Breaking News

Single Parenting : సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించొచ్చు..!

Published on Thu, 01/30/2025 - 10:25

ఒంటరి తల్లి లేదా తండ్రి పిల్లల పెంపకంలో ఓ వైపు సవాళ్లు ఎదుర్కొంటూ ఉంటే, ఇక వారు ఉద్యోగస్థులైతే ఆ సవాల్‌ మరింత పెరుగుతుంది. ఉద్యోగాలు చేసే ఒంటరి తల్లిదండ్రులు తమ పనిని, పిల్లల బాధ్యతలను సమతుల్యం చేసుకోవడంలో చాలా సమస్యలను ఎదుర్కొంటారు. అయితే, కొంత అవగాహన, సమయ నిర్వహణతో, సింగిల్‌ పేరెంటింగ్‌ను సులభతరం చేయవచ్చు.

ఒంటరిగా బాధ్యత
తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నప్పుడు/ వారిలో ఒకరు మరణించినప్పుడు/ బిడ్డను ఒంటరిగా పెంచాలని నిర్ణయించుకున్నప్పుడు బాధ్యత ఒక్కరిదే అవుతుంది. ఇది కాకుండా, ఒక స్త్రీ ఒంటరిగా తల్లి కావాలనుకుంటే, ఆమె ఐవిఎఫ్‌ ద్వారా బిడ్డను కనచ్చు లేదా దత్తత తీసుకోవచ్చు. అలాగే ఒక పురుషుడు సింగిల్‌ పేరెంట్‌ కావాలనుకుంటే, బిడ్డను దత్తత తీసుకోవచ్చు/ అద్దెగర్భం ద్వారా బిడ్డను పొందవచ్చు.

సవాల్‌తో కూడుకున్నది
సింగిల్‌ పేరెంటింగ్‌ అనేది బిడ్డకు, తల్లిదండ్రులకు ఇద్దరికీ సవాల్‌తో కూడుకున్నదే. ఒంటరి తల్లి/తండ్రి తమ ఉద్యోగ జీవితాన్ని నిర్వహించడం లేదా బిడ్డ బాధ్యతలన్నింటినీ నిర్వర్తిస్తూ ఆర్థికంగా బలంగా ఉండటం అంత సులభమేమీ కాదు. 

ఆ బిడ్డ కొన్నిసార్లు తన జీవితంలో తల్లి లేదా తండ్రి ప్రేమ పూర్తిగా కోల్పోయినట్లు భావించవచ్చు. ఇది కాకుండా, ఒంటరి తల్లి కొన్నిసార్లు సమాజంలో వివక్షను ఎదుర్కోవచ్చు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. ఒకవేళ తల్లిదండ్రులు విడివిడిగా నివసిస్తుంటే, స్నేహితులు అతని కుటుంబం గురించి ప్రశ్నలు అడిగినప్పుడు పిల్లలు ఇబ్బంది పడవచ్చు.

కుటుంబం పాత్ర
కుటుంబ సభ్యులు (పెద్దవాళ్లు) ఒంటరి తల్లిదండ్రులకు సహాయం చేస్తే పిల్లల పెంపకం సులభం అవుతుంది. తల్లిదండ్రులు ఉద్యోగస్తులైతే కుటుంబ సభ్యులు పిల్లల సంరక్షణలో సహాయం చేయవచ్చు. 

పిల్లలను స్కూలుకు సిద్ధం చేయడం, హోంవర్క్‌ పూర్తి చేయించడం, వారితో ఆడుకోవడం వంటివి. ఇది కాకుండా, కొన్నిసార్లు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసిన స్థితిలో కుటుంబ సభ్యులు వారికి సహాయం చేయగలరు.

సమాజానికి భయపడి
నేటికీ, సమాజంలోని ఒక వర్గం ఒంటరి తల్లిదండ్రులను, పిల్లలను సానుకూల దృష్టితో చూడటం లేదు. ముఖ్యంగా మహిళలు తమ భర్తల నుండి విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ కారణంగానే నేటికీ చాలా మంది బయటపడలేకపోతున్నారు. 

ఈ నిర్ణయం తీసుకునే స్త్రీలను సమాజంలో వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. ఇది ఒంటరి తల్లుల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. సమాజం ఒంటరి తల్లులన, వారి పిల్లలను చిన్నచూపు చూడకుండా సానుకూల దృక్పథం కలిగి ఉంటే ఇది వారికి, వారి పరిస్థితులతో పోరాడటానికి బలాన్ని ఇస్తుంది.

పిల్లలపై ప్రభావం
సింగిల్‌ పేరెంటింగ్‌ పిల్లలపై సానుకూల, ప్రతికూల ప్రభావం రెండూ చూపుతాయి. వారి తల్లితో సంబంధం బలపడుతుంది. అదే సమయంలో, వారు తరచూ ఒంటరితనాన్ని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. పిల్లలు తరచుగా వివిధ రకాల భావోద్వేగ, ప్రవర్తనా సవాళ్లను ఎదుర్కొంటారు. శారీరకంగా– మానసికంగా విచారంగా, గందరగోళంగా అనిపించవచ్చు.

తమ ఇంట్లో లేని తల్లి/తండ్రితో వారి సంబంధం గురించి ఆందోళన చెందుతారు. ఇద్దరిలో ఒకరు లేకపోవడం వల్ల పిల్లలు ఒంటరిగా ఉన్నట్లు అనిపించవచ్చు. తల్లిదండ్రులిద్దరు ఉన్న సహచరుల కుటుంబ వాతావరణాన్ని పోల్చుకుని బాధపడుతుంటారు. కొన్ని సందర్భాల్లో తమ భావోద్వేగాలను ఎదుర్కోవడానికి ఇదొక మార్గంగా ఎంచుకుంటారు.  

మీ బిడ్డను పెంచడంలో మునిగిపోయి మీ పట్ల మీరు నిర్లక్ష్యంగా ఉండవద్దు. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే, మీ బిడ్డను తీర్చిదిద్దవలసింది మీరే అన్న విషయం మరచిపోరాదు. 

ఈ తప్పులు చేయొద్దు

  • సింగిల్‌ పేరెంటింగ్‌లో కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా పిల్లలను చెడగొట్టగలదు. కొన్ని విషయాల్లో అవగాహన, అర్థం చేసుకోవడం మేలు కలిగిస్తుంది... 

  • ఒంటరి తల్లిదండ్రులు తమ పిల్లలకు అవసరమైన దానికంటే ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఇది పిల్లల స్వాతంత్య్రాన్ని కోల్పోయేలా చేస్తుంది. పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడం కూడా అవసరం 

  • ఒంటరి తల్లిదండ్రులు ఇద్దరు పాత్రలను ఒకరే పోషిస్తారు కాబట్టి అన్నింటా అతిగా కూడా ఉండవచ్చు. ‘అతి’ ప్రేమ, అతి రక్షణ.. వంటివి పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి

  • ఒంటరిగా ఎందుకు ఉండాల్సి వచ్చిందో మీ బిడ్డకు ఎప్పుడూ అబద్ధం చెప్పవద్దు. వాస్తవాన్ని వివరించాలి. 

  • పిల్లల ప్రతి డిమాండ్‌నూ నెరవేర్చవద్దు. 

  • మీ బిడ్డను వేరే ఏ బిడ్డతోనూ పోల్చవద్దు.

–ప్రొ పి. జ్యోతిరాజ, సైకాలజిస్ట్, లైఫ్‌స్కిల్‌ నిపుణులు 

నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

(చదవండి:

#

Tags : 1

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)