Breaking News

టెలివిజన్‌ షోలో హైలెట్‌గా 'కివీ ఐస్ క్రీం డెజర్ట్'! సెలబ్రిటీ చెఫ్‌లే ఫిదా

Published on Tue, 03/18/2025 - 13:33

స్టార్‌ ప్లస్‌లో మంచి ఫేమస్‌ అయిన షో సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ ఇండియా. ఇది పాకకళకు సంబంధించిన రియాలటీ షో. ఈ ఈవెంట్‌లో ప్రముఖ సినీ సెలబ్రిటీలు, మాస్టర్‌ చెఫ్‌ల సమక్షంలో కంటెస్టెంట్‌లు తమ పాక కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. దగ్గర దగ్గర 12 నుంచి 15 మంది దాక పోటీదారులు పాల్గొంటారు. అయితే ఈ సారి  మాస్టర్ చెఫ్ ఇండియా సీజన్ 1లో ఓ వైరైటీ వంటకం ఆ షో న్యాయనిర్ణేతలని కట్టిపడేసింది. తప్పనిసరిగా ఆ డెజర్ట్‌ని తమ భోజనంలో భాగంలో చేసుకుంటామని అన్నారు.  అదేంటో చూసేద్దామా..:

తన పాక నైపుణ్యంతో న్యాయనిర్ణేతను ఫిదా చేసింది అర్చన గౌతమ్‌ అనే పోటీదారురాలు. ఆమె ఈ సీజన్‌ పోటీలో జడ్జీలను తన పాక కళతో అమితంగా జడ్జీలను ఆకట్టుకుంది. వండిన విధానమే గాక సర్వ్‌ చేసే తీరు హైలెట్‌గా నిలిచింది. అయితే ఆమె ఇటీవల జరిగిన  ఎపిసోడ్‌లో చేసిన వంటకంతో ఒక్కసారిగా ఫేమస్‌ అయిపోయింది.

ఆ షో న్యాయనిర్ణేతలు కూడా ఆ వంటకం చేసిన తీరు, ప్రెజెంట్‌ చేసిన విధానానికి ఫిదా అయ్యి ప్రశంసలతో ముంచెత్తారు. మరీ ఆ కంటెస్టెంట్‌  తయారు చేసిన వంటకం ఏంటంటే.. 

కివి ఐస్ క్రీం:
ఆ షోలో ఆమె కివి ఐస్‌క్రీంని తయారు చేసింది. ఆకృతిపరంగానే కాకుండా తయారు చేసిన విధానం కూడా వేరెలెవెల్‌. కివిని పచ్చిపాలతో కలపి, అల్లం, పుదీనా, మిరపకాయలతో అత్యద్భుతంగా తయారుచేసింది. దాన్ని క్యాండీ ఫ్లాస్‌తో అందంగా సర్వ్‌ చేసింది. చూడటానికి ఏదో కళాత్మక ఖండంతో కలగలిసిన వంటకంల ఆకర్షణీయంగా ఉంది. 

ఇక ఆ షోలో సెటబ్రిటీలు ఫరా ఖాన్,  రణవీర్ బ్రార్ , ప్రముఖ చెఫ్‌ ఈ వంటకాన్ని ఎంతో బాగుందంటూ ప్రశంసించారు. అంతేగాదు తాము ఇక నుంచి తమ భోజనంలో ఈ వంటకం ఉండేలా చూసుకుంటామని అన్నారు. కొన్ని వంటకాల తయారీ మనలో దాగున్న ప్రతిభను, సృజనాత్మకతను వెలికి తీస్తాయంటే ఇదే కదూ. అందులోనూ ఆ కంటెస్టెంట్‌ ఆరోగ్యకరమైన వాటితోనే రుచికరమైన డెజర్ట్‌ చేసి మరిన్ని ఎపిసోడ్‌లు కొనసాగేలా అర్హత పొందింది.

 

(చదవండి: కృత్రిమ గుండెతో వంద రోజులకు పైగా బతికిన తొలి వ్యక్తి..!)



 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)