Breaking News

రాగితో చౌకగా క్యాన్సర్‌ మందులు తయారు చేయొచ్చు: సైంటిస్టులు

Published on Fri, 11/24/2023 - 14:29

ఆరోగ్యపరంగా రాగి లోహానికి ఉన్న ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్లుగా ఆయుర్వేదంలో అనేక వ్యాధుల చికిత్సలో రాగిని వాడుతున్నారు. అయితే ఇప్పుడు రాగిని ఉపయోగించి క్యాన్సర్‌ డ్రగ్స్‌ మెడిసిన్స్‌ను చవకగా తయారు చేయొచ్చని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ సైంటస్టులు జరిపిన అధ్యయనంలో తేలింది.

సాధరణంగా క్యాన్సర్‌ చికిత్సకు వాడే మందులు తయారు చేయడానికి  ఒక గ్రాముకు సుమారు రూ. 2 లక్షల 60 వేలకు పైగా ఖర్చు అయితే, రాగిని ఉపయోగించి మెడిసిన్స్‌ చేయడం వల్ల ఒక గ్రాముకు కేవలం రూ. 250 రూపాయలే అవుతుందని సైంటిస్టులు తమ రీసెర్చ్‌లో తేల్చారు. దీని వల్ల భవిష్యత్తులో చవకగా ఔషధాలు తయారు చేసేందుకు మార్గం సుగుమం అయ్యింది. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చదవాల్సిందే. 


మనిషి మొదటగా కనుక్కొని వాడిన లోహం రాగి. కొన్ని వేల ఏళ్లుగా మనం రాగి వస్తువులను, రాగి పాత్రలను వాడుతూనే ఉన్నాం. దీన్ని తామ్రము అని, క్యూప్రమ్‌ అని కూడా అంటారు. రాగితో చేసిన పాత్రలను వాడటం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుందని పలు అధ్యయనాల్లో ఇప్పటికే రుజువైంది. నీటిలో ఉండే బాక్టీరియాను న‌శింప‌జేసే శ‌క్తి కూడా రాగికి ఉంద‌ని ఆధునిక‌ ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. రాగి లోహాలను వాడటం వల్ల అనేక రోగాలు నయమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా,చవకగా దొరికే లోహాల్లో రాగి ఒకటి. దీనికి ఉండే ఔషధ గుణాల రీత్యా క్యాన్సర్‌ చికిత్సలోనూ వాడేందుకు అనువుగా ఉందని ప్రొఫెసర్ ఓహ్యున్ క్వాన్  అన్నారు. క్యాన్సర్‌ చికిత్సలో సాధారణంగా వాడే మందుల తయారీకి ఒక గ్రాముకు రూ. 2లక్షల 60 వేల(3వేల డాలర్లు)ఖర్చవగా, రాగిని ఉపయోగించి అదే ఔషధాన్ని తయారు చేసేందుకు కేవలం రూ.250 మాత్రమే అవుతుందని పేర్కొన్నారు.

ఈ విధానం ద్వారా క్యాన్సర్‌ వ్యతిరేక c-Jun N- టెర్మినల్ కినేస్ ఇన్హిబిటర్‌ను కేవలం మూడు దశల్లోనే ఉత్పత్తి చేయగలిగారు. సాధారణంగా దీనికి 12 రసాయనిక చర్యలు అవసరం అవుతాయి. ఇందులో అడెనోసిన్‌, N6-మిథైలాడెనోసిన్‌ను సులువుగా అమైన్‌గా మార్చగలదు. కణాలు, వ్యాధి ప్రక్రియలు మరియు అభివృద్ధిలో జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో ఈ అమైన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ప్రస్తుతమున్న క్యాన్సర్‌ చికిత్సలో దీన్ని ఉత్పత్తి చేయడానికి ఒక గ్రాముకు సుమారు రూ.8వేల 500($103)కు పైగా ఖర్చవుతుంది. అదే రాగిని ఉపయోగించడం వల్ల చాలా చవకగా ఔషధాలను తయారు చేయొచ్చని, భవిష్యత్తులో  ఈ పద్దతి మరింత సులభతరం అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)