Breaking News

బాల్యానికి పెళ్లి బంధనం

Published on Sat, 07/27/2024 - 10:55

నిమిషానికి ముగ్గురు బాలికలు బలవంతంగా పెళ్లి బంధంలో చిక్కుకుంటున్నారు. బాల్య వివాహాలను 1929లోనే నిషేధించింది ప్రభుత్వం. మరింత కట్టుదిట్టం చేస్తూ కఠినమైన శిక్షలతో ప్రోహిబిషన్‌ ఆఫ్‌ చైల్డ్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ – 2006’ను తెచ్చింది. అయినప్పటికీ ఏడాదికి 16 లక్షల బాల్య వివాహాలు జరుగుతున్నాయని అంచనా. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే నిర్వహించిన సర్వే చెబుతున్నదిదీ. తాజా అధ్యయనాలు చెబుతున్న మరో వాస్తవం ఏమిటంటే... 20– 24 ఏళ్ల వివాహిత మహిళలను పెళ్లి నాటికి వాళ్ల వయసు ఎంతని అడిగితే వారిలో 23.3 శాతం మంది పద్దెనిమిదేళ్లలోపే పెళ్లయినట్లుచెప్పారు.

⇒కోవిడ్‌కు ముందు 27 శాతంగా ఉన్న బాల్యవివాహాలు కోవిడ్‌ సమయంలో 33 శాతానికి పెరిగాయి. ఇది దేశ సరాసరి లెక్క. తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపుగా ఏమీ లేదు.

⇒ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ ‘బాల్య వివాహ రహిత జిల్లా’గా మార్చిన కలెక్టర్‌లకు అవార్డులు ప్రకటించారు. అప్పుడు వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ జిల్లాలో బాల్యవివాహం జరగకుండా నివారించి అవార్డు అందుకున్నారు. 

⇒ఒకప్పుడు తమిళనాడులో బాల్యవివాహాలు ఎక్కువగా ఉండేవి. జయలలిత ముఖ్యమంత్రిగా బాల్యవివాహాలను నివారణ కోసం ఆడపిల్లలకు డిగ్రీ వరకు ఉచిత విద్య, స్కాలర్‌షిప్‌ల వంటి చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ రాష్ట్రం దేశ సరాసరి కంటే చాలా మెరుగ్గా ఉంది.

⇒కర్నాటక రాష్ట్రం కూడా ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయించి రిటైర్డ్‌ జడ్జ్‌ ఆధ్వర్యంలో బాల్యవివాహాలకు వ్యతిరేకంగా చైతన్యవంతం చేస్తూ ప్రచారం నిర్వహించి సమాజంలో మార్పు తెచ్చుకుంది.

⇒అస్సాం, వెస్ట్‌ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఆడపిల్లలకు పదేళ్లలోపే పెళ్లి చేసే ఆచారం ఉండేది. అస్సాం ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టింది. చాలా వేగంగా మెరుగైన ఫలితాలను సాధిస్తోంది.

⇒బాల్య వివాహాలను అరికట్టాలంటే... ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్, హెల్త్, ఎడ్యుకేషన్, పోలీస్, రెవెన్యూ... ఈ ఐదు ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేయాలి.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

తొలి లెక్క పాఠశాల నుంచే!
కోవిడ్‌ సమయంలో 1098 హెల్ప్‌లైన్‌కి 5,500 కాల్స్‌ వచ్చాయి. బాల్యవివాహం బారిన పడుతున్న అమ్మాయిలు, వారి స్నేహితుల నుంచి వచ్చిన ఫోన్‌ కాల్స్‌ అవి. ఫోన్‌ కాల్స్‌ కూడా రాకుండా జరిగి΄ోయిన పెళ్లిళ్లు ఎన్నో. కోవిడ్‌ తర్వాత స్కూళ్లు తెరుచుకున్నప్పుడు తిరిగి స్కూల్‌కి వచ్చిన అమ్మాయిల లెక్క ఏ శాఖ దగ్గరా లేదు. పంచాయితీ సెక్రటరీ గ్రామస్థాయి చైల్డ్‌ మ్యారేజ్‌ ప్రోహిబిషన్‌ ఆఫీసర్‌. ΄ాఠశాల రిజిస్టర్‌ నుంచి మొదలు పెడితే కచ్చితమైన లెక్కలు రాబట్టవచ్చు.ప్రాథమిక పాఠశాల నుంచి హైస్కూల్‌కి కొనసాగే వాళ్లు 63 శాతం మాత్రమే. 

టెన్త్‌ పాసయిన అమ్మాయిల్లో కాలేజ్‌కెళ్లేవాళ్లు పాతిక శాతం మాత్రమే. మండలాల్లో కూడా కాలేజ్‌లు పెడితే ఆడపిల్లలందరూ చదువుకోగలుగుతారు. చదువుకుంటే బాల్య వివాహాలు వాటంతట అవే ఆగిపోతాయి. సామాజిక కార్యకర్తగా ఇరవై వేల బాల్య వివాహాలను ఆపగలిగాను. కొందరు మాత్రం మేము రాత్రంతా కాపు కాసి తెల్లవారు జామున అలా పక్కకు వెళ్లగానే తాళి కట్టించేసే వాళ్లు. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా నేను స్వయంగా 78 కేసులు వేశాను. ఒక్క కేసులోనూ దోషులకు శిక్ష పడలేదు. 

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)