Breaking News

ఒక్క మాట మాట్లాడరు కానీ ఐఏఎస్‌ కోచింగ్‌..!

Published on Tue, 01/14/2025 - 13:46

ప్రస్తుత రోజుల్లో కోచింగ్‌ అంటే ఎంత డబ్బు వెచ్చించాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ ఐఏఎస్‌లాంటి ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షలకు కొచింగ్‌కి అయ్యే ఖర్చు ఏ స్థాయిలో ఉంటుందో తెలియంది కాదు. కానీ అలాంటి కఠినతరమైన ఐఏఎస్‌ పోటీ పరీక్షకి ఫ్రీగా కోచింగ్‌ ఇస్తున్నాడు. సన్యాసం తీసుకున్న వ్యక్తి. ఇక్కడ విశేషం ఏంటంటే మౌనంగానే కోచింగ్‌ ఇస్తాడు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక్క మాట మాట్లాడకుండా కోచింగ్‌ ఇస్తాడు. అందరికీ ఉన్నతోద్యోగాలు చేసే అవకాశం దక్కాలని ఇలా ఉచితంగా కోచింగ్‌ ఇస్తున్నాడట. ఇంతకీ ఎవరా ఆ వింత వ్యక్తి..

ఆ వ్యక్తి పేరు దినేశ్‌ స్వరూప్‌ బ్రహ్మచారి. ఎప్పుడూ కాషాయ దుస్తులు ధరించి, పొడవాటి గడ్డం, జుట్టుతో కనిపించే ఈయనను అంతా చాయ్‌వాలే బాబా (Chai Wale Baba)గా పిలుస్తారు. తన జీవితాన్ని ఐఏఎస్‌(IAS) కోచింగ్‌కి అంకితం చేశారు. ఆయన అందరూ ఉన్నతోద్యోగాలు పొందాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చిన వారికైనా ఉచితంగానే ఐఏఎస్‌ కోచింగ్‌ ఇస్తారు చాయ్‌వాలే బాబా . 

ప్రత్యేకత ఏంటంటే..
కోచింగ్‌ ఇవ్వాలంటే నోరు విప్పాల్సిందే. స్టూడెంట్స్‌కి అర్థమయ్యేలా విపులంగా విడమర్చి గట్టిగా చెప్పక తప్పదు. అలాంటిది ఈయన నోరు తెరవకుండానే భోధిస్తారు. మౌనవ్రతం పాటిస్తూనే..సైగలతో అభ్యర్థులను గైడ్‌ చేస్తుంటారు.  వాట్సప్‌ ద్వారా నోట్స్‌ ఇస్తారు. ఇతరత్రా ఆదేశాలు, మెసేజ్‌లు కూడా వాట్సప్‌ ద్వారానే. అయినప్పటికీ.. వేలాది మంది ఆయన దగ్గర మెంటార్‌షిప్‌ తీసుకుంటున్నారు. ఏ డౌట్ ఉన్నా సరే, ఆయనకు వాట్సప్‌ చేస్తే సరిపోతుంది. వెంటనే ఆన్సర్ రిప్లై వస్తుంది.

కేవలం 'టీ' మాత్రమే
ఈ చాయ్‌వాలా బాబాకు సంబంధించిన మరొక విశేషమేమిటంటే..ఆయన అస్సలు ఎలాంటి ఘనాహారం తినరు. కేవలం రోజుకి పది కప్పుల టీ(చాయ్‌) మాత్రమే తాగుతారు. అందువల్లే ఆయన్ని చాయ్‌వాలే బాబాగా పిలుస్తారు. గత 40 ఏళ్లుగా ఆయన జీవనశైలి ఇదేనట.

ఏ డౌట్‌ ఉన్నా వెంటనే గైడ్‌ చేస్తారు..
ఆయన శిఘ్యులు తమ గురువు బాబా ఎప్పుడు ఏ సాయం కావాలన్నా..తక్షణమే తమకు గైడెన్స్‌ ఇస్తారని అంటున్నారు. ఎప్పుడూ మౌనంగా ఉండే ఆయన సైగలు, సంకేతాలు, వాట్సప్‌ మెసేజ్‌ల ద్వారానే గైడ్‌ చేస్తారని చెప్పారు. ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్‌ చేస్తే చాలు, తక్షణమే రిప్లై ఇస్తారని చెబుతున్నారు. ఆఖరికి నోట్స్‌ కూడా వాట్సప్‌ ద్వారానే పంపుతారని ఓ శిఘ్యుడు చెబుతున్నాడు.

(చదవండి: సన్యాసిలా జీవించిన ఆమె ఇవాళ ఐఏఎస్‌ అధికారిణి..ఏకంగా మాజీ సీఎం..!)

 

#

Tags : 1

Videos

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)