Breaking News

ఆటలు లేని బాల్యం : ఊబకాయం, ఫ్యాటీ లివర్‌

Published on Thu, 03/13/2025 - 14:30

ప్రపంచీకరణతో మన దేశానికి ఏస్థాయిలో మేలు జరిగిందో అదే స్థాయిలో కీడూ జరుగుతోంది. ఇప్పటి వరకూ పాశ్చాత్యదేశాలను మాత్రమే పట్టి పీడిస్తూ వచ్చిన అధిక బరువు, ఊబకాయం(Obesity) లాంటి సమస్య అభివృద్ధి చెందుతున్న భారత్‌కు సైతం తలనొప్పిగా మారింది. ప్రధానంగా చిన్నారులలో అధిక బరువు, ఊబకాయాలు... ఫ్యాటీ లివర్‌ (Fatty Liver) వ్యాధికి దారి తీయడం ఆందోళన కలిగిస్తోంది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు అనూహ్యంగా మార్పులకు లోనుకావటం, ఆడుకునే అవకాశం లేకపోవడం పిల్లల ఈ స్థితికి కారణమని నిపుణులు అంటున్నారు. 

పాఠశాల స్థాయి నుంచే ఆటలకు దూరమవుతున్న చిన్నారులు టీవీలకు, సెల్‌ ఫోన్లకు బానిసలవుతున్నారు. బాల్యంలో ఓ ప్రధాన భాగమైన సంప్రదాయ (కోతి కొమ్మచ్చి, తొక్కుడు బిళ్ల, కర్రాబిళ్ళా, బెచ్చాలు, గోళీలాంటి) ఆటలకు సైతం నోచుకోలేక పోతున్నారు. విద్యారంగంలో ప్రభుత్వ భాగస్వామ్యం తగ్గి ప్రైవేటు భాగస్వామ్యం రాను రాను పెరిగిపోవడంతో ఆటలు అటకెక్కాయి. చదువే ప్రధాన వ్యాపకంగా మారిపోయింది. విద్య ప్రభుత్వ బాధ్యతగా ఉన్నంతకాలం ప్రాథమిక, ఉన్నత పాఠశాలల స్థాయిలో క్రీడలకు తగిన సదు పాయాలు ఉండేవి. 

గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలకు సువిశాలమైన ఆటస్థలాలతో పాటు తగిన సంఖ్యలో వ్యాయామ ఉపాధ్యాయులు సైతం ఉండటం ఒకప్పుడు సాధారణ విషయమైతే ఇప్పుడు అసాధారణ విషయంగా మారిపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పలు నగరాలలోసింగిల్‌ బెడ్‌ రూమ్‌ పాఠశాలలు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ కళాశాలలు మనకు ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో క్రీడా సదుపాయాలు, మైదానాలు మచ్చుకైనా కనిపించవు. ఇలాంటి విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు ఆటలంటే ఏమిటో తెలియకుండా అమూల్యమైన తమ బాల్యాన్నీ, విద్యార్థి దశనూ ముగించడాన్ని మించిన విషాదం (Tragedy) మరొకటి లేదు.

చదవండి: ఇరాన్ బీచ్‌లో‘బ్లడ్ రెయిన్’ : నెటిజన్లు షాక్‌, వైరల్‌ వీడియో

పాఠశాల దశ నుంచే ఆటలకు, క్రీడాసంస్కృతికి దూరమైన చిన్నారులు ఆ తరువాతి కాలంలో శారీరకంగా, మానసికంగా పలు రకాల సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తోంది. మన దేశంలో ఈమధ్య కాలంలో నిర్వహించిన పలు అధ్యయనాల ప్రకారం ఆటపాటలకు దూరమైన చిన్నారులు అధిక బరు వుతో పాటు ఫ్యాటీ లివర్‌ (నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌) వ్యాధి బారిన పడుతున్నట్లు తేలింది. పిల్లలు బాల్యంలో ఆటలకు దూరం కావడం అంటే శారీరకంగా, మానసికంగా ఎదుగు దలకు దూరంకావటమేనని నిపుణులు చెబుతున్నారు. 

దేశవ్యాప్తంగా నిర్వహించిన తాజా అధ్యయనాల ప్రకారం దేశ జనాభాలో 60 శాతం మంది అధిక బరువు సమస్య ఎదుర్కొంటుంటే... అందులో 30 శాతం మంది ఊబకాయం సమస్యతో నానాపాట్లు పడుతున్నారు. బాలల్లో 40 శాతం మంది ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) చైర్మన్‌ డాక్ట‌ర్‌ నాగేశ్వర రెడ్డి సైతం హెచ్చరిస్తున్నారు. తమ పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో బాల్యంలో ఆటలూ అంతే ముఖ్యమని తల్లిదండ్రులూ... ఆరోగ్యవంతమైన, ఆహ్లాదభరితమైన బాల్యాన్ని అందించాల్సిన బాధ్యత తమపైనే ఉందని పాలకులూ, పాఠశాలల యాజమాన్యాలు గ్రహించిన రోజే బాల్యం అమూల్యంగా, అపు రూపంగా మిగిలిపోగలుగుతుంది.

– కృష్ణారావు చొప్పరపు
సీనియర్‌ స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌ 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)