Breaking News

పెళ్లికిచ్చిన రిటర్న్‌ గిఫ్ట్ చూసి అతిథులు ఫిదా : ఫాదర్‌ ఐడియా అదిరింది!

Published on Wed, 02/07/2024 - 14:07

#HelmetsReturn Gifts:ఇటీవలి కాలంలోపెళ్ళిళ్లకు రిటన్‌ గిఫ్ట్‌లు ఇవ్వడం చాలా  కామన్‌గా మారింది. అలా  ఓ పెళ్లిలో పెళ్లి కుమార్తె తండ్రి ఇచ్చిన రిటన్‌ గిఫ్ట్‌ వైరల్‌గా మారింది.  రిటన్‌ గిఫ్ట్‌ ఏంటి? వైరల్‌ కావడం ఏంటి? అనుకుంటున్నారా? అయితే మీరీ  స్టోరీ తెలుసుకోవాల్సిందే.

ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కోర్బా జిల్లా, ముదాపూర్‌ ప్రాంతానికి చెందిన సెద్ యాదవ్  తన కుమార్తె వివాహం  ఘనంగా జరిపించాడు.  తన కుమార్తె, స్పోర్ట్స్ టీచర్  నీలిమతో, సరన్‌గఢ్-బిలైగఢ్ జిల్లాలోని లంకాహుడా గ్రామానికి చెందిన ఖమ్‌హాన్ యాదవ్‌తో మూడు ముళ్ల  వేడుకను ముచ్చటగా జరిపించాడు. విందు భోజనాలు కూడా  ఘనంగా ఏర్పాటు  చేశాడు. అయితే ఆ పెళ్లికి వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్‌లుగా హెల్మెట్‌లు ఇవ్వడం వార్తల్లో నిలిచింది. అంతేకాదు ఇది చూసిన అతిథులు  ఆశ్చర్యపోయారు.

ఇదీ చదవండి: అపుడు సల్మాన్‌ మూవీ రిజెక్ట్‌.. ఒక్క సినిమాతో కలలరాణిగా..ఈ స్టార్‌ కిడ్‌ ఎవరు?

అయితే రోడ్డు భద్రతపై జనంలో అవగాహన కల్పించేందుకే  ఈ  నిర్ణయం తీసుకున్నాడు వధువు తండ్రి. రోడ్డుపై ప్రయాణిస్తున్నపుడు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినపుడు తామిచ్చిన హెల్మెట్లు ఉపయోగడాలని భావించామన్నాడు. పెళ్లికి వచ్చిన వారిలో 60 మంది అతిథులకు స్వీట్లతోపాటు హెల్మెట్లను రిటర్న్ గిఫ్ట్‌లుగా ఇచ్చినట్లు సెద్ యాదవ్  తెలిపాడు. అంతేకాదు ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో కుటుంబ సభ్యులంతా  కలిసి హెల్మెట్లు ధరించి మరీ  డ్యాన్సులు చేసినట్టు సంబరంగా  చెప్పుకొచ్చాడు.

రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమైన మద్యం తాగి వాహనాలు నడపడం మానుకోవాలని అతిథులను కోరారు. అందరూ జీవితం విలువను గుర్తించాలని  పిలుపునిచ్చాడు. రోడ్డు భద్రత, హెల్మెట్ల వాడకంపై అవగాహన కల్పించేందుకు తన కుమార్తె పెళ్లి వేడుక తనకొక వేదికను అందించిందంటూ  ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

అటు  గిఫ్ట్స్‌ అందుకున్న బంధువులు, సన్నిహితులు చాలామంచి ఆలోచన అంటూ  సెద్‌ను  అభినందించారు. ఆనదంతో వారు స్టెప్పులు వేశారు.

గతంలో  బెంగళూరులో కూడా 
గతంలో బెంగళూరులో కూడా ఇలాంటి సంఘటన ఒకటి  నమోదైంది.  తమ పెళ్లికి వచ్చిన  అతిథులకు హెల్మెట్లు, మొక్కలు గిఫ్ట్‌గా ఇచ్చారు నూతన జంట  శివరాజ్‌, సవిత. ఇలా అయినా  కొంతమంది ప్రాణాలైనా రక్షించగలిగితే తమకదే చాలని, అలాగే తామి​చ్చిన మొక్కల్లో 500 మొక్కలు బతికినా  తమకు ఆనందమేనని  వెల్లడించారు. పెళ్లిళ్లలకు మందు, విందు, మ్యూజిక్‌ అంటూ చేసే వృధా ఖర్చులకు బదులుగా, ఇలా చేయడం ద్వారా, అటు పర్యావరణానికి, ఇటు భవిష్యత్తరాలకు మేలు చేసిన వారమవుతాంటూ  వెల్లడించాడు శివరాజ్‌.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)