Videos

YSRCPలోకి భారీగా చేరికలు..

జీవితాన్ని నాశనం చేశావు... ఆ లెటర్ లో అసలు ఏముంది?

అల్లూ అర్జున్..Jr. NTR భార్యలను తిట్టినా పవన్ కళ్యాణ్ మౌనానికి కారణం..?

లోకేష్ ఏం చేస్తున్నాడు... ఫీజు రీయింబర్స్‌మెంట్ పై కల్పలతా రెడ్డి ఫైర్

బంగారం ధరల్లో ఊహించని పతనం! ఇంకా తగ్గనున్నాయా?

సీతమ్మ ఫైట్ చేయడం ఏంటి..?

మహిళలపై దాడులా.. ఎవడైనా మా YSRCP కార్యకర్త జోలికొస్తే... వల్లభనేని వంశీ ఫైర్

శత్రుచర్ల కు నివాళులు

కృష్ణలంకలో మహిళ దారుణ హత్య

విద్యార్థుల ఆత్మహత్యాయత్నానికి కారణం..! లోకేష్ పై జగన్ ఫైర్

Photos

+5

చీరకట్టులో వైష్ణవి చైతన్య అందాల సందడి.. ( ఫొటోలు)

+5

‘రియాలిటీ’ మూవీ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

‘ఈఎన్‌ఈ రిపీట్‌’ మూవీ పాట విడుదల ప్రెస్ మీట్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్లు శ్రీలీల, గౌరిప్రియ (ఫొటోలు)

+5

హు..హు..హు.. ఇప్పుడే ఇలా ఉంటే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీ ఈవెంట్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ చిల్.. (ఫోటోలు)

+5

ప్రేమ బంధానికి కొత్త అడుగు.. న్యూజిలాండ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు